Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!

Mahavir Jayanti 2022: నేడు జైనమతం 24వ తీర్థంకరుడైన లార్డ్ మహావీర్ జయంతి. ఆయన రాజకుటుంబంలో జన్మించారు. కానీ 30 సంవత్సరాల వయస్సులోనే ప్రాపంచిక సుఖాలను వదులుకున్నారు.

Mahavir Jayanti 2022: నేడు భగవాన్ మహావీర్ జయంతి.. ఆయన చెప్పిన సూత్రాలు అందరికి ఆదర్శప్రాయం..!
Mahavir Jayanti 2022
Follow us
uppula Raju

|

Updated on: Apr 14, 2022 | 8:45 AM

Mahavir Jayanti 2022: నేడు జైనమతం 24వ తీర్థంకరుడైన లార్డ్ మహావీర్ జయంతి. ఆయన రాజకుటుంబంలో జన్మించారు. కానీ 30 సంవత్సరాల వయస్సులోనే ప్రాపంచిక సుఖాలను వదులుకున్నారు. జ్ఞాన అన్వేషణలో ఆయన 12 సంవత్సరాలు కఠినమైన తపస్సు చేశారు. జైన మత ప్రచారానికి మహావీర్ స్వామి చాలా కృషి చేశారు. మగధలో తన మూలాలను స్థాపించిన తరువాత ఆయన జైన మతాన్ని దక్షిణ భారతదేశం వైపునకు విస్తరించారు. చంద్రగుప్త మౌర్యుడు దక్షిణ భారతదేశానికి వెళ్లిన తర్వాతే జైనమతాన్ని స్వీకరించాడని చెబుతారు. మహావీర్ సత్య, అహింస, అస్తేయ, అపరిగ్రహ, బ్రహ్మచర్య అనే ఐదు జీవిత సూత్రాల ప్రాముఖ్యతను ప్రజలకు తెలియజేశారు. ఆయన సూత్రాలు జీవితంలో ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా ఉపయోగపడతాయి.

మహావీర్ స్వామి బోధనలు

1. అందరూ సుఖాన్ని ఇష్టపడతారు. దుఃఖం మంచిది కాదు. హింస ప్రతి ఒక్కరికీ చెడ్డది. ప్రతి ఒక్కరూ జీవించడానికి ఇష్టపడతారు. అన్ని జీవులు జీవించడానికి ఇష్టపడతాయి. ప్రతి ఒక్కరూ జీవితాన్ని ప్రేమిస్తారు.

2. దేవునికి ప్రత్యేక ఉనికి లేదు. సరైన దిశలో అత్యున్నత ప్రయత్నాలు చేస్తే దైవత్వాన్ని పొందవచ్చు.

3. మండుతున్న అడవి మధ్యలో ఎత్తైన చెట్టు మీద ఒక వ్యక్తి కూర్చుని ఉన్నాడు. అన్ని జీవరాశులు చనిపోవడం చూస్తాడు. అయితే త్వరలో అతడికి కూడా అదే పరిస్థితి రాబోతోందని అర్థం కావడం లేదు. అలాంటి వ్యక్తి మూర్ఖుడు.

4. మీరు బాధలను ఇష్టపడనట్లే ఇతరులు కూడా ఇష్టపడరు. జీవిత పరమార్థం గురించి తెలియని వారు ఉపవాసం పాటించడం, మతపరమైన ప్రవర్తనా నియమాలను పాటించడం, బ్రహ్మచర్యం, తపస్సులను చేయడం వల్ల మోక్షం పొందలేరు.

5. అన్ని జీవుల పట్ల హింసారహితంగా ఉండాలి. మనసుతో, మాటతో, శరీరంతో ఎవరినీ హింసించకపోవడమే నిజమైన ఆత్మనిగ్రహం.

6. అహింస అనేది అతి పెద్ద మతం. ఒకరి ఉనికిని చెరిపేసే బదులు, వారిని ప్రశాంతంగా జీవించనివ్వండి. ప్రపంచంలోని సమస్త ప్రాణుల పట్ల కరుణ చూపండి.

7. గెలిచినందుకు గర్వపడకూడదు, ఓడిపోయినందుకు బాధపడకూడదు. భయాన్ని జయించిన వ్యక్తి మాత్రమే ప్రశాంతతను అనుభవించగలడు.

Rohit Sharma: రోహిత్‌ శర్మ మరో ఘనత.. ఈ విషయంలో కోహ్లీ తర్వాత రెండోవాడు ఇతడే..!

Ambedkar Jayanti 2022: నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన చేసిన ఈ 7 పనులకి అందరూ సెల్యూట్‌ చేయాల్సిందే..!

IPL 2022: యుజ్వేంద్ర చాహల్‌కి తిరుగులేదు.. రేసులోకి చేరిన ఓడియన్ స్మిత్..!

ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
ఓ మై డ్రైవరన్నా.. ఒక చేత్తో డ్రైవింగ్.. మరో చేత్తో మహిళ బ్యాగ్‌లో
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
దేశంలో డేంజర్‌ బెల్స్‌ మోగిస్తున్న హెచ్‌ పైలోరీ బ్యాక్టీరియా.!
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
చాగంటి కోటేశ్వరరావుకు కేబినెట్ ర్యాంక్ పదవిపై ఆయన స్పందన.
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
గ్రేటర్ వాసులకు అలర్ట్.! మీ ఏరియాల్లో మంచినీటి సరఫరాకు బ్రేక్..
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
ప్రభాస్‌ హీరోయిన్‌ను ముందుగా ఎంచుకుంది మనోడే.! బట్ మిస్ అయ్యిందే!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
వందల కోట్ల ఆస్తి ఉంది.. అయినా 40 ఏళ్లుగా అద్దె ఇంట్లోనే బతుకు.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
మాజీ భర్త నేరాల కారణంగా.. దుబాయ్‌ రోడ్లపై బిచ్చగత్తెలా హీరోయిన్.!
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
పని భారంతో సెట్లోనే ఏడ్చిన సాయి పల్లవి! ఆసినిమా షూటింగ్ లో కష్టలు
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
ఆడకున్నా.. రూ.17 లక్షలు.! గంగవ్వ ముచ్చటే వేరు.!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!
అటు అగరబత్తీలు, ఇటు బిస్కెట్లు.. పుష్ప2కు భారీగా పెరిగిన క్రేజ్‌!