AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: టీవీలో తననుతాను చూసి మురిసిపోయిన కుక్క.. ఏం చేసిందంటే..

జంతువులకు మనుషులకు చాలా అవినావ భావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా కుక్కలకు మనుషులకు మంచి బంధం ఉంటుంది. చాలా మంది కుక్కలను తమ ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటారు.

Viral Video: టీవీలో తననుతాను చూసి మురిసిపోయిన కుక్క.. ఏం చేసిందంటే..
Dog
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2022 | 4:48 PM

Viral Video: జంతువులకు మనుషులకు చాలా అవినావ భావ సంబంధం ఉంటుంది. ముఖ్యంగా కుక్కలకు మనుషులకు మంచి బంధం ఉంటుంది. చాలా మంది కుక్కలను తమ ఇంట్లో మనిషిలా ట్రీట్ చేస్తూ ఉంటారు. అవి కూడా మనుషుల మాదిరిగానే కొన్నిసార్లు ప్రవర్తిస్తూ ఉంటయి. జంతువులకు కూడా మనకు ఉన్నట్టే అన్నిరకాల ఎమోషన్స్ ఉంటాయి. ఆనందం, భాద, దుఃఖం ఇలా అన్ని ఎమోషన్స్ ను అవి సందర్భానుసారంగా వ్యక్తపరుస్తుంటాయి. మనం సహజంగా కుక్కలలో ఈ ఎమోషన్స్ ను ఎక్కుగా గమనిస్తూ ఉంటాం.. పెంపుడు కుక్కలకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో నిత్యం వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ కుక్కకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఆ డాగీని పొగుడుతూ.. కామెంట్లు కురిపిస్తున్నారు.

అయితే కొద్దిరోజుల క్రితం లూసియానాలో బ్రోన్ అనే ఓపెంపుడు కుక్క ఏడు నెలల పాపతో ఆడుకుంటున్న వీడియో వైరల్ అయ్యింది. కుక్క ఆ చిన్న బాబును ఆడిస్తూ.. అటు ఇటు దూకుతున్న వీడియో తెగ వైరల్ అయ్యింది. దాంతో ఈ వైరల్ వీడియోను అక్కడి న్యూస్ ఛానల్స్ కూడా కవర్ చేశాయి. తాజాగా ఆ కుక్క టీవీలో తనను తాను చూసుకొని ఆనందంలో తేలిపోయింది. తనను తాను చూసుకొని టీవీ ముందు గంతులేసింది. ఇప్పుడు ఈ వీడియో కూడా వైరల్ అవుతుంది. కుక్క ఇలా ఆనందంతో గంతులు వేసిన వీడియో ఇప్పుడు నెట్టింట తగ చక్కర్లు కొడుతుంది. ఈ వీడియో పై ప్రపంచంలో సంతోషకరమైన కుక్క అని కొందరు. కుక్క చిన్న పిల్లాడిలా మారిపోయిందని మరికొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ వీడియో పై మీరూ ఓ లుక్కేయండి.

View this post on Instagram

A post shared by Mel Robbins (@melrobbins)

మరిన్ని ఇక్కడ చదవండి : 

MuskMelon Juice: వేసవిలో ఈ జ్యూస్‌ ఎప్పుడైనా తాగరా.. నిజంగా అమృతమే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..

Viral Video: పుట్టని పిల్లలకోసం తల్లిపక్షి తపన..! హార్ట్‌ టచ్చింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్