Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Virat Kohli: కోహ్లీ భాయ్ ఏం చేయాలి అంటూ సలహా అడిగిన రుతురాజ్‌ గైక్వాడ్‌..! వైరల్‌గా మారిన వీడియో..

ఐపీఎల్‌ 2021సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్(Orange Cap) విజేత, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌(Ruturaj gaikwad) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు...

Virat Kohli: కోహ్లీ భాయ్ ఏం చేయాలి అంటూ సలహా అడిగిన రుతురాజ్‌ గైక్వాడ్‌..! వైరల్‌గా మారిన వీడియో..
Ruthuraj
Follow us
Srinivas Chekkilla

|

Updated on: Apr 14, 2022 | 7:00 AM

ఐపీఎల్‌ 2021సీజన్‌లో ఆరెంజ్‌ క్యాప్(Orange Cap) విజేత, చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు రుతురాజ్‌ గైక్వాడ్‌(Ruturaj gaikwad) రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు(RCB)తో జరిగిన మ్యాచ్‌లో కూడా విఫలమయ్యాడు. ఈ మ్యాచ్‌లో అతను 16 బంతుల్లో 17 పరుగులు చేశాడు. అతన్ని హేజిల్‌వుడ్‌ ఔట్ చేశాడు. ఐపీఎల్‌ 2022 (IPL 2022) సీజన్‌ అతను ఇప్పటి వరకు చెప్పుకోదగ్గ ఇన్సింగ్స్ ఆడలేదు. ఇంతకీ, ఐదు మ్యాచ్‌ల్లో అతని బ్యాట్ సైలెంట్‌గా ఉండడానికి కారణం ఏమిటి? ఈ ప్రశ్న గైక్వాడ్ మనసులో కూడా తిరుగుతూ ఉండాలి. తన సమస్య పరిష్కారం కోసం అతను విరాట్ కోహ్లీతో మాట్లాడాడు. చెన్నై సూపర్ కింగ్స్ విజయం తర్వాత, రుతురాజ్ గైక్వాడ్ విరాట్ కోహ్లీతో చాలా సేపు మాట్లాడాడు. ఇందుకు సంబంధించిన వీడియోను చెన్నై సూపర్ కింగ్స్ సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఆ వీడియో వైరల్‌ అయింది. మ్యాచ్ అనంతరం విరాట్ కోహ్లీని గైక్వాడ్ కలిశాడు. అనుభవజ్ఞుడైన బ్యాట్స్‌మన్ తన జూనియర్ భుజాలపై చేయి వేసి ఏదో వివరిస్తూ కనిపించాడు.

ఐపీఎల్ 2022 సీజన్‌ రుతురాజ్ విఫలమవుతున్నారు. ఈ కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ 5 మ్యాచ్‌ల్లో 7 సగటుతో 35 పరుగులు మాత్రమే చేశాడు. మంగళవారం బెంగళూరుతో జరిగిన మ్యాచ్‌లో గైక్వాడ్ చేసిన 17 పరుగులే అత్యుత్తమ స్కోరు. విజయ్ హజారే ట్రోఫీలో గైక్వాడ్ పరుగుల వర్షం కురిపించాడు. ఆ తర్వాత అతను టీమ్ ఇండియాకూ ఎంపికయ్యాడు. రుతురాజ్ గైక్వాడ్ క్రీజులో సమయం గడపలేకపోతున్నాడు. అలాగే, ఆఫ్‌స్టంప్ వెలుపలికి వెళ్తున్న బంతిని చూసి చాలా కలత చెందుతున్నాడు. మంగళవారం అతను మహ్మద్ సిరాజ్ వేసిన బంతిని ఆడడానికి ప్రయత్నించాడు. కానీ బంతి అతని బ్యాట్‌కు తగిలి కీపర్ పక్క నుంచి వెళ్లి బౌండరి చేరింది. గైక్వాడ్ బంతి లైన్‌ను కూడా సరిగ్గా అంచనా వేయలేకపోతున్నాడని స్పష్టంగా తెలుస్తుంది. విరాట్ కోహ్లీని సాయం అడగడానికి వచ్చిన కారణం ఇదే అయి ఉంటుంది. అయితే ఇక్కడ విషయం ఏమిటంటే విరాట్ కోహ్లీ కూడా ఫామ్‌లో లేడు. ఇప్పటి వరకు ఐపీఎల్‌లో పెద్దగా పరుగులేమీ చేయలేదు.

Read Also.. MS Dhoni Retirement: ఆ షాకింగ్ న్యూస్ రాగానే రైనా ఏడ్చేశాడు.. మా పరిస్థితి దారుణం: అక్షర్ పటేల్

పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
పళ్లు ఊడిపోయినా బేఫికర్‌.. ఒరిజినల్‌వే మళ్లీ మొలిపిస్తరట..
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఒక్క రూపాయికే వైద్యం! ఈ డాక్టర్​ను అభినందించాల్సిందే
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
ఏంటి మావా అదేమైనా పిల్లి అనుకున్నావా.. అలా ముద్దులు పెడుతున్నావ్
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
షుగర్‌ పేషంట్స్‌ చెరుకు రసం తాగొచ్చా? నిపుణులు ఏమంటున్నారు?
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
బ్యాంక్‌లో మీకు రుణం ఉందా అయితే మీకో గుడ్‌ న్యూస్‌
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
గోల్కొండ బ్లూ డైమండ్ చరిత్ర ఏంటి..? దేశం దాటి ఎలా వెళ్లింది..?
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
సమంత షాకింగ్‌. భార్యలకు రోగాలు వస్తే, భర్తలు విడాకులు ఇస్తున్నారు
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
మహేష్ బాబు మిస్సైన సినిమాతో.. రామ్ చరణ్ బ్లాక్ బస్టర్ హిట్
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
తీవ్ర రక్త స్రావం.. ఆసుపత్రిలో ఆపరేషన్! ఇంతకీ రష్మీకి ఏమైంది?
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..
అమర్‌దీప్‌ను అలా చూశాక.. బిగ్ బాస్‌కు వెళ్లడం వద్దనుకున్నా..