AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: ప్రాణాలు తీసిన వేధింపులు.. చెరువులో దూకి తల్లీ, కుమారుడు, కుమార్తె మృతి

చక్కగా సాగిపోతున్న వారి జీవనంలో కుటుంబ కలహాలు చిచ్చు రేపాయి. రోజురోజుకు పెరిగిపోతున్న విభేదాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేశాయి. భర్తతో ఘర్షణలు జరగడంతో భార్య తీవ్ర మనస్తాపానికి....

Hyderabad: ప్రాణాలు తీసిన వేధింపులు.. చెరువులో దూకి తల్లీ, కుమారుడు, కుమార్తె మృతి
Swimming Death
Ganesh Mudavath
|

Updated on: Apr 14, 2022 | 6:33 AM

Share

చక్కగా సాగిపోతున్న వారి జీవనంలో కుటుంబ కలహాలు చిచ్చు రేపాయి. రోజురోజుకు పెరిగిపోతున్న విభేదాలు ముగ్గురి ప్రాణాలు తీశాయి. ఓ కుటుంబాన్ని నిలువునా ముంచేశాయి. భర్తతో ఘర్షణలు జరగడంతో భార్య తీవ్ర మనస్తాపానికి గురైంది. చిన్నారులను అంగన్ వాడీ కేంద్రానికి తీసుకువెళ్తున్నానని చెప్పి.. చెరువులో దూకింది. ఈ ఘటనలో తల్లి, ఓ కుమారుడు, ఓ కుమార్తె మృతి(Suicide) చెందారు. హైదరాబాద్(Hyderabad) నగరంలోని మేడ్చల్‌ మండలం రాజబొల్లారం గ్రామానికి చెందిన భిక్షపతి ప్లంబర్‌గా పని చేస్తున్నాడు. అదే మండలంలోని నూతన్‌కల్‌ గ్రామానికి చెందిన శివరాణితో భిక్షపతికి ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు జగదీష్‌, దీక్షిత్‌, ప్రణీత సంతానం. కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తాయి. బుధవారం మరోసారి ఘర్షణ జరగడంతో శివరాణి తీవ్ర మనస్తాపానికి గురైంది. పిల్లలను అంగన్ వాడీకి తీసుకువెళ్తున్నానని చెప్పి బయటకు వెళ్లాడు. చాలా సమయం గడుస్తున్నా ఆమె ఇంటికి రాకపోవడంతో కుటుంబసభ్యులు భిక్షపతికి సమాచారమిచ్చారు. తర్వాత ఇద్దరూ కలిసి చుట్టుపక్కల వెతికారు.

చెరువు పక్కన శివరాణి.. పిల్లలతో కనిపించిందని స్థానికులు చెప్పారు. పెద్ద కుమారుడు జగదీష్‌ చెరువు గట్టుపై ఏడుస్తూ కన్పించడంతో ఆరా తీశారు. అమ్మ, తమ్ముడు, చెల్లి నీళ్లలో ఉన్నారని ఏడుస్తూ చెప్పడంతో చెరువులో గాలించారు. ముగ్గురి మృతదేహాలను బయటికి తీశారు. విషయం తెలుసుకున్న శివరాణి తల్లిదండ్రులు, బంధువులు ఘటనాస్థలానికి చేరుకున్నారు. భిక్షపతి, అతడి కుటుంబ సభ్యులను చితకబాదారు. పోలీసులు వారిని అదుపు చేశారు. తన కుమార్తెను కొన్నిరోజులుగా అల్లుడు వేధిస్తున్నాడని, బుధవారం కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని శివరాణి తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Also Read

Viral Video: ఈ చెట్టు చాలా స్పెషల్ గురూ.. ఆక్సీజన్ మాత్రమే కాదు నీటిని కూడా ఇస్తుంది.. వీడియో మీకోసం..!

Anaika Soti: ‘ఆర్జీవీ’ హీరోయిన్ అందం పొగడతరామా.. సోయగాల సాగరం అనైక సోతీ

Skydive: వయసుతో పనిఏముంది.. పట్టుదల ముందు.. 60ఏళ్ళు దాటిన వృద్ధులు స్కైడైవ్.. జస్ట్ రికార్డ్ మిస్..