MS Dhoni Retirement: ఆ షాకింగ్ న్యూస్ రాగానే రైనా ఏడ్చేశాడు.. మా పరిస్థితి దారుణం: అక్షర్ పటేల్

MS Dhoni Retirement: ఆ షాకింగ్ న్యూస్ రాగానే రైనా ఏడ్చేశాడు.. మా పరిస్థితి దారుణం: అక్షర్ పటేల్
Suresh Raina Dhoni Axar Patel

2014లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌(MS Dhoni Retirement:) అవుతాడని ప్రకటించినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం ఎంత దారుణంగా మారిందో భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌(axar patel ) గుర్తు చేసుకున్నాడు.

Venkata Chari

|

Apr 13, 2022 | 1:44 PM

2014లో మాజీ కెప్టెన్‌ ఎంఎస్‌ ధోనీ టెస్టు క్రికెట్‌ నుంచి రిటైర్‌(MS Dhoni Retirement:) అవుతాడని ప్రకటించినప్పుడు డ్రెస్సింగ్‌ రూమ్‌ వాతావరణం ఎంత దారుణంగా మారిందో భారత స్పిన్నర్‌ అక్షర్‌ పటేల్‌ (axar patel ) గుర్తు చేసుకున్నాడు. డిసెంబర్ 30, 2014న, మెల్‌బోర్న్‌లో భారత్ వర్సెస్ ఆస్ట్రేలియా మధ్య జరిగిన మూడో టెస్టుతో ధోని 5 రోజుల క్రికెట్‌కు వీడ్కోలు పలికి అందరినీ ఆశ్చర్యపరిచాడు. అతను మ్యాచ్ సమయంలోనే రిటైర్మెంట్ నిర్ణయం తీసుకున్నాడు. అయితే మ్యాచ్ ముగిసిన తర్వాత దాని అధికారిక ప్రకటన వెలువడింది. మ్యాచ్ 2వ రోజు సాయంత్రం జరిగిన విషయాలను అక్షర్ పటేల్ గుర్తుచేసుకున్నాడు. అప్పటి టీమిండియా డైరెక్టర్, కోచ్‌గా ఉన్న రవిశాస్త్రి(ravi shastri), ఎంఎస్ ధోని నిర్ణయాన్ని జట్టులోని ఇతర సభ్యులకు తెలియజేశాడు. భారత టెస్టు జట్టులో భాగమైన అక్షర్ మాట్లాడుతూ, జట్టులోని ప్రతి ఒక్కరూ భావోద్వేగానికి గురయ్యారని, షాకింక్ నిర్ణయానికి అంతా దిగ్భ్రాంతికి గురి అయ్యారని తెలిపాడు. మెల్‌బోర్న్‌లో జరిగిన బాక్సింగ్ డే టెస్టు రెండో రోజు సాయంత్రం మాకు ఈ విషయం తెలిసింది. డ్రెస్సింగ్ రూం వాతావరణం అంతా మారిపోయిందంటూ ఆనాటి పరిస్థితులను వెల్లడించాడు.

అక్షర్ మాట్లాడుతూ, ‘ ఈ సమాచారం అందిన వెంటనే సురేష్ రైనా ఏడ్వడం ప్రారంభించాడు. నేను ఆశ్చర్యపోయాను. నా చుట్టూ ఉన్నవాళ్లంతా కన్నీళ్లు పెట్టుకున్నారు. నేను వేరే ప్రపంచంలో ఉన్నాను. తర్వాత ఏం జరిగిందో నాకు అర్థం కాలేదంటూ’ చెప్పుకొచ్చాడు. ‘బ్రేక్‌ఫాస్ట్‌ విత్‌ ఛాంపియన్స్‌’ షోలో అక్షర్ పాల్గొని, ధోనీ రిటైర్మెంట్ ప్రకటన సందర్భంగా జరిగిన విషయాలను గుర్తు చేసుకున్నాడు.

మరోవైపు ధోనీ పూర్తి భిన్నంగా ఉన్నాడని, అతను నన్ను కలవగానే నా కాలు లాగాడు, నాకేం చెప్పాలో కూడా తెలియలేదు. నేను మహి భాయ్‌ని మొదటిసారి కలుస్తున్నాను. కానీ, నేను ఏమీ అనకముందే అతను ఒక్కటే చెప్పాడు- బాపూ.. మీరు వచ్చారు, నేను బయలుదేరాలి అంటూ ఆపై నన్ను కౌగిలించుకున్నాడు’ అని పేర్కొన్నాడు.

ప్రస్తుతం ఐపీఎల్‌లో ఢిల్లీ ఫ్రాంచైజీలో అక్షర్ పటేల్ భాగంగా ఉన్నాడు. మరోవైపు, సురేష్ రైనా ఐపీఎల్ 2022 వేలంలో అమ్ముడుపోలేదు. మహేంద్ర సింగ్ ధోని చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్నాడు. కానీ, ఈ సీజన్‌లో కేవలం ప్లేయర్‌గా కనిపిస్తున్నాడు. ఐపీఎల్ 15వ సీజన్ ప్రారంభానికి ముందు కెప్టెన్సీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించి, ఫ్యాన్స్‌కు షాక్ ఇచ్చాడు. ధోనీ స్థానంలో జడేజా చెన్నై భాద్యతలు తీసుకున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూర్ జట్టుతో జరిగిన మ్యాచ్‌లో చెన్నై 23 పరుగుల తేడాతో, లీగ్‌లో తన తొలి విజయం సాధించింది. ఈ సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్‌కి ఇది తొలి విజయం కాగా, వరుసగా నాలుగు మ్యాచ్‌ల్లో ఓడిపోయిన సీఎస్‌కే ఈ విజయాన్ని అందుకుంది.

Also Read: Watch Video: గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Watch Video: బౌలింగ్‌లో భారీగా రన్స్, ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు మిస్.. ధోనిని చూసి నేర్చుకో హార్దిక్ అంటోన్న ఫ్యాన్స్..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu