AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

TS Govt Jobs 2022: గుడ్‌న్యూస్‌! మరో 3,334 ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌.. ఖాళీల వివరాలివే..

తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త .. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఈ రోజు (ఏప్రిల్ 13) మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది..

TS Govt Jobs 2022: గుడ్‌న్యూస్‌! మరో 3,334 ఉద్యోగాలకు తెలంగాణ సర్కార్‌ గ్నీన్‌ సిగ్నల్‌..  ఖాళీల వివరాలివే..
Ts Govt Jobs 2022
Srilakshmi C
|

Updated on: Apr 14, 2022 | 2:25 PM

Share

TS govt gives green signal for 3,334 posts: తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులకు అదిరిపోయే శుభవార్త .. తొలి విడతగా 30,453 ఉద్యోగ ఖాళీల భర్తీకి ఇప్పటికే అనుమతులు ఇచ్చిన ఆర్థిక శాఖ ఈ రోజు (ఏప్రిల్ 13) మరో 3,334 ఉద్యోగ నియమాకాలకు అనుమతినిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. శాసన సభలో ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 80,039 ఉద్యోగ ఖాళీలను భర్తీ చేస్తామని ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. సీఎం కేసీఆర్ ఆదేశాల మేర తొలి విడతగా 30, 453 ఖాళీల భర్తీకి అనుమతిస్తూ ఆర్థిక శాఖ జీవోలు జారీ చేసింది. ఈ నియామక ప్రక్రియకువేగంగా సన్నాహాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం ఫైర్ సర్వీసు, ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్, అటవీ శాఖల్లోని 3,334 ఖాళీల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతులు తెలిపింది. మిగతా శాఖల్లోని ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియకు ఆర్థిక శాఖ వేగంగా సన్నాహాలు చేస్తోంది.

  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ డిపార్టుమెంటులో 137 పోస్టులున్నాయి. వీటిల్లో.. అసిస్టెంట్‌ కెమికల్‌ ఎగ్జామినర్ పోస్టులు: 8 జూనియర్‌ అసిస్టెంట్‌ (లోకల్‌) పోస్టులు: 114 జూనియర్‌ అసిస్టెంట్‌ (స్టేట్‌) పోస్టులు: 15
  • ప్రొహిబిషన్‌ అండ్‌ ఎక్సైజ్‌ కానిస్టేబుల్‌ పోస్టులు 614లకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపింది.
  • తెలంగాణ స్టేట్‌ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్ పోస్టులు: 14
  • తెలంగాణ స్టేట్‌ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్‌ ఫైర్‌ సర్వీసెస్ పోస్టులు: 861 వీటిల్లో.. స్టేషన్‌ ఫైర్‌ ఆఫీసర్‌ పోస్టులు: 26 ఫైర్‌మ్యాన్ పోస్టులు: 610 డ్రైవర్ ఆపరేటర్‌ పోస్టులు 225
  • ఫారెస్ట్‌ డిపార్టుమెంట్‌లో 1,668 పోస్టులకు ఆమోదం వచ్చింది. వీటిల్లో ఫారెస్ట్‌ బీస్ట్‌ ఆఫీసర్‌ పోస్టులు అత్యధికంగా 1,393 ఉన్నాయి. ఫారెస్ట్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ పోస్టులు 92, టెక్నికల్‌ అసిస్టెంట్‌ 32, జూనియర్‌ అసిస్టెంట్‌ (73) ఇలా మొత్తం 1,393లకు త్వరలో నోటిఫికేషన్‌ విడుదలకానుంది.
  • తెలంగాణ స్టేట్‌ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ 40 పోస్టులు. వాటిల్లో.. అకౌంట్స్ ఆఫీసర్‌ పోస్టులు: 5 అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II పోస్టులు: 7 అసిస్టెంట్ మేనేజర్‌ పోస్టులు: 9 అసిస్టెంట్‌ స్టోర్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ II పోస్టులు: 8 డేటా ప్రాసెసింగ్‌ అసిస్టెంట్‌ గ్రేడ్‌ II పోస్టులు: 8 డేటా ప్రాసెసింగ్‌ ఆఫీసర్‌ పోస్టులు: 3

పై పోస్టులన్నింటినీ టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం ఈ సదర్భంగా తెల్పింది.

Also Read:

Beauty Tips: ఎండ వేడికి మీ చర్మం డల్‌గా మారిందా? రోజ్ వాటర్, కీర, ముల్తానీ మట్టితో ఇలా చేశారంటే..