Bandi Sanjay: అక్బర్ కేసు కొట్టివేత ప్రభుత్వ వైఫల్యమే.. చిత్తశుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలిః బండి సంజయ్

వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్ధోషిగా నిర్ధారించడం రాష్ట్ర ప్రభుత్వ తీరును భారతీయ జనతా పార్టీ తప్పుబట్టింది.

Bandi Sanjay: అక్బర్ కేసు కొట్టివేత ప్రభుత్వ వైఫల్యమే.. చిత్తశుద్ధి ఉంటే అప్పీల్‌కు వెళ్లాలిః బండి సంజయ్
Follow us
Balaraju Goud

|

Updated on: Apr 13, 2022 | 5:49 PM

Bandi Sanjay on Akbar Case: వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ను నిర్ధోషిగా నిర్ధారించడం రాష్ట్ర ప్రభుత్వ తీరును భారతీయ జనతా పార్టీ తప్పుబట్టింది.ఈ విషయంలో మేం కోర్టు ఇచ్చిన తీర్పును తప్పుపట్టడం లేదన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం కావాలనే ఆధారాలను సమర్పించలేదని బీజేపీ చీప్ బండి సంజయ్ అన్నారు. అక్బర్ హేట్ స్పీచ్ కేసు కొట్టివేత ప్రభుత్వ వైఫల్యం అని బీజేపీ మండిపడింది. హిందులను నరికి చంపుతామన్న అక్బర్ తప్పించుకుంటే సమాజం ఒప్పుకోదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసు నిరూపించడంలో పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమైందని భారతీయ జనతా పార్టీ ఆరోపించింది. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం పై కోర్టులో అప్పీల్ చేయాల్సిందే సూచించింది.

ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ వివాదాస్పద వ్యాఖ్యల కేసులో ఇవాళ నాంపల్లి కోర్టు తీర్పు వెలువరించింది. అక్బరుద్దీన్‌పై ఉన్న రెండు కేసులను కోర్టు కొట్టివేసింది. మత విద్వేశాలు రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు మరోసారి చేయవద్దని సూచించింది. ఈ తీర్పును విజయంగా భావించవద్దని.. కేసులు కొట్టి వేసిన సందర్భంగా సంబురాలు చేసుకోవద్దని కోర్టు హెచ్చరించింది.

కోర్టు తీర్పుపై స్పందించిన బీజేపీ రాష్ట్ర పార్టీ అధ్యక్షులు బండి సంజయ్ ప్రభుత్వ తీరును తప్పుబట్టారు. ఎంఐఎం నేతలతో టీఆర్ఎస్ సర్కార్ ములాఖత్ వల్లే ఇది జరిగింది.. కాంగ్రెస్ – టీఆర్ఎస్ – ఎంఐఎం కుమక్కు రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. సరైన సమయంలో ఆ పార్టీలకు ప్రజలు తగిన గుణపాఠం చెప్పడం ఖాయమన్నారు. ఆధారాలు కోర్టులో ప్రవేశ పెట్టకుండా కేసును నీరుకార్చారని బండి సంజయ్ మండిపడ్డారు. ఈ కేసును న్యాయ స్థానం కొట్టివేయడం విస్మయం కలిగిస్తోందన్నారు. 15 నిమిషాలు సమయమిస్తే హిందువులందరినీ నరికి చంపుతామంటూ అక్బరుద్దీన్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచమంతా చూసిందని ఆయన గుర్తు చేశారు. అయినా అక్బరుద్దీన్ ను నిర్దోషిగా ప్రకటించడం ఆశ్చర్యం కలుగుతోందన్నారు. ప్రభుత్వానికి ఈ విషయంలో ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా అప్పీల్ కు వెళ్లాలని బీజేపీ పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. లేకపోతే హిందూ సమాజం చూస్తూ ఊరుకోదన్నారు. వచ్చే బీజేపీ ప్రభుత్వం లో దీన్ని సీరియస్ గా తీసుకుంటామని హెచ్చరించారు.

Read Also…   KVS MP quota: కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై ఎంపీ కోటా రద్దు.. కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం

ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
ఆర్ధిక సంస్కరణల ఆద్యుడు.. ప్రజలకు 'ఉపాధి' కల్పించిన నాయకుడు
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌కు ప్రముఖుల నివాళి
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
నవ భారత రూపశిల్పి ఇకలేరు..
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఎవరో నా పేరు మర్చిపోతే ఫీల్ అవుతానా.? సీఎం రేవంత్ ఏమన్నారంటే
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఇండియన్ సినిమా క్యాపిటల్‌గా హైదరాబాద్.. సీఎంతో సినీ ప్రముఖుల భేటీ
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
ఉదయాన్నే ఖాళీకడుపుతో జీలకర్ర వాటర్ తాగితే,శరీరంలో ఉహించనిమార్పులు
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
బీఎస్‌ఎన్‌ఎల్‌ గుడ్‌న్యూస్‌.. ఒక నెల పాటు ఉచిత ఇంటర్నెట్‌ సదుపాయం
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
మద్యం మత్తులో నిద్రిస్తున్న భర్త.. అదే అదునుగా చూసిన భార్య..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
చేసిన సినిమాలన్ని ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్.. ఇప్పుడు మోటివేషనల్ స్పీకర్..ఎవరంటే