PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం

Eluru factory blast: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్‌ ఫ్యాక్టరీలో

PM Narendra Modi: ఏలూరు ఫ్యాక్టరీ ప్రమాదంపై ప్రధాని మోడీ విచారం.. మృతుల కుటుంబాలకు సంతాపం
Pm Modi
Follow us
Shaik Madar Saheb

|

Updated on: Apr 14, 2022 | 1:17 PM

Eluru Factory Blast: ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరు జిల్లాలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో ఆరుగురు మరణించారు. మసునూరు మండలం అక్కిరెడ్డిగూడెంలో ఉన్న పోరస్ కెమికల్‌ ఫ్యాక్టరీలో బుధవారం రాత్రి ఈ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. గ్యాస్ లీకేజీతో భారీగా మంటలు చెలరేగడంతో ఆరుగురు సజీవ దహనం కాగా.. 12 మందికి తీవ్రగాయాలయ్యాయి. వారి పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. కాగా.. ఈ అగ్ని ప్రమాదంపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ (PM Narendra Modi) విచారం వ్యక్తం చేశారు. కెమికల్ ఫ్యాక్టరీలో పలువురు ప్రాణాలు కోల్పోవటం చాలా బాధాకరం అంటూ పేర్కొన్నారు. ఈ ప్రమాదంలో గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా ప్రధాని మోడీ మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపారు. ఈ మేరకు ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ట్విట్ చేసింది.

కాగా.. అక్కిరెడ్డిగూడెం పోరస్ ఫ్యాక్టరీలో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. మరణించిన వారి కుటుంబాలకు రూ.25 లక్షలు, తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, గాయపడిన వారికి రూ. 2 లక్షలు పరిహారంగా ప్రకటించారు. ఈ సంఘటనపై పూర్తి దర్యాప్తు చేయవల్సిందిగా జిల్లా కలెక్టర్‌ను, ఎస్పీని ఆదేశించారు. గాయపడిన వారికి పూర్తి స్థాయిలో వైద్య సహాయం అందాలంటూ వైఎస్ జగన్ ఆదేశించారు.

ఇంతకీ ఏం జరిగిందంటే..?

అక్కిరెడ్డిగూడెంలో నిన్న రాత్రి పోరస్‌ కంపెనీలోని యూనిట్-4లో గ్యాస్ లీకయింది. ఆ వెంటనే మంటలు చెలరేగి రియాక్టర్ బ్లాస్ట్‌ అయింది. క్షణాల వ్యవధిలో మంటలు ఫ్లోర్ అంతా వ్యాపించాయి. ప్రాణభయంతో కార్మికులంతా తలోదిక్కు పరుగు తీశారు. కానీ అప్పటికే ఐదుగురు కార్మికులు మంటల్లో చిక్కుకుని కాలిబూడిదయ్యారు. మరొకరు ఆసుపత్రికి తరలిస్తుండగా మరణించారు. మరో 12మంది తీవ్రగాయాలతో బయటపడ్డారు.

ఒళ్లంతా కాలిన గాయాలతో కార్మికులు తలోదిక్కు పడి ఉన్నారు. భారీ శబ్దంతో అలర్టయిన గ్రామస్తులు కంపెనీకి చేరుకున్నారు. పోలీసులకి, ఫైర్‌ సిబ్బందికి సమాచారమిచ్చి క్షతగాత్రులను నూజివీడు ఆస్పత్రికి తరలించారు. మెరుగైన ట్రీట్‌మెంట్‌ కోసం విజయవాడకు షిఫ్ట్ చేశారు. 70శాతం కాలిన గాయాలతో కార్మికులకు ఐసీయులో చికిత్స అందిస్తున్నారు. వారిలో పదిమంది పరిస్థితి అత్యంత విషమంగా ఉందన్నారు డాక్టర్లు.

Also Read:

Eluru Fire Accident: ఏలూరు ప్రమాదంపై సీఎం వైఎస్ జగన్ దిగ్భ్రాంతి.. బాధితుల కుటుంబాలకు పరిహారం

IRCTC: ప్రయాణికులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త.. పర్యాటకానికి ప్రత్యేక రైళ్లు.. పూర్తి వివరాలివే

గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
గుడిమెల్లంక గ్రామానికి ఆధ్యాత్మిక శోభ.. రూ.300 కోట్ల వ్యయంతో భారీ
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
భారత అమ్ములపొదలోకి అత్యాధునిక మిస్సైళ్లు!
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
మీకు ఆధార్‌ కార్డ్‌ ఉందా.? వెంటనే ఈ పనిచేయండి..
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
14 ఏళ్లకే హీరోయిన్‏గా ఏంట్రీ..చిరంజీవి అలా పిలుస్తూ ఏడిపించేవారు.
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చివరిగా.. ట్రంప్‌ను ఓ కోర్కె కోరిన జో బిడెన్‌..!
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
చలికాలం సమస్యలకు కొబ్బరి నూనెతో చెక్‌.. ముఖానికి అప్లై చేస్తే..
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
ఈ పూలను వాడితే ముసలితనాన్ని వాయిదా వేయొచ్చు.. అందం అమాంతంగాపెరిగి
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
అమెరికాలో తులసీ గబ్బార్డ్‌కు కీలక బాధ్యతలు.. ఎవరో తెలుసా?
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బంగారం కొనేవారికి శుభవార్త..! ధర ఎంతో తెలిస్తే ఎగిరి గంతేస్తారు..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..
బామ్మ గెటప్‏లో బిగ్‏బాస్ ముద్దుగుమ్మ.. ఇట్టా మారిపోయిందేంట్రా..