AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..

KGF chapter 2: కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా నటించిన చిత్రం కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది.

KGF chapter 2: యశ్‌ సినిమాపై సాయి ధరమ్‌ తేజ్‌ పోస్ట్‌ వైరల్‌.. ఇంతకీ ఏమన్నాడంటే..
Kgf Chapter 2
Basha Shek
|

Updated on: Apr 14, 2022 | 3:03 PM

Share

KGF chapter 2: కన్నడ రాక్‌ స్టార్‌ యశ్‌ (Yash) హీరోగా నటించిన చిత్రం కేజీఎఫ్‌ ఛాప్టర్‌ 2. ప్రశాంత్‌ నీల్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటించింది. అలనాటి అందాల తార రవీనా టాండన్, సంజయ్‌దత్‌, ప్రకాశ్‌రాజ్‌, రావు రమేశ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. గతంలో వచ్చిన కేజీఎఫ్‌ సినిమాకు సీక్వెల్‌గా ఈ చిత్రం తెరకెక్కింది. కరోనా కారణంగా వాయిదా పడుతూ వస్తోన్న ఈ మోస్ట్‌ అవైటెడ్‌ మూవీ ఎట్టకేలకు నేడు (ఏప్రిల్‌14) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి షోతోనే బ్లాక్‌ బాస్టర్‌ హిట్‌ టాక్‌ తెచ్చుకుంది. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు యశ్‌ చిత్రంపై ప్రశంసలు కురిపిస్తున్నారు. సినిమాలో యశ్‌ నటన అదిరిపోయిందని కొనియాడుతున్నారు. ఈక్రమంలో మెగా హీరో సాయి ధరమ్‌ తేజ్‌ (Sai Dharam Tej) కేజీఎఫ్‌ చాప్టర్‌2 సినిమాపై స్పందించారు. సినిమా మంచి విజయం సాధించాలని ఆకాంక్షిస్తూ ట్వీట్ పెట్టాడు.

‘కేజీఎఫ్ మూవీతో భారతీయ సినిమాను ఉర్రూతలూగించారు. దేశ వ్యాప్తంగా ఈ సినిమా సౌండ్‌ వినిపించారు. అలాగే ఇప్పుడు కేజీఎఫ్ 2తో మరోసారి భారతీయ సినిమా గురించి ప్రపంచ వ్యాప్తంగా మాట్లాడుకోవాలి’ అని ట్వీట్‌లో రాసుకొచ్చాడు తేజ్‌. అదేవిధంగా సినిమా సూపర్‌ సక్సెస్‌ కావాలని చిత్ర బృందానికి విష్ చేశాడు. కేజీఎఫ్‌ 2 సినిమా గురించి సాయి ధరమ్‌ చేసిన ట్వీట్‌ ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది. కాగా గతేడాది రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ ఈ మెగా హీరో మళ్లీ బిజీ కానున్నాడు. ‘SDT 15’ అనే వర్కింగ్‌ టైటిల్‌తో రూపుదిద్దుకుంటోన్న సినిమా షూటింగ్‌ లలో పాల్గొననున్నాడు. ఇక తేజ్‌ నటించిన చివరి చిత్రం రిపబ్లిక్‌ విమర్శకుల ప్రశంసలు పొందింది.

Also Read: KGF 2 Movie: ఎన్టీఆర్ మదర్ పై కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ రాకీభాయ్ ఏమన్నాడంటే..

KGF 2 Movie: ఎన్టీఆర్ మదర్ పై కేజీఎఫ్ స్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు.. ఇంతకీ రాకీభాయ్ ఏమన్నాడంటే..

Realme Narzo 50A Prime: భారత్‌లో రియల్‌మి ప్రైమ్ త్వరలోనే లాంచ్..