Ontimitta: పండు వెన్నెల్లో కోదండరాముడి కల్యాణం.. రామయ్య పరిణయానికి సిద్ధమైన ఒంటిమిట్ట
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట(Ontimitta) శ్రీకోదండరాముడి కల్యాణానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో రాముల వారి...
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం ఒంటిమిట్ట(Ontimitta) శ్రీకోదండరాముడి కల్యాణానికి అధికారులు ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనెల 15 రాత్రి 8 గంటల నుంచి 10 గంటల వరకు పండు వెన్నెల్లో రాముల వారి కల్యాణాన్ని అత్యంత వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ(TTD) ఏర్పాట్లు చేస్తోంది. స్వామివారి కల్యాణం కోసం వంద కిలోల ముత్యాల తలంబ్రాలు సిద్ధం చేశారు. వాటిని ప్యాకెట్ల రూపంలో భక్తులకు అందించనున్నారు. ముత్యాల తలంబ్రాలే కాకుండా రాష్ట్రం నలుమూలల నుంచి తెచ్చిన గోటితో ఒలిచిన తలంబ్రాలనూ స్వామివారికి సమర్పించనున్నారు. ఒంటిమిట్ట రాములవారి కల్యాణం భిన్నమైన సంప్రదాయం ప్రకారం జరుగుతుంది. దేశంలో ఎక్కడా లేని విధంగా చతుర్దశి రాత్రి కల్యాణం నిర్వహిస్తారు. అయోధ్యాపురిలో జన్మించిన శ్రీరాముడు వనవాసంలో భాగంగా దక్షిణాది వైపు ప్రయాణం చేశారని పురాణ గాథలు చెబుతున్నాయి. ఒంటిమిట్ట ఆలయంలోని సీతారామలక్ష్మణుల విగ్రహాలు మూడూ ఒకే శిలలో చెక్కడం విశేషం. ప్రతి రామాలయంలోనూ కనిపించే ఆంజనేయస్వామి విగ్రహం ఇక్కడ కనిపించదు. ఎందుకంటే రాముల వారు ఆంజనేయుడిని కలవక ముందే ఇక్కడకు వచ్చారని, అందుకే ఇక్కడ హనుమంతుని విగ్రహం ఉండదని చెబుతుంటారు.
కోదండరాముడి బ్రహ్మోత్సవాల్లో భాగంగా రేపు రాత్రి నిర్వహించే కోదండరాముడి కల్యాణానికి సీఎం జగన్ హాజరుకానున్నారు. ప్రభుత్వం నుంచి స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. ముఖ్యమంత్రి రాక నేపథ్యంలో ఒంటిమిట్ట పరిసర ప్రాంతాల్లో పోలీసులు పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశారు. స్వాగత తోరణాలు, బారికెడ్లు, ఆర్చీల నిర్మాణం పూర్తైంది. కల్యాణానికి దాదాపు లక్ష మంది భక్తులు తరలివచ్చే అవకాశముందని భావిస్తున్నారు. వారికి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు.
Also Read
KGF 2 Review: హై ఎక్స్పెక్టేషన్స్.. అంతకు మించిన ఎలివేషన్స్.. ఆహా అనిపించిన రాకీ భాయ్!
Coronavirus: దేశంలో స్వల్పంగా తగ్గిన కరోనా కేసులు.. నిన్న ఎంతమంది కోలుకున్నారంటే..?
Bank Holidays: కస్టమర్లకు అలర్ట్.. నేడు, రేపు బ్యాంకులకు సెలవులు.. నిలిచిపోయిన సేవలు..