Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన బీస్ట్ (Beast Movie) సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది.

Beast box office day 1: బీస్ట్ సినిమా ఫస్ట్ డే కలెక్షన్స్.. మొదటి రోజే ఎంత వసూలు చేశారంటే..
Vijay
Follow us

|

Updated on: Apr 14, 2022 | 9:05 AM

తమిళ్ స్టార్ హీరో విజయ్ తలపతి (Vijay Thalapathy), డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ కాంబోలో వచ్చిన బీస్ట్ (Beast Movie) సినిమాకు మిశ్రమ స్పందన వస్తోంది. ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ సినిమా ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. యాక్షన్ కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాను సన్ పిక్చర్స్ నిర్మించింది. ఇందులో విజయ్ సరసన పూజా హెగ్డే నటించింది. ఓవైపు ఈ సినిమా సూపర్ హిట్ అంటూ టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు విజయ్ అభిమానులు సినిమా నచ్చలేదంటూ రచ్చ చేసిన సంగతి తెలిసిందే. మొత్తానికి బీస్ట్ సినిమా మాత్రం బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్‏తో దూసుకుపోతుంది. ఓ షాపింగ్ మాల్‏లో ఉన్న జనాలను కొందరు టెర్రరిస్టులు బందీలుగా చేసుకుంటారు. దీంతో మాజీ రా ఏజెంట్ అయిన విజయ్ వారిని ఎలా రక్షించారనేది ఈ మూవీ కథాంశం. ఇందులో విజయ్ వీర రాఘవన్ పాత్రలో కనిపించారు. పాన్ ఇండియా లెవల్లో విడుదలైన ఈ సినిమా తమిళనాడులో నిన్న ఉదయం 4 గంటలకే తొలి షో ప్రారంభమయ్యింది.

ఇక ఈ సినిమా తెలుగు థియేట్రికల్ హక్కులను ప్రముఖ నిర్మాత దిల్ రాజు దక్కించుకున్నారు. యూఎస్ఏల బీస్ట్ సినిమా 426 థియేటర్లలో విడుదలైంది. తెలుగు, తమిళ్ వెర్షన్ హక్కులు ఓవర్సీస్ లో పెద్ద మొత్తంలో అమ్ముడు పోయాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 505కి పైగా థియేటర్లలో ఈ సినిమా విడుదలైంది. మొదటి రోజే ఈ మూవీ నైజాంలో రూ. 3.05 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. అలాగే సీడెడ్‏లో రూ. 2.1 కోట్లు, ఆంధ్రాలో రూ. 4.40 కోట్లు వసూలు చేసినట్లుగా సమాచారం. ఇక నైజాంలో 175 థియేటర్లలో సీడెడ్‌లో 90 థియేటర్లలో మరియు ఆంధ్రాలో 240 థియేటర్లలో తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 505 థియేటర్లలో విడుదలైంది. ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణలలో ‘బీస్ట్’ 40-50% ఆక్యుపెన్సీతో తొలిరోజు రూ. 5-7 కోట్లకు పైగా వసూలు చేసింది. తెలుగు రాష్ట్రాల్లో బీస్ట్ సినిమా తొలిరోజే.. రూ. 7.5 కోట్లు వసూలు చేసినట్లుగా సమచారం. ఇక తమిళనాడులో ఈ సినిమా మొదటి రోజే.. రూ. 30 నుంచి 35 కోట్లు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. దేశవ్యాప్తంగా ఈ మూవీ రూ. 50కోట్ల మార్క్ దాటేసిందని టాక్. ఇక ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా బాక్సాఫీస్.. వద్ద మొదటి రోజే.. రూ. 65 కోట్లకుపైగా వసూలు చేసిందని టాక్ నడుస్తోంది.

Also Read: Gentleman 2 : జెంటిల్‌మేన్ 2లో మరో హీరోయిన్.. అధికారికంగా ప్రకటించిన చిత్రయూనిట్.. ఎవరంటే..

James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..

KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
వీడియోలు డిలీట్ చేయ్.. గంభీర్‌తో గొడవపై శ్రీశాంత్‌కు నోటీసులు
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
రోజూ ఒక స్పూన్ ఇది తీసుకుంటే.. జరిగే అద్భుతాలు మీకే తెలుస్తుంది!
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
సామ్‌సంగ్‌ నుంచి మరో అద్భుతం.. ప్రపంచంలోనే తొలి ఏఐ ల్యాప్‌టాప్‌
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
చలి కాలంలో వేధించే ఒళ్లు నొప్పులు.. ఈ చిట్కాలతో మాయం చేయవచ్చు!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
తెలంగాణలో 'పవర్‌'ఫుల్‌ పాలిట్రిక్స్‌.. తీగలాగితే..!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
మీ పిల్లలు బలంగా ఉండాలని.. పాలల్లో ఈ పౌడర్ కలుపుతున్నారా!
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
కేసీఆర్‌కు ఆపరేషన్ విజయవంతం.. డిశ్చార్జి ఎప్పుడంటే?
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
పిల్లలు కిచెన్ సామాన్లతో ఆడుకుంటే ఎన్ని బెనిఫిట్స్ ఉన్నాయో తెలుసా
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
ఏపీపీఎస్సీ గ్రూప్‌-2 నోటిషికేషన్‌.. విభాగాల వారీగా ఖాళీల వివరాలు
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌
కస్టమర్లను ఆకట్టుకోవడానికి రాయల్‌ఎన్‌ఫీల్డ్‌ నయా ప్లాన్‌