Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..

సిటీలోని లక్డీకాపూల్‌ వద్ద కారులో మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్‌లో ఉన్న వేంకటేశ్వర హోటల్‌ సమీపంలో ఉన్న రేంజ్‌ రోవర్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

Hyderabad: హైదరాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్.. లక్డీకాపూల్‌ వద్ద రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు..
Car Catches Fire
Follow us
Ram Naramaneni

|

Updated on: Apr 13, 2022 | 6:34 PM

Viral Video: హైదారాబాద్‌లో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. లక్డీకాపూల్‌(Lakdikapul) వద్ద కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. లక్డీకాపూల్‌లో ఉన్న వేంకటేశ్వర హోటల్‌ దగ్గర నడిరోడ్డుపై రేంజ్‌ రోవర్‌ కారులో మంటలు చెలరేగాయి. ప్రమాదం జరిగిన సమయంలో కారులో ఉన్న నలుగురు సేఫ్‌గా బయటపడ్డారు. అక్కడే ఉన్న ట్రాఫిక్ కానిస్టేబుల్ మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న సైఫాబాద్‌ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. వరంగల్‌కు చెందిన వంశీకృష్ణ కారుగా పోలీసులు గుర్తించారు. కారులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి, పొగ అలుముకోవడంతో లక్డీకాపూల్‌ ప్రాంతమంగా భారీ స్థాయిలో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. షాట్ సర్యూట్ కారణంగా కారులో మంటలు చెలరేగి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఎండాకాలంలో వాహనాలు నడిపేవారు కాస్త జాగ్రత్త సుమీ..!