AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: ఫోన్ దెయ్యం పట్టిందా ఏంటి?.. యువతి వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!

Viral Video: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరి వద్ద ఫోన్ ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఉదయం నిద్ర లేచింది మొదలు..

Viral Video: ఫోన్ దెయ్యం పట్టిందా ఏంటి?.. యువతి వీడియో చూస్తే ఫ్యూజులు ఔట్!
Viral
Shiva Prajapati
|

Updated on: Apr 14, 2022 | 6:40 AM

Share

Viral Video: ప్రస్తుత కాలంలో చిన్న పిల్లలు మొదలు.. పండు ముసలి వాళ్ల వరకు ప్రతి ఒక్కరి వద్ద ఫోన్ ఉందంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఉదయం నిద్ర లేచింది మొదలు.. రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ వినియోగం ఎక్కువ అయ్యింది. ఒక్క గంట పాటు ఫోన్ లేకపోతే ప్రాణాలే కోల్పోయినట్లు ఫీల్ అయ్యేవారు కొకొల్లలుగా ఉన్నారు. ఇంట్లో ఉన్నప్పుడు ఫోన్, బయటకు వెళ్తే ఫోన్, పనిలో ఉన్నా ఫోన్.. ఎక్కడ ఉన్నా ఫోన్ వెంట ఉండాల్సిందే. ఇక ఫోన్‌లో ఆటలాడుతూ, మాట్లాడుతూ ప్రపంచాన్నే మరిచిపోతున్నారు నేటికాలం జనాలు. చెవి వద్ద ఫోన్ పెడితే చాలు.. ప్రపంచంతో సంబంధాలే లేవన్నట్లుగా ప్రవర్తిస్తారు కొందరు. ఇంకొందరైతే.. తమ చుట్టూ ఏం జరుగుతుందో కూడా తెలియని పరిస్థితి ఉంటుంది. అంతలా బానిసలవుతున్నారు.

ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే.. తాజాగా ఓ అమ్మాయికి సంబంధించి షాకింగ్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ వీడియో చూసి నెటిజన్ల ఫ్యూజులు ఔట్ అయిపోతున్నాయి. అమ్మాయి తీరును చూసి జనాలు దారుణంగా తిట్టిపోస్తున్నారు. మరి ఇంతకీ ఆ అమ్మాయి ఏం చేసిందో తెలుసుకుందాం. వైరల్ అవుతున్న ఈ వీడియోలో ట్రైన్ దూసుకెళ్తూ కనిపిస్తుంది. ట్రైన్ వెళ్లగానే.. అప్పటికే ట్రాక్‌పై పడుకుని యువతి కనిపించడం షాక్‌కు గురి చేస్తోంది. పైగా ఆ యువతి ఏమాత్రం భయపడుకుండా రైలు వెళ్లిపోగానే తీరిగ్గా లేచి ఫోన్‌లో మాట్లాడుతూ ముందుకు నడిచింది. ఈ ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేయగా.. అదికాస్తా వైరల్‌గా మారింది. అది చూసి నెటిజన్లు షాక్ అవుతున్నారు. అ అమ్మాయికి అంత ధైర్యం ఎలా వచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఫోన్ మాట్లాడుతూ ట్రాక్ పై పడుకోవడం ఏంటని మరికొందరు నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంచెం తేడా జరిగినా ప్రాణాలు పోయేవి అంటూ ఫైర్ అవుతున్నారు. అయితే, ఆ యువతి ఎందుకు అలా చేసిందనే దానిపై ఇంకా క్లారిటీ లేదు. ఆత్మహత్య చేసుకోవాలనుకుందా? లేక ఫోన్‌లో మాట్లాడుతూ ఏదైనా టాస్క్ చేసిందా? అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఏది ఏమైనా.. యువతి చేసిన చర్యపై ప్రజలు ఫైర్ అవుతున్నారు. మరోవైపు ఈ వీడియో రైల్వే అధికారుల కంట పడటంతో.. ఆమెపై చర్యలకు సిద్ధమయ్యారు.

Also read:

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!

Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!

ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
ఇంట్లో ఆర్టిఫిషియల్ మొక్కలు, పూలు పెడుతున్నారా..? ఏం జరుగుతుందంటే
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
U19 WC: అండర్-19 ప్రపంచ కప్‏లో భారత్ ఘన విజయం.. బంగ్లాదేశ్‌ను చిత్తు చేసిన యంగ్ ఇండియా..
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
రైల్వే స్టేషన్లలో రూమ్ బుక్ చేసుకోవడం ఎలా..?
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
కిస్మిస్‌ అని లైట్‌ తీసుకుంటున్నారా..? ఎన్ని ఉపయోగాలో తెలిస్తే..
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
పోస్టాఫీస్‌లో అధిక రాబడి ఇచ్చే స్కీమ్‌లు ఇవే..!
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
ఆఫీసులో ఏ దేవుని ఫొటో ఉండాలి.. వాస్తు చెప్పే సీక్రెట్ ఇదే
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
సికింద్రాబాద్ Vs మల్కాజ్‌గిరి.. జీహెచ్ఎంసీ విలీనంతో రగులుతున్న..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
ప్లాస్టిక్ సర్జరీ రూమర్స్ పై హీరోయిన్ సీరియస్..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నా ఫిట్నెస్ సీక్రెట్స్ ఇవే.. హీరోయిన్ రాశి..
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్
నిరుద్యోగులకు సూపర్ న్యూస్... ప్రభుత్వోద్యోగాలకు నోటిఫికేషన్