Marriage Age: వివాహ వయసు పెంపుపై తీవ్ర వ్యతిరేకత.. పార్లమెంటు స్థాయీ సంఘం ప్రజాభిప్రాయంలో వెల్లడి

యువతుల వివాహ వయసు 21 ఏళ్లకు(marriage age) పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రజా స్పందనల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశంపై పార్లమెంటు స్థాయీ సంఘం ప్రజాభిప్రాయం కోరింది. ఈ అభిప్రాయాల్లో 95...

Marriage Age: వివాహ వయసు పెంపుపై తీవ్ర వ్యతిరేకత.. పార్లమెంటు స్థాయీ సంఘం ప్రజాభిప్రాయంలో వెల్లడి
Marraige
Follow us
Ganesh Mudavath

|

Updated on: Apr 14, 2022 | 11:30 AM

యువతుల వివాహ వయసు 21 ఏళ్లకు(marriage age) పెంచుతూ కేంద్రం తీసుకున్న నిర్ణయానికి ప్రజా స్పందనల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఈ అంశంపై పార్లమెంటు స్థాయీ సంఘం ప్రజాభిప్రాయం కోరింది. ఈ అభిప్రాయాల్లో 95 శాతం వ్యతిరేకంగానే వచ్చాయి. భాజపా ఎంపీ వినయ్‌ సహస్రబుద్ధే(Vinay Sahasra budde) నేతృత్వంలోని ఈ సర్వే జరిగింది. వివాహ వయసును 18 ఏళ్ల నుంచి 21 ఏళ్లకు పెంచాలన్న ప్రతిపాదనను తిరస్కరిస్తూ.. భారీగా మెయిళ్లు వచ్చాయి. ఈ క్రమంలో మహిళల మేలు కోసం ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయాన్ని అడ్డుకునేందుకు ప్రతిపక్షాలు కుట్ర పన్నుతున్నాయని కమిటీ అసహనం వ్యక్తం చేసింది. ఇందులో భాగంగానే ప్రతికూల స్పందనలు వచ్చాయని అనుమానం వ్యక్తం చేసింది. మెయిళ్లలో చాలావరకు ఒకే విధమైన విషయం ఉందని, అవి ఒకే చోటు నుంచి వచ్చి ఉంటుందని సందేహించింది. మహిళల వివాహ వయసును 21 ఏళ్లకు పెంచుతామన్న ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. పురుషులకు సమానంగా మహిళల వివాహ వయస్సు పెంచే ప్రతిపాదనకు గ్రీన్ సిగ్నల్ లభించింది. బాల్యవివాహాల నిరోధక చట్టం 2006లో సవరణలను పార్లమెంట్‌ ముందుకు తీసుకురావడానికి మార్గం సుగమమైంది. జనాభా నియంత్రణ కోసమే ఈ సిఫార్సులు చేయలేదని జయ జైట్లీ పేర్కొన్నారు. ఇటీవలే విడుదలైన జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే సంతానోత్పత్తి రేటు తగ్గుతోందని, జనాభా నియంత్రణలోనే ఉందని చెప్పిందన్నారు. అందుకే తమ తాము మహిళా సాధికారత కోసం ఈ సిఫార్సులు చేశామని స్పష్టం చేశారు.

మరోవైపు.. పురుషులతో పాటు మహిళల వివాహ వయసునూ 21 ఏళ్లకు పెంచితే స్త్రీ – పురుష సమానత్వం రాదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. వీలైతే పురుషుల వివాహ కనీస వయసును కూడా 18 సంవత్సరాలకు తగ్గించాలని.. ప్రపంచంలో చాలా దేశాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయని సూచించాయి. వివాహ వయసును పెంచడం వల్ల బాల్య వివాహాలు ఆగిపోవని, పైగా తల్లిదండ్రులపై ఆర్థిక భారం పడుతుందని అన్నాయి. ఈ బిల్లును వ్యతిరేకిస్తున్న మత సంస్థల ప్రతినిధులను స్థాయీ సంఘం ఆహ్వానించి మాట్లాడాలని కమిటీ సభ్యులు సూచించారు.

Also Read

Gastric Problem: రాత్రిపూట గ్యాస్ట్రిక్ సమస్యతో బాధపడుతున్నారా..? అయితే.. ఇది తప్పనిసరిగా తెలుసుకోండి..

Viral Video: స్టేజ్‌పై వధూవరుల రొమాంటిక్ డ్యాన్స్‌ అదరగొట్టారు !!

Auto Sales: భారీగా పడిపోయిన ద్విచక్ర వహనాల అమ్మకాలు.. 10 ఏళ్ల కనిష్ఠానికి ఎందుకంటే..