Watch Video: గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..

Ambati Rayudu Catch: రాయుడు పట్టిన క్యాచ్ చూసి అందరూ షాక్ అయ్యారు. షార్ట్ కవర్ వద్ద నిల్చున్న రాయుడు.. ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆకాష్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టాడు.

Watch Video: గాలిలో ఎగురుతూ ఒంటి చేత్తో స్టన్నింగ్ క్యాచ్.. వీడియో చూస్తే షాకవ్వాల్సిందే..
Ipl 2022 Ambati Rayudu Catch
Follow us
Venkata Chari

|

Updated on: Apr 13, 2022 | 12:55 PM

ఐపీఎల్ 15వ సీజన్ (IPL 2022) లో ఎట్టకేలకు చెన్నై సూపర్ కింగ్స్ తొలి విజయం సాధించింది. చెన్నై సూపర్ కింగ్స్ మొదటి నాలుగు మ్యాచ్‌లలో ఓడిపోయిన తర్వాత రాయల్ ఛాలెంజర్స్ (CSK vs RCB) ని ఓడించింది. డీవై పాటిల్ స్టేడియంలో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 216 పరుగులు చేయగా, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు 193 పరుగులకే ఆలౌటైంది. చెన్నై 23 పరుగుల తేడాతో విజయం సాధించింది. చెన్నై విజయంలో రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే అద్బుతంగా బ్యాటింగ్ చేశారు. అయితే ఈ మ్యాచ్‌లో అంబటి రాయుడు క్యాచ్ (Ambati Rayudu Catch) కూడా నెట్టింట్లో చర్చనీయాంశంగా మారింది.

16వ ఓవర్లో కెప్టెన్ రవీంద్ర జడేజా వేసిన బంతికి అంబటి రాయుడు ఆర్‌సీబీ బ్యాటర్ ఆకాశ్ దీప్ క్యాచ్ పట్టాడు. రాయుడు పట్టిన క్యాచ్ చూసి అందరూ షాక్ అయ్యారు. షార్ట్ కవర్ వద్ద నిల్చున్న రాయుడు.. ఫుల్ లెంగ్త్ డైవ్ చేసి ఆకాష్ దీప్ ఇచ్చిన క్యాచ్‌ను ఒంటి చేత్తో పట్టాడు.

36 ఏళ్ల వయసులో అద్భుత ఫీల్డింగ్..

అంబటి రాయుడు ఫీల్డింగ్ మాత్రం వయసు కేవలం ఫిగర్ అని నిరూపించింది. రాయుడు తీసుకున్న క్యాచ్‌కి అద్భుతమైన ఫిట్‌నెస్ అవసరం. రాయుడి వయసు 36 ఏళ్లు. కానీ, అతని చూపు, బంతిపై పట్టు నిజంగా అద్భుతంగా ఉంది. అంబటి రాయుడు ఇప్పటి వరకు బ్యాట్‌తో అద్భుతంగా రాణించలేదు. 4 మ్యాచ్‌ల్లో అతని బ్యాట్‌ నుంచి 20.50 సగటుతో 82 పరుగులు మాత్రమే వచ్చాయి. రాయుడు ఫీల్డింగ్‌తోపాటు మంగళవారం రాబిన్ ఉతప్ప, శివమ్ దూబే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ప్లేయర్లను వణికించారు. ఉతప్ప 50 బంతుల్లో 9 సిక్సర్లతో 88 పరుగులు చేశాడు. అదే సమయంలో, శివమ్ దూబే 46 బంతుల్లో 8 సిక్సర్ల సహాయంతో 95 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం బౌలింగ్‌లో మహిష్‌ తీక్షణ 4 వికెట్లు, జడేజా 3 వికెట్లు తీసి ఆర్‌సీబీని విజయానికి చేరువకాకుండా చేశారు. బెంగళూరుకు చెందిన ముగ్గురు కీలక ఆటగాళ్లు ఛేజింగ్‌లో విఫలమయ్యారు. ఫాఫ్ డు ప్లెసిస్, విరాట్ కోహ్లి ఎక్కువ సేపు వికెట్‌పై నిలవలేకపోవడంతో ఆర్‌సీబీ ఓటమిపాలైంది. మ్యాక్స్ వెల్ 11 బంతుల్లో 26 పరుగులు చేసి పెవిలియన్ బాట పట్టాడు. షాబాజ్ అహ్మద్ 41 పరుగులు చేయగా, సుయాష్ ప్రభుదేశాయ్-దినేష్ కార్తీక్ చెరో 36 పరుగులతో గెలుపొందాలని ప్రయత్నించినప్పటికీ అది విఫలమైంది.

Also Read: Watch Video: బౌలింగ్‌లో భారీగా రన్స్, ఫీల్డింగ్‌లో క్యాచ్‌లు మిస్.. ధోనిని చూసి నేర్చుకో హార్దిక్ అంటోన్న ఫ్యాన్స్..

IPL 2022: అరంగేట్రంలోనే అదరగొట్టిన రూ.30 లక్షల ప్లేయర్.. ఆర్‌సీబీ నయా ఆల్‌రౌండర్ ఇతడే..

క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
క్యాచ్ పట్టుకునే ప్రయత్నంలో ఢీకొన్న క్రికెటర్లు.. వీడియోలు వైరల్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ ముసాయిదా రిలీజ్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
ఎంగేజ్‌మెంట్ చేసుకున్న అరుంధతి ఛైల్డ్ ఆర్టిస్ట్.. ఫొటోస్ వైరల్
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
సల్మాన్ ఖాన్ తమ్ముడు విడాకులు..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
12 కిలోల బరువు పెరిగి.. ఆపై చైన్ స్మోకర్‏గా మారిన హీరోయిన్..
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
రోజుకు ఎన్ని లీటర్ల నీరు తాగాలో తెలుసా.. ఎక్కువైతే ఏమౌతుంది..?
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
కొత్త ఏడాది పైనే ఫ్లాప్ హీరోయిన్ల ఆశలు.. ఇప్పుడైన కలిసొచ్చేన
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
నీయవ్వ తగ్గేదేలే.. పుష్పరాజ్‌లా పోజులిచ్చిన స్టార్ హీరోయిన్ డాటర్
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
వీళ్లు బాదంపప్పును పొరపాటున కూడా తినకూడదు.. దూరంగా ఉంటేనే ఆరోగ్యం
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?
హీరో ఆది పినిశెట్టి భార్య ఫేమస్ హీరోయిన్ తెలుసా.. ?