AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతున్నాయి ఓటీటీలు. కరోనా సంక్షోభంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోయింది.

James: ఓటీటీలో సందడి చేయనున్న మరో రెండు సూపర్ హిట్స్.. పునీత్ చివరి మూవీతోపాటు..
James
Rajitha Chanti
|

Updated on: Apr 14, 2022 | 7:58 AM

Share

ప్రేక్షకులకు ఎప్పటికప్పుడు సరికొత్త వినోదాన్ని అందిస్తూ దూసుకుపోతున్నాయి ఓటీటీలు. కరోనా సంక్షోభంలో థియేటర్లు మూతపడడంతో ఓటీటీలకు ఆదరణ పెరిగిపోయింది. వెబ్ సిరీస్, సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇప్పుడు థియేటర్లు ఓపెన్ అయి.. సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్స్ సాధించినా గానీ.. ఓటీటీల క్రేజ్ మాత్రం తగ్గడం లేదు. ఇప్పటికీ కొందరు స్టార్ హీరోస్ సినిమాలు నేరుగా ఓటీటీలో విడుదలవుతున్న సంగతి తెలసిందే. ఇక మరోవైపు.. థియేటర్లలో విడుదలైన సినిమాలు నెల రోజులు కాకముందే ఓటీటీలో విడుదలవుతున్నాయి. ఇప్పటికే అఖండ, భీమ్లానాయక్, ఈటీ, రాధేశ్యామ్, పుష్ప వంటి సూపర్ హిట్ చిత్రాలు ఓటీటీలో సందడి చేస్తున్నాయి. తాజాగా మరో రెండు చిత్రాలు ఓటీటీలో విడుదలయ్యేందుకు సిద్ధమయ్యాయి.

టాలెంటెడ్ హీరో శర్వానంద్, రష్మిక జంటగా నటించిన లేటేస్ట్ చిత్రం ఆడవాళ్లు మీకు జోహర్లు. మార్చి 4న విడుదలైన ఈ సినిమా మంచి టాక్ సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత శర్వానంద్ నుంచి వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది. ఈ సినిమా ఇప్పుడు ప్రముఖ ఓటీటీ సంస్థ సోనీ లివ్‏లో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానుంది. అలాగే. మరోవైపు.. కన్నడ పవర్ స్టార్ దివంగత హీరో పునీత్ రాజ్ కుమార్ నటించిన జేమ్స్ సినిమా కూడా ఓటీటీలోకి రానుంది. పునీత్ రాజ్ కుమార్ చివరిగా నటించిన ఈ సినిమా ఆయన పుట్టిన రోజు సందర్భంగా మార్చి 17న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఈ మూవీ సోనీ లివ్‏ ఓటీటీలో ఏప్రిల్ 14న స్ట్రీమింగ్ కానుంది. ఒకేరోజు రెండు సూపర్ హిట్ చిత్రాలను ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తుంది సోనీ లివ్.

Also Read: KGF 2 Twitter Review: కేజీఎఫ్ 2 ట్విట్టర్ రివ్యూ..  సినిమా ఎలా ఉందంటే..

Sonu Sood: నా భార్య రక్తం తాగుతోందని నెటిజన్‌ ట్వీట్‌.. సోనూ సూద్ ఏం సమాధానం ఇచ్చాడో తెలుసా?

Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..

Sunny Leone: స్పీడ్ పెంచిన సన్నీ లియోన్.. బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీ బిజీగా ..