MuskMelon Juice: వేసవిలో ఈ జ్యూస్ ఎప్పుడైనా తాగరా.. నిజంగా అమృతమే.. బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు కూడా..
వేసవిలో నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో అనేక రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇది రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
వేసవిలో నీరు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటారు. ఇందులో అనేక రకాల పండ్లు, కూరగాయలు ఉన్నాయి. వేసవి కాలంలో ముఖ్యంగా కర్బూజ తినడం, జ్యూస్ తాగడం ఆరోగ్యానికి చాలామంచిది. ఇది రుచిగా ఉండటమే కాదు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కర్బూజాలో నీరు, పీచుపదార్ధాలు పుష్కలంగా ఉంటాయి. వేసవిలో ఇది శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచడానికి పనిచేస్తుంది. దీంతోపాటు ఇది యాంటీ ఆక్సిడెంట్లకు మంచి మూలం. ఇందులో దాదాపు 90 శాతం నీరు ఉంటుంది. ఇది రక్తపోటును అదుపులో ఉంచుతుంది. వేసవిలో రోజూ కర్బూజతో చేసిన ఒక గ్లాస్ జ్యూస్ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిదంటున్నారు నిపుణులు. కర్బూజాలో బీటా కెరోటిన్ ఉంటుంది.అది విటమిన్ ‘ఎ’గా మారి ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరాన్ని రక్షిస్తుంది. విటమిన్ ఎ కంటి చూపును మెరుగుపరుస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచడంలో కూడా సహాయపడుతుంది. కర్బూజ ఫలం ఫోలేట్‌కి మంచి మూలం. దీనిని విటమిన్ బి-9 అని కూడా అంటారు. ఇది కొన్ని రకాల క్యాన్సర్ కారకాల నుంచి రక్షిస్తుంది. ఈ పండులో ఉండే అధికశాతం నీరు రోజంతా హైడ్రేటెడ్‌గా ఉంటుంది. కిడ్నీలో రాళ్లు, తల తిరగడం, తలనొప్పి, మలబద్ధకం, పొడి చర్మం మొదలైన సమస్యలను ఉన్నవారు ఈ పండును తినడం లేదా జ్యూస్ తీసుకోవడం చాలా మంచిది. ఇంకా ఈ పండులో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. అంతేకాదు ఈ పండు బరువు తగ్గాలనుకునేవారికి మంచి ఔషధంగా చెప్పవచ్చు. ఇందులో ఫైబర్ కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది అతిగా తినడాన్ని నిరోధించి కడుపు నిండుగా ఉండేలా చేస్తుంది.
మరిన్ని చూడండి ఇక్కడ:
Viral Video: మరికొద్ది క్షణాల్లో పెళ్లి.. మండపంలోకి మాజీ ప్రియుడి ఎంట్రీతో సీన్ రివర్స్..
Chimpanzee video: తగ్గేదే లే..! ఎంజాయ్ మీకే కాదు మాకు ఉంటది.. గేమ్స్‌తో చిల్ అవుతున్న చింపు..
Funny Video: అట్లుంటది మనతోని మరి.. ఒంటెతో యువతి సెల్ఫీ.. ఆ ఒంటె ఏంచేసిందో చూస్తే నవ్వాపుకోలేరు..!
Queuing for condoms: కండోమ్స్ కోసం క్యూ కట్టిన జనం.. ఎందుకో తెలిస్తే షాకవ్వాల్సిందే !
Viral Video: పిచ్చి వేషాలు వేస్తే అలాగే ఉంటది మరి… ప్రాంక్ చేయాలనుకున్నడు.. గూబ పగలకొట్టించుకున్నా