Srilakshmi C |
Updated on: Apr 13, 2022 | 9:00 PM
Summer Skin Care Tips in Telugu: వేసవి కాలంలో ఎండ, కాలుష్యం వల్ల చర్మం డల్‌గా మారుతుంది. ఈ కాలంలో చర్మాన్ని సహజ పద్ధతుల్లో కాపాడుకోవడానికి కొన్ని చిట్కాలు మీకోసం..
రోజ్ వాటర్ చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. కాటన్ ప్యాడ్‌తో రోజ్ వాటర్‌ను చర్మంపై అప్లై చేయవచ్చు. ఇది చర్మంపై బ్లాక్ టోన్‌ను తొలగిస్తుంది. రక్త ప్రసరణను మెరుగుపరచడానికి పనిచేస్తుంది. ప్రతిరోజూ రోజ్ వాటర్‌తో ఇలా చేయవచ్చు.
వేసవిలో జిడ్డు చర్మానికి ముల్తానీ మట్టి అప్లై చేస్తే ఎంతో మేలు వనకూరుతుంది. ఒక చెంచా ముల్తానీ మిట్టిలో రోజ్ వాటర్ కలపండి. దీన్ని చర్మంపై అప్లై చేసి15 నిమిషాలు తర్వాత నీటితో కడగాలి. ఇది చర్మాన్ని చల్లబరుస్తుంది. చర్మంపై ఆయిల్ ఉత్పత్తి కాకుండా నియంత్రిస్తుంది.
వేసవిలో కీర దోసకాయ తినడం మీ ఆరోగ్యానికి మాత్రమే కాకుండా చర్మానికి కూడా ఎంతో మేలు చేస్తుంది. ఇది కళ్ల కింద నల్లటి వలయాలను తొలగించడంలో సహాయపడుతుంది. దోసకాయ రసాన్ని చర్మంపై 15 నిమిషాలు మర్దన చేసి, ఆ తర్వాత నీటితో కడిగేస్తే, చర్మం చల్లబడుతుంది.
వేసవి కాలంలో ఐస్ క్యూబ్స్ చర్మానికి చాలా మేలు చేస్తాయి. చర్మానికి గ్రీన్ టీ లేదా దోసకాయ రసంతో చేసిన ఐస్ క్యూబ్స్ ఉపయోగించడం వల్ల ముఖంపై జిడ్డు తొలగించి, మూసుకుపోయిన రంధ్రాలు తెరచుకునేలా చేస్తాయి. వడదెబ్బ సమస్యను తొలగిస్తుంది.