Andhra Pradesh: జనసేనానిపై జేసీ ప్రభాకర్‌రెడ్డి ప్రశంసలు.. తమ ప్రాంతానికి కూడా రావాలని ఆహ్వానం
వెంట్రుక కూడా పీకలేరన్న ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు.. వైకాపా ఎమ్మెల్యేలను ఉద్దేశించి చేసినట్లు ఉందని తెలుగుదేశం నేత జేసీ ప్రభాకర్‌రెడ్డి అన్నారు.

వెంట్రుక కూడా పీకలేరన్న జగన్ కామెంట్స్ వైసీపీ ఎమ్మెల్యేలను(Ysrcp MLAs) ఉద్దేశించినవే అంటూ కామెంట్ చేశారు టీడీపీ నేత, తాడిపత్రి(Tadipatri) మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్‌రెడ్డి(JC Prabhakar reddy). కేబినెట్ మారుస్తున్నా, ఇష్టం వచ్చినట్లు మంత్రివర్గ కూర్పు చేసినా… ఎవరూ ఏమీ చెయ్యలేరని చెప్పడానికి ఆ రోజు ఆ సంకేతాలిచ్చారని తన స్టయిల్లో చెప్పుకొచ్చారు జేసీ. సీఎం కామెంట్స్‌పై వైసీపీ ఎమ్మెల్యేలు ఆలోచించుకోవాలన్నారు. అయితే విద్యాదీవెన పేరిట విద్యార్థులతో సభ ఏర్పాటు చేసిన చోట.. ముఖ్యమంత్రి అలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు. తిరుమలకు వెళ్లే భక్తులు సరైన వసతులు, ఏర్పాట్లు లేక అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. అనంతపురం, సత్యసాయి జిల్లాల్లో మంగళవారం జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటనపై జేసీ ప్రభాకర్‌రెడ్డి స్పందించారు. కౌలురైతులకు పవన్ కల్యాణ్ ఆర్థికసాయం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. ప్రజలను మేలుకొలిపే కార్యక్రమాలు ఇంకా చేపట్టాలని కోరారు. అందరం కలిసి ప్రజల కోసం పని చేయాలన్నారు. అయితే.. పవన్ కల్యాణ్ వస్తే కానీ ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వరా అంటూ వైసీపీ సర్కార్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు జేసీ. తమ ప్రాంతానికి కూడా రావాలని పవన్ కల్యాణ్‌ను జేసీ ప్రభాకర్ రెడ్డి ఆహ్వానించారు.
Also Read: Telangana: ఆలయ ప్రహరీ పునాది తవ్వుతుండగా బయటపడ్డ పెట్టె.. ఓపెన్ చేసి చూడగా కళ్లు జిగేల్




