Ambedkar Jayanti 2022: నేడు అంబేద్కర్ జయంతి.. ఆయన చేసిన ఈ 7 పనులకి అందరూ సెల్యూట్ చేయాల్సిందే..!
Ambedkar Jayanti 2022: నేడు దేశం మొత్తం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను జరుపుకుంటుంది. ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించారు.
Ambedkar Jayanti 2022: నేడు దేశం మొత్తం రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ 131వ జయంతి వేడుకలను జరుపుకుంటుంది. ఆయన 1891 ఏప్రిల్ 14న జన్మించారు. అంబేద్కర్ గొప్ప పండితుడు, సంఘ సంస్కర్త, దళితుల దూత, ప్రజల మనిషిగా ప్రసిద్ధి చెందారు. బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు వచ్చినప్పుడల్లా రిజర్వేషన్ విషయంలో ఆయన తీసుకున్న చర్యల గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. బాబా సాహెబ్ బాల్యంలో చదవడం, రాయడంలో చాలా వేగంగా ఉండేవారు. అతనిలోని ఆ గుణాన్ని చూసి స్కూల్ టీచర్లందరూ మెచ్చుకునేవారు. ఉపాధ్యాయులలో ఒకరైన కృష్ణ మహదేవ్ అంబేద్కర్ అంటే ఆయనకు అమితమైన ప్రేమ. ఈ అభిమానం కారణంగా భీమ్‌రావ్‌కి.. అంబేద్కర్ పేరు యాడ్ చేసి అందరు భీమ్‌రావ్ అంబేద్కర్ అని పిలిచేవారు.
అంబేద్కర్ చేసిన కొన్ని గొప్ప పనులు..
1. భారతదేశంలో 8 గంటల పని అనేది అంబేద్కర్ వల్ల వచ్చిందే. ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ 7వ సెషన్‌లో బాబాసాహెబ్ భారతదేశంలో పని గంటల సంఖ్యను 14 నుంచి 8 గంటలకు తగ్గించారు. ఆయన లేకపోతే భారతదేశంలోని ప్రతి వ్యక్తి సగటున 14 గంటలు పని చేయాల్సి ఉండేది.
2. బాబాసాహెబ్ అంబేద్కర్ 1955 సంవత్సరంలో మధ్యప్రదేశ్, బీహార్ రాష్ట్రాలు చాలా పెద్దవిగా ఉన్నాయని, దీని కారణంగా పాలనలో సమస్య ఉందని గమనించారు. అందుకోసం రాష్ట్రాల విభజన గురించి సూచించారు. 45 ఏళ్ల తర్వాత ఈ రాష్ట్రాల విభజన జరిగి ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్‌లుగా ఏర్పడ్డాయి.
3. బాబాసాహెబ్ అసలు పేరు భీమ్‌రావు. పాఠశాల ఉపాధ్యాయుడు కృష్ణ మహదేవ్ అంబేద్కర్ అంటే అతడికి అమితమైన అభిమానం. ఆయనపై ఉన్న ప్రత్యేక అభిమానం కారణంగా అంబేద్కర్ పేరుని యాడ్ చేశారు.
4. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా స్థాపనలో బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. 1935లో రిజర్వ్ ఆఫ్ ఇండియా ఏర్పడినప్పుడు బాబాసాహెబ్ బ్యాంకు స్థాపన కోసం చాలా కృషి చేశారు.
5. భారతదేశంలో భారీ ఆనకట్టల సాంకేతికత విషయంలో అంబేద్కర్ ముఖ్యమైన పాత్ర పోషించారు. హిరాకుడ్, దామోదర్, సోన్ రివర్ డ్యామ్ ప్రాజెక్టులను ప్రారంభించడంలో ఎంతో కృషి చేశారు.
6. బాబాసాహెబ్ భీమ్‌రావ్ అంబేద్కర్ ఆత్మకథ ‘వెయిటింగ్ ఫర్ ఎ వీసా’ కొలంబియా విశ్వవిద్యాలయంలో బోధిస్తున్నారు. అంబేద్కర్ తన ఆత్మకథను 1935లో రాశారు.
7. నేషనల్ ఎంప్లాయ్‌మెంట్ ఎక్స్ఛేంజ్ ఏజెన్సీని ఏర్పాటు చేయడంలో బాబాసాహెబ్ భీమ్ రావ్ అంబేద్కర్ ముఖ్యమైన పాత్ర పోషించారు.
8. బాబా భీమ్‌రావ్ అంబేద్కర్ మొదటి నుంచి జమ్మూ కశ్మీర్‌లో అమలు చేసిన ఆర్టికల్ 370 ని వ్యతిరేకించారు. కశ్మీర్‌కు ప్రత్యేక హోదా ఇవ్వాలని ఆయన ఎప్పుడూ కోరుకోలేదు.
9. అంబేద్కర్ రాజకీయాల్లో విజయం సాధించలేకపోయారు. అంబేద్కర్ 1952లో బాంబే నార్త్ నుంచి లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసినా ఓటమిచెందారు.