AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tirumala: స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఉండే భాగ్యం.. ఎలా అనుమతి తీసుకోవాలో పూర్తి వివరాలు మీ కోసం..

Tirumala: తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలని.. శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవాలని శ్రీవారి భక్తుల కోరిక.. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాల..

Tirumala: స్వామివారి సన్నిధిలో వారం రోజుల పాటు ఉండే భాగ్యం.. ఎలా అనుమతి తీసుకోవాలో పూర్తి వివరాలు మీ కోసం..
Ttd Srivari Sevakulu
Surya Kala
|

Updated on: Apr 13, 2022 | 2:58 PM

Share

Tirumala: తిరుమల తిరుపతి క్షేత్రానికి వెళ్లాలని.. శ్రీ వెంకటేశ్వర స్వామి(Sri Venkateswara Swami) దివ్యమంగళ రూపాన్ని దర్శించుకోవాలని శ్రీవారి భక్తుల కోరిక.. అందుకనే తెలుగు రాష్ట్రాల నుంచే కాదు.. దేశ విదేశాల నుంచి భక్తులు తిరుమల తిరుపతి వస్తారు.  వెంకటేశ్వరస్వామిని దర్శించుకుని తరిస్తారు. అయితే స్వామి వారి క్షేత్రంలో ఒక్కరోజు మాత్రమే కాదు.. ఏకంగా వారం రోజుల పాటు ఉండి.. స్వామి వారి సన్నిధిలో వారం రోజుల పాటు సేవ చేసే భాగ్యాన్ని కూడా కల్పిస్తోంది టీటీడీ(TTD). శ్రీవారి సన్నిధిలోని క్యూ లైన్లు, దేవాలయ పరిసరాలు తదితర చోట్ల విధులు నిర్వహించేందుకు వాలంటీర్లను ఎంపిక చేస్తుంది.  అయితే తిరుమలలో మీరు వాలంటీర్ గా చేయడానికి అవకాశం కోసం చూస్తున్నవారికి .. స్వామివారి సన్నిధిలో సేవకు ఎలా వెళ్లాలి? మార్గదర్శకాలు ఏమిటి..  వివరాలు తెలీక బాధ పడుతున్నారా..అయితే పూర్తి వివరాలు తెలుసుకోండి మరి…!

నెల రోజుల ముందే సమాచారమివ్వాలి..!

తిరుమల క్షేత్రంలో స్వామికి సేవ చేయాలనుకునేవారు నెల రోజుల ముందుగా టీటీడీకి సమాచారం ఇవ్వాలి. భక్తులు తప్పని సరిగా ఆధ్యాత్మిక పరిజ్ఞానం కలిగి ఉండాలి. స్త్రీ, పురుష బేధం లేకుండా పదిమంది భక్తులకు తక్కువగాకుండా బృందంగా వెళ్లాలి. గ్రూపులోని సభ్యులంతా వారి పేరు, చిరునామా, వయస్సు తదితర వివరాలను నెలరోజుల ముందుగానే టీటీడీకి పంపాలి. స్వామివారి సేవకు ఏ కులం వారైనా హిందువులందరూ శ్రీవారి సేవకు అర్హులే.

నియమ నిబంధనలు:

*స్వామివారి సేవలో పాల్గొనేవారు తప్పనిసరిగా తిరుమల నామం, తిలకం లేదా కుంకుమ లేదా చందనం బొట్టు ధరించాలి. హిందువుగా గుర్తించేందుకు ఇలా చేస్తారు.

*శ్రీవారి సేవకు వచ్చే గ్రూపు లీడరు లేదా కోఆర్డినేటర్ వాలంటీర్ల పూర్తి వివరాలు తిరుమల సేవా సదన్‌లో అందించాలి.

*స్వామివారి సేవకు వచ్చేవారు.. తప్పని సరిగా 18 ఏళ్ళ వయసు నిండి 60 ఏళ్లలోపు ఉండాలి.

*మెడికల్ సర్టిఫికెట్ గుర్తింపు పొందిన వైద్యునిచేత అటెస్ట్ చేయించి సమర్పించాలి.

*కేటాయించి తేదీల్లో ఉ. 10 నుంచి సా.5 వరకు సేవాసదన్‌లోని సహాయ ప్రజా సంబంధాల అధికారికి రిపోర్ట్ చేయాలి.

*సేవకులకు ఉచిత బస కల్పిస్తారు. పురుషులకు పీఏసీ-3లో, మహిళలకు సేవాసదన్‌లో వసతి కల్పిస్తారు. సేవకులు తమ లాకర్ కోసం తాళం చెవిలు తెచ్చుకోవాల్సి ఉంటుంది.

*శ్రీవారి సేవాసదన్‌లో రోజూ సాయంత్రం 4గంటలకు డ్యూటీలు కేటాయిస్తారు. రోజుకు కనీసం ఆరుగంటలు విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

*సేవా సమయంలోనే శ్రీవారి స్కార్ఫ్‌లు ధరించాలి.

*గోవిందుడిని స్మరిస్తూ, భక్తులను గోవిందా గోవిందా అనే నామాన్ని స్మరిస్తూ ఉండాలి.

*శ్రీవారి సేవ పూర్తిగా తిరుమల క్షేత్రానికి వచ్చే యాత్రికుల సహాయం చేసేందుకు ఉద్దేశించిన స్వచ్ఛంద సేవ మాత్రమే. సేవ కోసం గ్రూపు కోఆర్డినేటర్‌కు కానీ సిబ్బందికి కానీ ధన, వస్తురూపంలో ఎలాంటి చెల్లింపులు ఉండవు.

*కేటాయించిన ప్రదేశంలోనే సేవ చేయాలి. గర్భాలయ సేవ నిర్బంధ సేవ కాదు. గర్భాలయం సేవ కోసం ఒత్తిడి చేయకూడదు.

*” సేవా సదన్‌లో ఉండే మహిళా సేవకులు రాత్రి వేళల్లో నైటీలు ధరించరాదు.”

*ఒకవేళ ఎవరైనా ఈ నియమ, నిబంధనలు అతిక్రమిస్తే రెండేళ్ల వరకు మళ్ళీ స్వామివారి సేవకు అనుమతించరు.

*తిరుమల ఆస్థాన మండపంలో ప్రతి శుక్రవారం ఉదయం 9 నుంచి ప్రారంభమయ్యే శిక్షణ తరగతులకు శ్రీవారి సేవకులు హాజరుకావాల్సి ఉంటుంది.

*స్వామివారి సేవకు వచ్చే వాలంటీర్లు తమ చిన్నారులు, వృద్ధులను వెంట తీసుకు రాకూడదు.

సేవ చేసే భక్తులు ధరించాల్సిన డ్రెస్ కోడ్ :

శ్రీవారి సేవకు వచ్చే మహిళలు మెరూన్ బార్డర్ కలర్‌తో కూడిన ఆరెంజ్ కలర్ చీర, రవిక ధరించాలి. పురుషులు తెలుపు రంగు వస్త్రాలు ధరించాలి.

 టీటీడీకి వివరాలు పంపాల్సిన చిరునామా..!

పౌరసంబంధాల అధికారి, తిరుమల తిరుపతి దేవస్థానము, కపిలతీర్థం రోడ్డు, తిరుపతి, పిన్ కోడ్ 517501.

మరిన్ని వివరాలకు: 0877-2263544, 0877-2264392 నంబర్లలో సంప్రదించవచ్చు.

Also Read: Andhra Pradesh: జనసేనానిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు.. తమ ప్రాంతానికి కూడా రావాలని ఆహ్వానం

Follow Us