Viral Video : ఓరినీయాసాలో.. సామీ సామీ సాంగ్‌కు రష్మిక రేంజ్‌లో స్టెప్పులేసిన యువకుడు..

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే.

Viral Video : ఓరినీయాసాలో.. సామీ సామీ సాంగ్‌కు రష్మిక రేంజ్‌లో స్టెప్పులేసిన యువకుడు..
Pushpa Song
Follow us
Rajeev Rayala

|

Updated on: Apr 13, 2022 | 2:57 PM

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) నటించిన పుష్ప(Pushpa) సినిమా క్రేజ్ ఇప్పటికీ ఏమాత్రం తగ్గడం లేదు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా పాన్ ఇండియా మూవీగా రిలీజ్ అయ్యి సంచలన విజయాన్ని అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఎర్ర చందనం స్మగ్లర్ గా బన్నీ నటన విపరీతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాలోని పాటలు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. దేవీ శ్రీ ప్రసాద్ అందించిన పాటలు శ్రోతలను ఉర్రుతలూగించాయి. పుష్ప సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ అయ్యాయి. ఈ పాటలకు అల్లు అర్జున్ రష్మిక చేసిన డ్యాన్స్ మూమెంట్స్ తెగ వైరల్ అయ్యాయి. ముఖ్యంగా శ్రీవల్లి సాంగ్ లో బన్నీ హుక్ స్టెప్, అలాగే సామీ సామీ సాంగ్ లో రష్మిక స్టెప్ యమా క్రేజ్ ను సొంతం చేసుకున్నాయి. ఇప్పటికే ఈ పాటలపై చాలా మంది వీడియోలు చేసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. సినిమా తారలు సైతం ఈ పాటలకు స్టెప్పులేశారు.

తాజాగా ఓ వ్యక్తి పుష్ప సినిమాలోని సామీ సామీ పాటకు డ్యాన్స్ వేశాడు. ఇందులో  వింతేముంది అనుకుంటున్నారా.. అయితే అమ్మాయిలు ధరించే స్కర్ట్ వేసుకొని ఆ యువకుడు డ్యాన్స్ చేయడంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. రష్మిక వేసిన స్టెప్పు ను అచ్చు గుద్దినట్టు దించేశాడు ఆ యువకుడు. ఇంతకు అతను ఎవరంటే.. అతడి పేరు కొరియోగ్రాఫర్ జైనిల్ మెహతా.. ఇతను ఎప్పుడూ అమ్మాయిల మాదిరిగా డ్రస్ చేసుకొని అమెరికా వీధుల్లో డ్యాన్స్ లు వేస్తూ ఉంటాడట..ఇన్ స్టా గ్రామ్ లో పోస్ట్ చేసిన ఈ వీడియోను ఇప్పటికే 3 లక్షల మంది చూసేశారు. అయితే ఆ యువకుడి డ్యాన్స్‌లను కొందరు నెటిజన్లు మెచ్చుకుంటుడగా.. మరికొందరు మాత్రం.. అమ్మాయిల డ్రెస్సులే  ఎందుకు వేసుకోవాలి అబ్బాయిలా డ్రస్ చేసుకోని కూడా డ్యాన్స్ వేయవచ్చు కదా అంటూ ప్రశ్నిస్తున్నారు. ఏది ఏమైనా ఈ వీడియో మాత్రం నెట్టింట తెగ వైరల్ అవుతోంది.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Nivetha Pethuraj: గ్లామర్ డోస్ పెంచేసిన నివేత పేతురాజ్.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Rashmi Gautam:పింక్ డ్రెస్ లో వయ్యారాలు ఒలకబోస్తున్న యాంకర్ రష్మి.. లేటెస్ట్ పిక్స్ వైరల్

Beast Movie Review: న‌వ్విస్తూ, ఎమోష‌న‌ల్‌గా ఎంట‌ర్‌టైన్ చేసిన బీస్ట్..

మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం
మ‌ర‌ణించిన చెర్రీ అభిమానుల‌ కుటుంబాలకు దిల్ రాజు ఆర్థిక సాయం