History Creator: ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..

History Creator: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. చివరి బంతి వరకు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. నేపాల్‌లో జరుగుతున్న ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్..

History Creator: ఒకే ఓవర్లో 6 వికెట్లు.. సరికొత్త చరిత్ర సృష్టించిన బౌలర్.. ఒంటిచేత్తో మ్యాచ్ గెలిపించాడు..
Cricket
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2022 | 6:40 AM

History Creator: క్రికెట్‌లో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ ఊహించి చెప్పలేరు. చివరి బంతి వరకు అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. నేపాల్‌లో జరుగుతున్న ప్రో క్లబ్ ఛాంపియన్‌షిప్ T20 టోర్నమెంట్‌లో ఇలాంటి వాదనను బలపరిచే అద్భుతం ఒకటి జరిగింది. ఈ టీ20 టోర్నీలో మలేషియా లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ విరందీప్ సింగ్ 6 బంతుల్లో ఆరు వికెట్లు పడగొట్టి.. క్రికెట్ చరిత్రలోనే అద్భుతం సృష్టించాడు. ఇలా తనపేరిట ఎవరూ తిరగరాయలేని ఓ అపూర్వ రికార్డును నమోదు చేశాడు. విరందీప్ తన మ్యాజికల్ ఓవర్‌లో ఐదు వికెట్లు పడగొట్టాడు. ఆరో బంతికి బ్యాట్స్‌మెన్ పరుగు తీయబోగా రన్ ఔట్ చేశాడు. దాంతో ఒకే ఒవర్‌లో 6 వికెట్లు పడగొట్టినట్లయ్యింది. వీరందీప్ సింగ్ వేసింది రెండు ఓవర్లే కావడం విశేషం. రెండు ఓవర్లలో 9 పరుగులు మాత్రమే ఇచ్చిన వీరందీప్ సింగ్.. హ్యాట్రిక్ వికెట్లు పడగొట్టాడు. ప్రతీ బంతికి కొత్త బ్యాట్స్‌మెన్ క్రీజ్‌లోకి వచ్చేలా సరికొత్త మ్యాజిక్ చేశాడు. తన మ్యాజికల్ షో తో మ్యాచ్‌నే సింగిల్ హ్యాండ్‌తో ఏకపక్షంగా గెలిపించేశాడు వీరందీప్ సింగ్. పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ వర్సెస్ మలేషియా క్లబ్ ఎలెవన్ జట్లకు మధ్య జరిగిన పోరులో ఈ హ్యాట్రిక్ నమోదైంది. పుష్ స్పోర్ట్స్ ఢిల్లీ స్కోర్ చివరి ఓవర్ ప్రారంభమయ్యే సమయానికి 131-3 ఉండగా.. చివరి ఓవర్లో అంటే వీరందీప్ సింగ్ బౌలింగ్‌లో 132-9 తో ఆరు వికెట్లు కోల్పోయింది.