AP: బాధ్యతలు స్వీకరించిన కొత్త మంత్రులు.. పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా..
ఏపీలో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరుగా తమ చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చార్జ్ తీసుకుంటున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో..
ఏపీలో కొత్త మంత్రులు బాధ్యతలు స్వీకరిస్తున్నారు. ఒక్కొక్కరుగా తమ చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి చార్జ్ తీసుకుంటున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ఆర్కే రోజా(RK Roja) బాధ్యతలు చేపట్టారు. సచివాలయంలోని తన ఛాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. తనకు కేటాయించిన చాంబర్‌లో ప్రత్యేక పూజలు నిర్వహించి పండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అంతకుముందు కుటుంబసభ్యులతో కలిసి సీఎం జగన్‌ను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఏపీ మంత్రివర్గ పునర్‌వ్యవస్థీకరణలో రోజాను కేబినెట్‌లోకి తీసుకున్నారు సీఎం జగన్. ఆమెకు కీలకమైన పర్యాటకం, యువజన సర్వీసులు, సాంస్కృతిక శాఖలను అప్పగించారు. ఇవాళ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు రోజా. రోజా చాంబర్‌లో పూజ కార్యక్రమాలు సందడిగా సాగాయి. ఈ కార్యక్రమానికి కుటుంబసభ్యులు, సన్నిహితులు హాజరయ్యారు. అందరినీ ఆప్యాయంగా పలకరించారు రోజా.
ఇదిలావుంటే.. రెవెన్యూ మంత్రిగా చార్జ్ తీసుకున్నారు ధర్మాన ప్రసాదరావు. సీఎం జగన్ లక్ష్యమే తన లక్ష్యమంటున్నారు. గతంలో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన అనుభవముందని..అందరితో కలిసి ఒక టీమ్‌లా పనిచేస్తానన్నారు. ఇక రవాణాశాఖామంత్రిగా బాధ్యతలు చేపట్టారు పినిపే విశ్వరూప్. అయినవిల్లి శ్రీ విఘ్నేశ్వరస్వామివారిని సతీసమేతంగా దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తనకు రెండోసారి అవకాశం కల్పించిన సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
ఇక రాష్ట్రంలో రోడ్లకు పూర్వవైభవం తీసుకొస్తామంటున్నారు రోడ్లు, భవనాల శాఖామంత్రిగా బాధ్యతలు స్వీకరించిన దాడిశెట్టి రాజా. చంద్రబాబు చేతకానితనంతోనే రోడ్లు ఇలా ఉన్నాయని..గత ప్రభుత్వం చేసిన అప్పులకు ఇప్పుడు వడ్డీలు కడుతున్నామని విమర్శలు కురిపించారు.
ఇవి కూడా చదవండి: Pranahita Pushkaralu: ఇవాళ్టి నుంచి ప్రాణహిత నది పుష్కరాలు.. మధ్యాహ్నం తర్వాత నదిలోకి పుష్కర పురుషుడు..
Tree City: భాగ్యనగరానికి మరో అరుదైన గుర్తింపు.. రెండోసారి ట్రీ సిటీగా..