Telangana Congress: రాజ్‌భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. ఇది ప్రస్తుతానికేనా? ఎప్పటికీ ఉంటుందా?

Telangana Congress: తెలంగాణలో వరి కొనుగోళ్ల రగడ రాజ్ భవన్‌కి చేరింది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా చేతులు కలిపారు.

Telangana Congress: రాజ్‌భవన్‌లో ఆసక్తికర దృశ్యం.. ఇది ప్రస్తుతానికేనా? ఎప్పటికీ ఉంటుందా?
Congress
Follow us
Shiva Prajapati

|

Updated on: Apr 14, 2022 | 5:26 AM

Telangana Congress: తెలంగాణలో వరి కొనుగోళ్ల రగడ రాజ్ భవన్‌కి చేరింది. ఎన్నడూ లేని విధంగా తెలంగాణ కాంగ్రెస్ నాయకులంతా చేతులు కలిపారు. గవర్నర్ తమిళిసైతో భేటీ అయ్యారు. పంటకొనుగోలుతోపాటు.. వివిధ అంశాలపై రిప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అవును, నిత్యం కొలిమిలా రగిలే తెలంగాణ కాంగ్రెస్‌లో స్నేహమేరా జీవితం పాట వినిపిస్తోంది. ఎప్పుడూ కలవని చేతులు.. ఇప్పుడు భుజాలు రాసుకుంటున్నాయి. ఓవైపు రేవంత్‌ ఇంకోవైపు కోమటి రెడ్డి.. ఓవైపు జగ్గారెడ్డి, మధుయాష్కి, వీహెచ్‌ ఇంకోవైపు షబ్బీర్‌అలీ, అంజన్‌ కుమార్‌, పొన్నం ప్రభాకర్‌. ఇక గీతారెడ్డి, రేణుకాచౌదరి ఉండనే ఉన్నారు. ఉత్తమ్‌ కుమార్‌ మిస్‌ అయ్యారుగాని.. ఈ ఫ్రేమ్‌ తెలంగాణ కాంగ్రెస్‌ చరిత్రలోనే రేరెస్ట్‌ (rarest)గా చెప్పొచ్చు. ఈరోజు రాజ్‌భవన్‌కి ఈ మూగమనసులన్నీ కలిసి వెళ్లి.. కళకళలాడుతూ బయటకు వచ్చాయి. ఎప్పుడూ అసమ్మతి రాగం వినిపించే నేతలు ఒకతాటి పైకి వచ్చి.. గవర్నర్‌కి రిప్రజెంటేషన్‌ ఇచ్చారు. ధాన్యం కొనేగోళ్లు, 111జీవో, మూసీ కాలుష్యం, విద్యుత్‌ చార్జీల పెంపు, డ్రగ్స్‌ ఇలా పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం అవలంభిస్తున్న వైఖరిని ఎండగడుతూ వినతిపత్రం అందించారు.

వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ గా 40శాతం మంది పంట అమ్ముకున్నారని గవర్నర్ కు వివరించారు. ముందు పంట అమ్ముకున్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. 111జీవోపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఉండి.. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోందన్నారు. 111జీవోపై రివ్యూ జరపడంతో పాటు డ్రగ్స్, శాంతిభద్రతలపై సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరారు ..యూనివర్శిటీల్లో ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు . నష్టపోయిన రైతులకు ప్రభుత్వం క్వింటా ధాన్యంపై రూ.600 బోనస్‌ ఇప్పించాలన్నారు టీకాంగ్‌ స్టార్‌ క్యాంపేనర్‌, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి. మిల్లర్లు, దళారులు కలిసి బియ్యం మాయం చేశారన్నారు. ప్రభుత్వం ప్రతి ధాన్యపు గింజ కొనే వరకు పోరాడుతామన్నారు.

రాష్ట్రంలోని ప్రతి రైతుకు మేలు జరిగే వరకు కాంగ్రెస్ ఉద్యమిస్తుందని చెబుతున్నారు. అయితే, ఇప్పుడు అంతా కలిసి కట్టుగా వచ్చారు కాని.. ఈ స్నేహం ఎన్నిరోజుల వరకు ఉంటుందో అని సొంత పార్టీ నేతలే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.

Also read:

Viral Video: ప్రతి కుక్కకు ఓ రోజు వస్తుందంటే ఇదేనేమో!.. వారు వెళ్లడమే ఆలస్యం.. రచ్చ రచ్చ చేసేశాయ్..!

Viral Video: గుడ్లను కాపాడేందుకు తల్లి పక్షి అద్భుత పోరాటం.. గుండెలు పిండేస్తున్న షాకింగ్ వీడియో..!

Viral Video: ఇది కదా రాజసం అంటే.. ఈ పిల్లి వీడియో చూస్తే ఫ్యూజులు ఎగిరిపోవడం ఖాయం..!