Viral Video: ఆ టీనేజర్‌కి 70 సెంటిమీటర్ల తోక.. హనుమంతుడి అంశ అంటున్న పూజారులు

16 ఏళ్ల నేపాల్ యువకుడికి తన వెన్నుపూసపై 70 సెంటీమీటర్ల పొడవున్న తోక ఉంది. అది చూసిన ప్రజలు చాలా ఆశ్చర్యానికి గురవుతున్నారు. పూర్తి వివరాలు చదవండి.

Viral Video: ఆ టీనేజర్‌కి 70 సెంటిమీటర్ల తోక.. హనుమంతుడి అంశ అంటున్న పూజారులు
Boy With Tail
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 13, 2022 | 3:21 PM

Trending News: జంతువులకు తోక ఉంటుందని తెలుసు.. మనుషులకు కూడా తోక ఉంటుందా..? అసలు అలాంటి వ్యక్తులను ఎప్పుడైనా చూశారా..? మీకు అలా తోక ఉన్న ఓ టీనేజర్‌ను ఇప్పుడు పరిచయం చేయబోతున్నాం. నేపాల్‌(Nepal)కు దేశాంత్ అధికారి అనే ఓ 16 ఏళ్ల యువకుడి వెన్నుపూసపై  70 సెంటీమీటర్ల పొడవున్న తోక ఉంది.  పుట్టిన కొన్ని రోజులకే అతని పేరెంట్స్ తోకను గుర్తించారు. చికిత్స కోసం దేశవిదేశాల్లోని ఆస్పత్రులకు తిరిగినా.. గొప్ప, గొప్ప డాక్టర్లను కలిసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తమ బిడ్డకు ఈ పరిస్థితి ఏంటి దేవుడా అని బాధపడుతున్న దేశాంత్ తల్లిదండ్రులకు స్థానిక పూజారి ఓ మాట చెప్పాడు. మీ బిడ్డది హనుమంతుడి(Lord Hanuman) అంశ అని చెప్పడంతో.. వారు సంబరపడిపోయారు. తోక కారణంగా దేశాంత్ తొలుత అసౌకర్యానకి గురయ్యాడు. ఆ విషయం బయటకు చెప్పేందుకు కూడా జంకాడు. కానీ పేరెంట్స్ అతనికి ఆత్మవిశ్వాసాన్ని ఇచ్చారు. దీంతో  ఓ యూట్యూబ్ వీడియోలో తనకు తోక ఉన్న విషయాన్ని ప్రపంచానికి తెలియజేశాడు దేశాంత్. ఇప్పుడు  తోకను చూపించడంలో ఎటువంటి ఇబ్బంది లేదని చెప్పాడు. ప్రంజట్ చాలామంది తనను హనుమాన్ అని కూడా పిలుస్తున్నారని..ఇప్పుడు తోక ఉన్న అబ్బాయిగా తెలుసనని, దానికి చాలా సంతోషిస్తున్నానని దేశాంత్ చెబుతున్నాడు.

Also Read: Hyderabad: పరుపుల మాటున పత్తి యాపారం.. తెలిస్తే బిత్తరపోవడం ఖాయం