AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: తల్లి ప్రేమ అంటే ఇట్లుంటది.. వీడియో చూస్తే మీ కంట కన్నీళ్లు ఆగవు.!

Viral Video: ముగ్గురుకి అన్నం ఉండి.. నలుగురు తినాల్సి వస్తే.. తాను తిన్నా అంటూ.. మిగిలిన ముగ్గురి ఆకలి తీర్చేదే అమ్మ.. అవును తల్లి ప్రేమ(Mothers Love) గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని..

Viral Video: తల్లి ప్రేమ అంటే ఇట్లుంటది.. వీడియో చూస్తే మీ కంట కన్నీళ్లు ఆగవు.!
Viral Video
Surya Kala
| Edited By: Ravi Kiran|

Updated on: Apr 20, 2022 | 4:18 PM

Share

Viral Video: తల్లి ప్రేమ.. ఈ విశ్వంలో దీనికి మించిన స్వచ్ఛమైనది మరొకటి లేదంటే అతిశయోక్తి కాదు. ప్రపంచంలో తల్లి మించిన యోధులు ఎవ్వరూ లేరు. ముగ్గురుకి అన్నం ఉండి.. నలుగురు తినాల్సి వస్తే.. తాను తిన్నా అంటూ.. మిగిలిన ముగ్గురి ఆకలి తీర్చేదే అమ్మ.. అవును తల్లి ప్రేమ(Mothers Love) గురించి ఎంత చెప్పినా తక్కువే. అందుకే తల్లిని మించిన దైవం లేదు అంటారు. బిడ్డ గర్భంలో ఉన్నప్పటినుంచే ఆ బిడ్డ క్షేమం కోసం ఎంతో పరితపిస్తుంది. తన ప్రాణాలను సైతం పణంగా పెట్టి బిడ్డకు జన్మనిస్తుంది. ఆ బిడ్డను కంటికి రెప్పలా కాపాడుకుంటుంది. ఇది కేవలం మనుషులకు మాత్రమే కాదు.. పశుపక్ష్యాదులకు కూడా వర్తిస్తుంది. అందుకు ఈ వీడియోనే నిదర్శనం.

సోషల్‌ మీడియాలో ఓ రేంజ్‌లో వైరల్‌ అవుతున్న ఈ వీడియోలో ఓ పక్షి తన గుడ్లను కాపాడుకోడానికి తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టింది. ఇందులో ఓ ప్రదేశంలో పెద్దమొత్తంలో మట్టి దిబ్బగా ఏర్పడి ఉంది. దానిపైన ఓ పక్షి గుడ్లు పెట్టుకుంది. అయితే ఆ మట్టిని తొలగించే క్రమంలో ఓ బుల్డోజర్‌ అక్కడికి వచ్చింది. అది గమనించిన పక్షి వెంటనే తన గుడ్లమీద వాలిపోయింది. ఆ బుల్డోజర్‌ నడుపుతున్న వ్యక్తి కూడా ఆ గుడ్లకు హాని కలగకుండా జాగ్రత్తగా మట్టి తొలగించాడు. ఇంకా బయటకు రాని తన పిల్లలకోసం ఆ పక్షి తపనకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. రకరకాల కామెంట్లు చేస్తున్నారు.

Also Read: Minister Eshwarappa: కాంట్రాక్టర్ ఆత్మహత్య.. మంత్రి పై కేసు నమోదు.. మంత్రి పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్ డిమాండ్

Tirumala: స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఉండే భాగ్యం.. ఎలా అనుమతి తీసుకోవాలో పూర్తి వివరాలు మీ కోసం..