AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Aha Tamil OTT: తమిళనాట అడుగుపెట్టిన ఆహా.. అచ్చ తమిళ కంటెంట్‌తో.. చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్

100 % తెలుగు ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా ప్రేక్షకుల మన్నలను అందుకుంది ఆహా. తెలుగు ప్రేక్ష‌కుల‌కు అన్ లిమిటెడ్ ఎంట‌ర్‌టైన్మెంట్‌ను అందిస్తూ దూసుకుపోతుంది.

Aha Tamil OTT:  తమిళనాట అడుగుపెట్టిన ఆహా.. అచ్చ తమిళ కంటెంట్‌తో.. చెన్నైలో గ్రాండ్‌గా లాంచ్
Aha
Rajeev Rayala
|

Updated on: Apr 14, 2022 | 6:41 PM

Share

Tamil Aha OTT: తెలుగు లోగిళ్లలో ఆహా(Aha) అంటూ సందడి చేసి ఎంటర్‌టైన్‌మెంట్‌కి కేరాఫ్‌ అడ్రస్‌గా నిలిచిన ఓటీటీ ఫ్లాట్‌ఫామ్‌ ఆహా. తిరుగులేని ఈ ఓటీటీ సంస్థ ఇప్పుడు తమిళనాట(Tamil Nadu) అడుగు పెట్టింది. అచ్చ తమిళ్ కంటెంట్‌తో తమిళనాడు ప్రేక్షకులకు కూడా వినోదాన్ని అందించేందుకు రెడీ అయింది. సినిమాలు, వెబ్‌ సిరీస్‌లు, పాపులర్‌ షోలతో తమిళనాడు ప్రేక్షకులకు టన్నుల కొద్దీ వినోదాన్ని ఇచ్చేందుకు సిద్ధమైంది ఆహా. ఇన్నిరోజులు తెలుగు ప్రేక్షకులను అలరించిన ఆహా ఇప్పుడు తమిళ తంబీలను ఆకట్టుకోనుంది. తమ కార్యక్రమాలను ఇతర భాషల్లోకి విస్తరింప చేయాలని గత కొంతకాలంగా ప్రయత్నిస్తున్న ఆహా ప్రమోటర్లు అల్లు అరవింద్ – జూపల్లి రాము రావు ఆ దిశగా ముందడుగులు వేస్తున్నారు. కోట్లాది మంది తమిళ ప్రేక్షకుల ఎదురు చూపులను నిజం చేస్తూ ఆహా కోలీవుడ్ లోకి గ్రాండ్ గా ఎంట్రీ ఇచ్చింది.

తమిళ నూతన సంవత్సరాది వేళ చెన్నైలోని లీలా ప్యాలెస్ లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె స్టాలిన్ చేతుల మీదుగా ఆహా తమిళ్ ఓటీటీ లాంచ్ అయ్యింది. ఈ కార్యక్రమంలో నటుడు శింబు, సంగీత దర్శకుడు అనిరుధ్ రవిచందర్ హాజరయ్యారు. వీరిద్దరూ ఆహా తమిళ్ కు బ్రాండ్ అంబాసిడర్లు గా వ్యవహరించడం విశేషం. వీరితోపాటు ఉదయ్ నిధి స్టాలిన్, దర్శకుడు వంశీ పైడిపల్లి, ఎస్ జే సూర్య హాజరయ్యారు. ఈ సందర్భంగా ‘తట్టిన తమిళ్ మట్టుమే’ అనే సినిమాను ఆహా తమిళ్ లో ప్రసారం చేశారు. ఈ కార్యక్రమంలో తమిళ సినీ దిగ్గజాలు ఎస్‌పి ముత్తురామన్, భారతీరాజా, దివంగత ఎవి మెయ్యప్పన్, దివంగత ఎంఎస్ విశ్వనాథన్, దివంగత కె బాలచందర్, దివంగత ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, దివంగత నటి శ్రీదేవికి ముఖ్యమంత్రి స్టాలిన్, ఆహా యాజమాన్యం “కలైంజర్ హానర్” పురస్కారాన్ని అందించారు. అలాగే ఈ కార్యక్రమానికి ప్రముఖ దర్శకులు, స్క్రీన్ రైటర్లు, నిర్మాతలతో సహా కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ వ్యక్తులు పలువురు హాజరయ్యారు. టీమ్‌ను అభినందిస్తూ..ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ వీడియో బైట్ ద్వారా ఆహా తమిళ్ టీమ్ కి తన విషెస్ తెలిపారు.

‘ఆహా తమిళ్’ ఓటీటీలో తమిళ చిత్రాలతో పాటు డబ్బింగ్ సినిమాలను, రకరకాల వెబ్ సిరీసులు, అలాగే టాక్ షోలను, గేమ్ షోలను ప్రసారం చేయనున్నారు. నేడు తమిళ సంవత్సరాదిని పురస్కరించుకుని నూరు శాతం తమిళ ఓటీటీగా ‘ఆహా’ ప్రసారాలను ప్రారంభించారు. ఆహా ఇప్పటికే తన తెలుగు కంటెంట్ విజయంతో లోకల్ ఎంటర్‌టైన్‌మెంట్‌లో నెంబర్ వన్ బ్రాండ్‌గా కొన్సాసాగుతుంది. 2020లో తెలుగు కంటెంట్‌తో తమ ప్రయాణాన్ని ప్రారంభించి.. ఒక సంవత్సరంలోనే ఒక మిలియన్ సబ్‌స్క్రైబర్‌లను సంపాదించింది. అలాగే 27 మిలియన్లకు పైగా డౌన్‌లోడ్‌లను రీచ్  అయ్యింది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

Priyamani: మల్టీకలర్ శారీలో మత్తెక్కించే ఫోజులు ప్రియమణి లేటెస్ట్ పిక్స్

Anasuya Bharadwaj: నీలిరంగు చీరలోనా చందమామ నీవే జాణ.. అనసూయ భరద్వాజ్ లేటెస్ట్ ఫోటోస్

భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
భవిష్యత్తులో బంగారంతో ప్రైవేట్ జెట్ కొనుగోలు చేయొచ్చా..?
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
శ్రీ భక్తులకు సూపర్ గుడ్ న్యూస్.. ప్రత్యేక దర్శన టికెట్లు విడుదల
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
నదిలో కుప్పలు తెప్పలుగా శవాలు..OTTలోకి వచ్చేసిన క్రైమ్ థ్రిల్లర్
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
మీరు తాగే బ్లాక్ కాఫీ మీ ఆరోగ్యాన్ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో తెలుసా
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ప్రభాస్ ఆకలి కోసం నేను దొంగతనం చేయాల్సి వచ్చింది..
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఆదివారం ఈ వస్తువులు కొంటే దరిద్రం మీ వెంటే! మర్చిపోయి కొనకండి
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
ఏపీలో అక్కడ ఒక్కో కోడి రూ.8 వేలు.. కారణం ఏంటంటే..?
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
రూ.15 కోట్ల రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చేసిన హీరో.. ఎందుకంటే..
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఈ ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పనసకు దూరంగా ఉండటమే మేలు!
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి
ఆదివారం ఈ పనులు అస్సలు చేయొద్దు.. కోరి సమస్యలు తెచ్చుకోకండి