RR vs GT IPL 2022 Match Prediction: రాజస్థాన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన గుజరాత్‌.. ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..

RR vs GT IPL 2022 Match Prediction: రాజస్థాన్‌ను ఢీకొట్టేందుకు సిద్ధమైన గుజరాత్‌.. ఇరు జట్ల బలాబలాలు ఎలా ఉన్నాయంటే..
Rr Vs Gt

Rajasthan Royals vs Gujarat Titans Match Preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL-2022) లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) హ్యాట్రిక్‌ విజయాలతో ఆకట్టుకుంది. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మొదటిసారి ఓటమి రుచి చూసింది.

Basha Shek

| Edited By: Ravi Kiran

Apr 14, 2022 | 7:46 AM

Rajasthan Royals vs Gujarat Titans Match Preview: ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (IPL-2022) లో అరంగేట్రం చేసిన గుజరాత్ టైటాన్స్ (GT) హ్యాట్రిక్‌ విజయాలతో ఆకట్టుకుంది. అయితే సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌తో జరిగిన నాలుగో మ్యాచ్‌లో మొదటిసారి ఓటమి రుచి చూసింది. అయితే ఈ మ్యాచ్‌లోనూ కడదాకా పోరాడింది హార్దిక్‌ సేన. ఈక్రమంలో మళ్లీ విజయాల బాట పట్టేందుకు గుజరాత్‌ రేపటి మ్యాచ్‌లో రాజస్థాన్‌ రాయల్స్‌ (RR) తో తలపడనుంది. కాగా సంజూ శాంసన్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ కూడా ఈ సీజన్‌లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఆ జట్టు కూడా 4 మ్యాచ్‌ల్లో మూడింటిలో విజయం సాధించి ఒక్క మ్యాచ్‌లో పరాజయం పాలైంది. పైగా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉంది పింక్‌ ఆర్మీ బృందం. ఈనేపథ్యంలో ఇరు జట్లు అన్ని విభాగాల్లో పటిష్ఠంగా ఉండడంతో ఈ మ్యాచ్‌(RR vs GT) హోరాహోరీగా జరిగే అవకాశం ఉంది. నవీ ముంబైలోని డీవై పాటిల్ స్టేడియంలో రాత్రి 7.30 గంటలకు ఈ మ్యాచ్‌ ప్రారంభం కానుంది.

పటిష్ఠంగా శామ్సన్‌ సేన..

రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది. ఆ జట్టు స్పిన్నర్లు, ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా ఆడుతున్నారు. ట్రెంట్‌ బౌల్ట్‌ తన అనుభవాన్నంతా రంగరించి బౌలింగ్‌ చేస్తున్నాడు. స్లాగ్‌ ఓవర్లలోనూ సత్తా చాటుతూ జట్టుకు కీలక బౌలర్‌గా మారాడు. టీమిండియా బౌలర్‌ ప్రసిద్ధ్‌ కృష్ణ కూడా దూకుడు మీద ఉన్నారు. తనలోనూ వికెట్లు తీసే సత్తా ఉందని కొత్త ఆటగాడు కుల్దీప్‌ సేన్‌ నిరూపించుకన్నాడు. ఇక స్పిన్‌ విభాగంలో రవిచంద్రన్ అశ్విన్, యుజువేంద్ర చాహల్ ప్రత్యర్థుల పని పడుతున్నారు. చాహల్ ఈ లీగ్‌లో అత్యధిక వికెట్లు (11) తీసిన బౌలర్ల జాబితాలో అగ్రస్థానంలో ఉన్నాడు. ఇక అశ్విన్‌ పెద్దగా వికెట్లు తీయలేకపోయినప్పటికీ పరుగులు నియంత్రిస్తూ ప్రత్యర్థులను ఒత్తిడిలోకి నెట్టుతున్నాడు. ఇక బ్యాటింగ్‌ విషయానికొస్తే.. ప్రతిభావంతుడైన దేవదత్ పడిక్కల్‌తో పాటు జోస్ బట్లర్, బిగ్ హిట్టర్లు షిమ్రాన్ హెట్మెయర్ శాంసన్‌లతో పింక్‌ ఆర్మీ బ్యాటింగ్‌ విభాగం పటిష్ఠంగా ఉంది.

వారిపైనే భారం..

కాగా పటిష్ఠమైన రాజస్థాన్ రాయల్స్ బౌలింగ్‌ను ఎదుర్కోవాలంటే గుజరాత్ టైటాన్స్ బ్యాటర్లు మరింత శ్రమించాలి. ఆజట్టు ఎక్కువగా శుభ్‌మన్‌ గిల్‌, హార్దిక్‌ పాండ్యాపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. డేవిడ్ మిల్లర్ మరిన్ని పరుగులు సాధించాల్సి ఉండగా… మాథ్యూ వేడ్ ఇంకా ఫామ్‌లోకి రాలేదు. కొత్త ఆటగాళ్లు అభినవ్ మనోహర్, బి సాయి సుదర్శన్ మరింత బాధ్యతాయుతంగా ఆడవలసి ఉంటుంది. రాహుల్ తెవాటియా ఫినిషర్ పాత్రను సమర్థంగా పోషిస్తున్నాడు. బౌలింగ్‌ విషయానికొస్తే.. ప్రపంచ క్రికెట్‌లో అత్యంత వేగవంతమైన బౌలర్లలో ఒకరైన లాకీ ఫెర్గూసన్ జట్టులో ఉన్నాడు. వీరే కాకుండా భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీ నిలకడగా రాణిస్తున్నాడు. అంచనాలకు తగ్గట్లే రషీద్‌ ఖాన్‌ పరుగులు నియంత్రిస్తూ వికెట్లు తీస్తున్నాడు.

తుది జట్లలో మార్పులు..

కాగా గుజరాత్‌ జట్టులో వరుసగా విఫలమవుతోన్న మాథ్యూ వేడ్‌ స్థానంలో రహ్మానుల్లా గుర్బాజ్ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో దర్శన్ నల్కండే స్థానంలో వరుణ్ ఆరోన్ లేదా ఆర్. సాయి కిషోర్‌కి తుది జట్టులో స్థానం దక్కవచ్చు. మరోవైపు రాజస్థాన్ జట్టును పరిశీలిస్తే, గత మ్యాచ్‌లో, యశస్వి జైస్వాల్‌ను తొలగించి, రాసి వాన్ డెర్ డస్సెన్‌కు అవకాశం ఇచ్చారు. గత మ్యాచ్‌లో పడిక్కల్ మొదటిసారి ఈ సీజన్‌లో ఓపెనింగ్‌కు వచ్చారు. ఈ మ్యాచ్‌లోనూ అదే కాంబినేషన్‌ను కొనసాగించే ప్రయత్నముంది.

ఇరు జట్ల ప్లేయింగ్ XI ఎలా ఉండొచ్చంటే..

రాజస్థాన్ రాయల్స్ :

సంజు శాంసన్ (కెప్టెన్), జోస్ బట్లర్, దేవదత్ పడిక్కల్, రాసి వాన్ దుసాయి, షిమ్రాన్ హెట్మెయర్, రియాన్ పరాగ్, కుల్దీప్ సేన్, రవిచంద్రన్ అశ్విన్, ట్రెంట్ బౌల్ట్, ప్రశాంత్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్.

గుజరాత్ టైటాన్స్:

హార్దిక్ పాండ్యా(కెప్టెన్), రహ్మానుల్లా గుర్బాజ్ (వికెట్‌ కీపర్‌), శుభమన్ గిల్, సాయి సుదర్శన్, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, అభినవ్ మనోహర్, రషీద్ ఖాన్, లాకీ ఫెర్గూసన్, మహ్మద్ షమీ, R.K. సాయి కిషోర్

Also Read:Viral Video: ఔరా ఇది ఎలా సాధ్యం.. గాల్లో సైకిల్‌ తొక్కిన వ్యక్తి.. షాక్‌ నెటిజన్స్‌..! వైరల్ వీడియో..

Viral Video: ఔరా ఇది ఎలా సాధ్యం.. గాల్లో సైకిల్‌ తొక్కిన వ్యక్తి.. షాక్‌ నెటిజన్స్‌..! వైరల్ వీడియో..

Viral Video: టీవీలో తననుతాను చూసి మురిసిపోయిన కుక్క.. ఏం చేసిందంటే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu