Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..

Pawan Kalyan: క్రేజీ ప్రాజెక్ట్స్ ను లైనప్ చేస్తున్న పవర్ స్టార్.. పవన్ కిట్టీలో ఉన్న సినిమాలు ఇవే..
Pawan Kalyan

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా అంటే ఫ్యాన్స్ లో ఊపు మాములుగా ఉండదు. ఆయన సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు.

Rajeev Rayala

|

Apr 13, 2022 | 9:14 PM

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా అంటే ఫ్యాన్స్ లో ఊపు మాములుగా ఉండదు. ఆయన సినిమా కోసం వేయి కళ్ళతో ఎదురుచూస్తూ ఉంటారు అభిమానులు. వకీల్‌సాబ్ మూవీ రిలీజై బ్లాక్‌బస్టర్ సౌండ్ ఇచ్చి ఈ మద్యే ఏడాది పూర్తయ్యింది. పవర్‌స్టార్‌ ఇమేజ్‌కి, పవన్‌ ఐడియాలజీకి పిక్చర్ పర్‌ఫెక్ట్ అనిపించుకుంది వకీల్‌సాబ్. ఆ తర్వాత గడిచిన క్యాలెండర్ ఇయర్‌లో పీకే ఫిల్మీ మైండ్‌సెట్‌లో చాలా మార్పులొచ్చేశాయి. అటోఇటో ఎటోవైపు అంటూ టర్న్ ఇచ్చుకున్నారు. ఎక్స్‌పరిమెంట్స్‌కి వెల్‌కమ్ అంటూ గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చేశారు. మరో స్టార్‌ హీరోతో దాదాపు ఈక్వల్‌గా స్క్రీన్‌ షేర్ చేసుకోడానికి పవన్ ఓకే చెప్పబట్టి భీమ్లానాయక్ లాంటి మల్టిస్టారర్‌ తెరకెక్కింది. ఇలా డీవియేషన్స్‌ తీసుకుంటున్న టైమ్‌లోనే లేటెస్ట్ బాక్సాఫీస్ వండర్ కాశ్మీర్‌ ఫైల్స్‌ కూడా పవన్‌ మనసు మార్చేసిందట. కాశ్మీర్‌ఫైల్స్ ప్రొడ్యూసర్ అభిషేక్‌ అగర్వాల్ రీసెంట్‌గా పవన్‌తో భేటీ అయ్యారు. వాళ్ల పక్కనే డైరెక్టర్ హరీష్‌ శంకర్ కూడా ఉండడంతో.. వాటీజ్ గోయింగ్ ఆన్ దేర్.. అనే క్యూరియాసిటీ మొదలైంది. ఇప్పటికే రవితేజతో సినిమా చేస్తున్న అభిషేక్‌.. పవన్‌ దగ్గర కూడా ఒక ప్రపోజల్ పెట్టారన్నది టాక్. కాశ్మీర్‌ ఫైల్స్‌ ప్రొడ్యూసర్‌తో సినిమా చేస్తే ఆవిధంగా నేషనల్ క్రేజ్ వస్తుందని పీకే కాంపౌండ్‌ కూడా లెక్కలేసుకుంటోంది. మరోవైపు.. స్టార్ రైటర్ విజయేంద్రప్రసాద్‌ పవన్‌కిచ్చిన సూపర్ కాంప్లిమెంట్ బాగా వైరల్ అవుతోందిప్పుడు.

భజరంగీ భాయ్‌జాన్‌ లాంటిదే క్రాస్‌బార్డర్ స్టోరీ లైన్ మరొకటి తన దగ్గరుందని, పవన్‌ హీరోగా దాన్ని డైరెక్ట్ చేసే ఛాన్స్ కోసం ట్రిపులార్ రైటర్‌ సీరియస్‌గా ట్రై చేస్తున్నారని ఫిలిమ్‌నగర్‌ టాక్. ఇప్పటికే వినోదయ సితం అనే తమిళ్‌ డిజిటల్ మూవీకి తెలుగు వెర్షన్ రాసి పవన్‌-సాయిధరమ్‌ కాంబోను వర్కవుట్ చేస్తున్నారు త్రివిక్రమ్. మలయాళ మూవీ డ్రైవింగ్ లైసెన్స్ కూడా పీకే కన్సిడరేషన్‌లో భద్రంగా వుంది. సో… పవర్‌స్టార్ కిట్టీలో మరికొన్ని సర్‌ప్రైజెస్‌ని ఎక్స్‌పెక్ట్ చెయ్యొచ్చన్నమాట.

మరిన్ని ఇక్కడ చదవండి : 

K.G.F Chapter 2: రిలీజ్‌కు రెడీ అయిన కేజీఎఫ్‌2…రాకీ భాయ్‌కి అక్కడ అరుదైన గౌరవం.. ఏకంగా

Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు

Sonal Chauhan: ప్రభాస్ సరసన బాలయ్య హీరోయిన్.. అదృష్టంగా భావిస్తున్నా అంటున్న అమ్మడు..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu