TS Govt Jobs 2022: పోలీస్ నియామకాలకు గరిష్ఠ వయోపరిమితి 3 ఏళ్లకు పెంచుతూ తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్న పోలీస్ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కార్ బుధవారం (ఏప్రిల్ 13) ఉత్తర్వులు జారీ చేసింది..
Upper age limit raised by 3 years for TSLPRB Jobs 2022: తెలంగాణ రాష్ట్రంలో పెద్ద ఎత్తున చేపట్టబోతున్న పోలీస్ నియామకాలకు సంబంధించి వయోపరిమితిని పెంచుతూ తెలంగాణ సర్కార్ బుధవారం (ఏప్రిల్ 13) ఉత్తర్వులు జారీ చేసింది. తాజా ఉత్తర్వుల ప్రకారం అభ్యర్ధుల గరిష్ఠ వయోపరిమితిని (Upper Age Limit) 3 ఏళ్లకు పెంచింది. అంటే యూనిఫామ్ సర్వీసు (Uniform Services)లైన పోలీస్, ఎక్సైజ్, ఫైర్, ప్రిజన్, ఫారెస్ట్ వంటి పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులకు ఈ సడలింపు వర్తిస్తుందన్నమాట. కాగా ఈ ఏడాది తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ 80,039 ఉద్యోగ నియామకాలు చేపట్టబోతున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు సంబంధించి అభ్యర్థుల వయోపరిమితి అర్హతలో 3 సంవత్సరాలు సడలించాలని తెలంగాణ కేబినెట్ మంగళవారం నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగార్థుల నుండి వచ్చిన అభ్యర్థన మేరకు ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. కేబినెట్ నిర్ణయం తర్వాత ఈ రోజు తెలంగాణ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
Also Read: