Kerala: కేరళలో లవ్ జిహాది కలకలం.. పొలిటికల్ హీట్ పెంచుతున్న టాపిక్

కేరళలో లవ్ జిహాది అంశం కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై లవ్ జిహాది(Love Jihad) ముద్ర వేసి రాజకీయం చేయడం సరికాదని బాధితులు వాపోయారు. తాము ఇరువురూ ప్రేమించుకుంటున్నామని, మతాలు వేరైనా...

Kerala: కేరళలో లవ్ జిహాది కలకలం.. పొలిటికల్ హీట్ పెంచుతున్న టాపిక్
Bhopal Marriage
Follow us

|

Updated on: Apr 14, 2022 | 10:54 AM

కేరళలో లవ్ జిహాది అంశం కలకలం రేపుతోంది. ప్రేమించి పెళ్లి చేసుకున్న జంటపై లవ్ జిహాది(Love Jihad) ముద్ర వేసి రాజకీయం చేయడం సరికాదని బాధితులు వాపోయారు. తాము ఇరువురూ ప్రేమించుకుంటున్నామని, మతాలు వేరైనా ఎవరి మతంలో వారు కొనసాగుతామని తెలిపారు. ఈ అంశాన్ని రాజకీయం చేయడంపై సీపీఎం(CPM in Kerala) పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేరళలోని డీవైఎఫ్‌ఐ నాయకుడు షిజిన్‌ అన్యమతానికి చెందిన యువతిని ప్రేమించి, పెళ్లి చేసుకున్నాడు. ఈ నెల 10న యువతి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. ఘటనపై యువతి కుటుంబసభ్యులు పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఇది లవ్‌ జిహాద్‌ అని, తమ కుమార్తెను కోర్టు ముందు హాజరుపరచాలని కోరుతూ యువతి తండ్రి కేరళ హైకోర్టులో(Kerala High Court) హెబియస్‌ కార్పస్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీంతో యువతి కోర్టులో హాజరైంది. తాను తల్లిదండ్రుల వద్దకు వెళ్లేందుకు సిద్ధంగా లేనని స్పష్టం చేయడంతో హైకోర్టు వారిని విడుదల చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై సీపీఎం కోజికోడ్‌ జిల్లా కార్యవర్గ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే జార్జ్‌ ఎం థామస్‌ మంగళవారం కీలక వ్యాఖ్యలు చేశాయి.

లవ్‌ జిహాద్‌ అనేది నిజం. ఎస్‌డీపీఐ, జమాత్‌ ఏ ఇస్లామీ వంటి సంస్థలు బాగా చదువుకున్న ఇతర మతాల యువతులను ట్రాప్‌ చేసి, లవ్‌ జిహాద్‌కు పాల్పడేలా ప్రోత్సహిస్తాయని అన్నారు. సదరు యువకుడు ఆ యువతిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నప్పుడు ముందే ఆ విషయాన్ని పార్టీకి తెలియజేయాల్సిందని అభిప్రాయ పడ్డారు. ఇలా చేయకపోవడం ద్వారా ఈ ప్రాంతంలో పార్టీకి మద్దతుగా ఉండే వర్గం దూరమయ్యే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు. థామస్ కామెంట్లతో సీపీఎంపై విమర్శలు వెల్లువెత్తాయి. ఇదే సమయంలో తమ పెళ్లిపై వివాదం జరుగుతున్నందున యువతీయువకులు స్పష్టత ఇచ్చారు. తమది లవ్ జీహాది కానే కాదని స్పష్టం చేశారు.

Also Read

Electric Vehicles: ఎలక్ట్రిక్ వాహనాలు కొనేవారికి ఎన్ని ప్రయోజనాలో.. లోన్ ఆఫర్లు, టాక్స్ సేవింగ్స్.. ఇంకెన్నో..

Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..

Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!