Viral Video: ఈ చెట్టు చాలా స్పెషల్ గురూ.. ఆక్సీజన్ మాత్రమే కాదు నీటిని కూడా ఇస్తుంది.. వీడియో మీకోసం..!
Water Tree Viral Video: చెట్లు, మొక్కలు లేని భూ ప్రపంచం మచ్చుకైనా ఊహించుకోలేము. మనిషి మనుగడ సాగించాలంటే చెట్లు కచ్చితంగా ఉండాల్సిందే.
Water Tree Viral Video: చెట్లు, మొక్కలు లేని భూ ప్రపంచం మచ్చుకైనా ఊహించుకోలేము. మనిషి మనుగడ సాగించాలంటే చెట్లు కచ్చితంగా ఉండాల్సిందే. ప్రతీ అంశంలోనూ మనుషులు చెట్లపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. పండ్లు, కూరగాయలు, వంట చెఱకు, ఇంటికి అవసరమైన కలప సహా ప్రతీ అంశంలోనూ చెట్లపైనే ఆధారపడుతున్నాం. ఇక అన్నింటికంటే ముఖ్యమైంది. మనిషి బ్రతకడానికి అవసరం అయ్యే ఆక్సీజన్‌ను కూడా చెట్లే ఇస్తున్నారు. అవి ఇస్తున్న ఆక్సీజన్‌నే పీల్చుకుని మనం జీవనం సాగిస్తున్నాయి. కొన్ని ఇంట్లో పెంచుకునే చెట్లు స్వచ్ఛమైన ఆక్సీజన్‌ను అందిస్తాయనే విషయం కూడా మనకు తెలిసిందే. అయితే, ఇప్పుడు మనం చెప్పుకోబోయే చెట్టు చాలా అరుదైన, ప్రత్యేకమైన చెట్టు. ఈ చెట్టు స్వచ్ఛమైన ఆక్సీజన్‌తో పాటు.. స్వచ్ఛమైన మంచినీటిని కూడా ఇస్తుంది. అవును మీరు విన్నది నిజంగా నిజం. నీల్లు వచ్చే చెట్టుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ చెట్టు నుంచి స్వచ్ఛమైన తాగునీరు రావడం వీడియోలో స్పష్టంగా చూడొచ్చు. ఈ అరుదైన చెట్టు పేరు ‘టర్మినలియా టొమెంటోసా’. ఈ చెట్టును కట్ చేస్తే నిరంతరంగా వాటర్ వస్తోంది. 30 మీటర్ల ఎత్తు ఉన్న ఈ చెట్లు పొడి, తేమతో కూడిన అడవులలో ఎక్కువగా కనిపిస్తాయి. వాటి కాండం నీటితో నిండి ఉంటుంది. ఇది అగ్ని ప్రమాదం, ఎండల తీవ్రత నుంచి తనను తాను కాపాడుకుంటుంది. బౌద్ధులు దీనిని బోధి వృక్షం అని కూడా పిలుస్తారు.
ఈ వైరల్ వీడియోలో ఓ వ్యక్తి ‘టర్మినలియా టొమెంటోసా’ చెట్టును గొడ్డలతో నరికాడు. బెరడు కట్ అవగా.. వెంటనే దాని నుంచి భారీ ఎత్తున నీటి ప్రవాహం వచ్చింది. ఆ నీటిని చూసి అవాక్కైన వ్యక్తి.. కాసేపటి తరువాత వాటిని టేస్ట్ చేశారు. స్వచ్ఛమైన నీటి మాదిరిగానే ఉండటంతో.. వాటిని తాగి కడుపు నింపుకున్నారు. ఈ చెట్టును నుంచి వచ్చే నీరు పూర్తి స్వచ్ఛంగా ఉందని వారు చెబుతున్నారు. కాగా, దీనిని వారు వాటర్ ట్రీ అని పిలుస్తున్నారు. ఈ వాటర్ ట్రీ కి సంబంధించిన వీడియోను ఎరిక్ సోల్‌హీమ్ అనే వ్యక్తి ట్విట్టర్‌లో షేర్ చేశారు. దాంతో వీడియో కాస్తా వైరల్ అయ్యింది.
Also read: