Ambedkar Statue: అంబేద్కర్ చూపిన బాటలోనే కేసీఆర్.. డిసెంబ‌ర్‌లోగా విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం: మంత్రి కేటీఆర్

అంబేద్కర్ వ‌ల్లే తెలంగాణ వ‌చ్చిందన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు. స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ద‌ళిత‌బంధు లాంటి కార్యక్రమాన్ని అమ‌లు చేయ‌లేద‌ని కేటీఆర్ తెలిపారు.

Ambedkar Statue: అంబేద్కర్ చూపిన బాటలోనే కేసీఆర్.. డిసెంబ‌ర్‌లోగా విగ్రహాన్ని ప్రతిష్టిస్తాం: మంత్రి కేటీఆర్
Ktr
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 13, 2022 | 5:15 PM

Ambedkar Statue in Hyderabad: అంబేద్కర్ వ‌ల్లే తెలంగాణ(Telangana) వ‌చ్చిందన్నారు రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు(KTR). స్వాతంత్ర్యం వచ్చాక ఏ ప్రధాని, ఏ ముఖ్యమంత్రి ద‌ళిత‌బంధు లాంటి కార్యక్రమాన్ని అమ‌లు చేయ‌లేద‌ని కేటీఆర్ తెలిపారు. వెనుక‌బ‌డ్డ ద‌ళితుల‌ను అభివృద్ది ప‌థంలో న‌డిపించేందుకు సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రతిష్టాత్మకంగా ప్రవేశ‌పెట్టారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహనీయులు అంబేద్కర్ చూపిన బాటలో నడుస్తూ, వారి ఆశయాల మేరకు ప్రజలందరి సంక్షేమానికి కృషి చేస్తున్నారని మంత్రి కేటీఆర్ వెల్లడించారు.

హైదరాబాద్‌ నగరంలోని ఐమాక్స్‌ సమీపంలో ఏర్పాటు చేయనున్న 125 అడుగుల అంబేద్కర్‌ విగ్రహాన్ని డిసెంబర్‌ నెలాఖరు నాటికి ప్రతిష్ఠిస్తామని మంత్రి కేటీఆర్‌ వెల్లడించారు. రూ.150కోట్లతో చేపట్టిన విగ్రహ, ప్రాంగణ నిర్మాణ పనులు అత్యంత వేగంగా సాగుతున్నాయని చెప్పారు. మరో మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి అంబేద్కర్‌ విగ్రహ ఏర్పాటు పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ హుస్సేన్‌సాగర్‌ తీరాన సచివాలయం సమీపంలో విగ్రహం ఏర్పాటువుతోందని చెప్పారు. పనులు ముమ్మరంగా సాగుతున్నాయన్నారు. అంబేడ్కర్‌ విగ్రహ స్థలంలో 11 ఎకరాల్లో మ్యూజియం, పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. రాష్ట్ర ప్రజలు గర్వించేలా విగ్రహ నిర్మాణం ఉంటుందన్నారు.

తెలంగాణలో ఇప్పుడు అభివృద్ధి ఉద్యమం నడుస్తోందని మంత్రి కేటీఆర్ అన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేనన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో అమలవుతున్నాయన్నారు. మాకున్న పరిమితైమన అధికారంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు తెచ్చామని మంత్రి కేటీఆర్ తెలిపారు. స్వాతంత్రం వచ్చాక.. మిషన్ భగీరధ ద్వారా ఇంటింటికి నళ్లా ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అన్నారు మంత్రి. ప్రభుత్వంచేస్తున్న అభివృద్ధి పనులకు కేంద్రం ప్రోత్సాహం ఇవ్వడం లేదంటూ విమర్శించారు మంత్రి కేటీఆర్. దాదాపు అన్ని మంచి అంశాలలో తెలంగాణ రాష్ట్రం దేశానికే దిక్సూచిగా మారింది. దళితబంధు,రైతుబంధు పథకాలు మహత్తరమైనవి,ప్రజలందరి సహకారంతో వీటిని విజయవంతంగా అమలు చేస్తున్నామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.

మంత్రి కొప్పుల ఈశ్వర్‌ మాట్లాడుతూ.. గ‌త 8 నెల‌లుగా విగ్రహ ఏర్పాటు ప‌నులను ప్రతి నిత్యం పర్యవేక్షిస్తున్నామన్నారు. నిర్మాణ పనులు రాత్రిబవళ్లు ముమ్మరంగా కొనసాగుతున్నాయన్నారు.ఈ విగ్రహం ప్రపంచంలోని అంబేద్క‌ర్ విగ్ర‌హాలన్నింటిలో అతి పెద్దది. ఇది దేశానికే త‌ల‌మానికంగా నిల‌వ‌నున్న‌ది, ఇందులో మ్యూజియం,గ్రంథాలయం,ఫోటో గ్యాలరీ,ధ్యాన మందిరం, మీటింగ్ హాళ్లు, క్యాంటీన్ ఏర్పాటు జరుగుతుంది. ఈ ప్రాంగణాన్ని సుందరంగా, ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతం, ప‌ర్యాట‌కులు పెద్ద సంఖ్యలో సందర్శించనున్నారని కొప్పుల ఈశ్వర్ తెలిపారు. అంబేద్క‌ర్ ఆశ‌యాలు దేశంలో అమ‌లు కావాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు. ఆ మ‌హ‌నీయుడు క‌ల‌లుగ‌న్న‌ట్టు తెలంగాణలో అన్ని వర్గాల వారికి మరింత మేలు జరుగుతుందని మంత్రి వెల్లడించారు.

Read Also….  K A Paul: గవర్నర్ తమిళ సై ని కలిసిన కేఏ పాల్.. తెలంగాణ సర్కార్‌పై సంచలన వ్యాఖ్యలు..

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే