Summer Special Trains: సమ్మర్ హాలీడేస్ కోసం వెళుతున్నారా? అయితే ఈ స్పెషల్ ట్రైన్స్ మీకోసమే..
Holiday Special Trains: వేసవి సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. మరికొందరు చల్లని వాతావరణం కలిగిన వేసవి విడిది ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు.
Holiday Special Trains: వేసవి సెలవుల్లో చాలామంది సొంతూళ్లకు వెళ్లాలనుకుంటారు. ఇంకొందరు పుణ్యక్షేత్రాలు, పర్యాటక ప్రదేశాలను సందర్శించాలనుకుంటారు. మరికొందరు చల్లని వాతావరణం కలిగిన వేసవి విడిది ప్రాంతాలకు వెళ్లాలనుకుంటారు. దీనిని దృష్టిలో పెట్టుకొని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల మధ్య ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సంఖ్యను ఎప్పటికప్పుడు పెంచుతోంది. తాజాగా మరికొన్ని స్పెషల్ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో భాగంగా శుక్రవారం (ఏప్రిల్15) 07433 నంబరు గల రైలు సికింద్రాబాద్ (Secunderabad) స్టేషన్ నుంచి రాత్రి 7.05 గంటలకు బయలు దేరి నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, చీరాల, ఒంగోలు, నెల్లూరు, నెల్లూరు, గుడూరు, రేణిగుంట స్టేషన్ల మీదుగా మరుసటి రోజు (ఏప్రిల్16) ఉదయం 7.50 గంటలకు తిరుపతి(Tirupati) కి చేరుకుంటుంది. అదే రోజు రాత్రి 07434 నంబర్ గల రైలు తిరుపతి నుంచి 8.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు (ఏప్రిల్ 17) ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.
విశాఖ- నాందేడ్‌ల మధ్య..
దీంతో పాటు విశాఖపట్నం- నాందేడ్‌ల మధ్య కూడా స్పెషల్ ట్రైన్ సర్వీసులను నడపనుంది. 07082 నంబర్ గల రైలు శుక్రవారం (ఏప్రిల్ 15) సాయంత్రం 4.35 గంటలకు నాందేడ్ నుంచి బయలుదేరుతుంది. ముద్‌ఖేడ్, బాసర్, నిజామాబాద్, కామారెడ్డి, సికింద్రాబాద్, ఖాజీపేట్, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లి గూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, అనకాపల్లి, దువ్వాడ స్టేషన్ల మీదుగా మరుసటి రోజు (ఏప్రిల్16) ఉదయం 9.50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. ఇక ఏప్రిల్ 17న 07083 నంబర్ గల రైలు సాయంత్రం 6.20గంటలకు విశాఖ నుంచి బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10గంటలకు నాందేడ్ చేరుకుంటుంది. వేసవి సెలవులను ఎంజాయ్ చేయాలనుకునేవారు ఈ సమ్మర్ స్పెషల్ రైళ్ల సర్వీసులను వినియోగించుకోవాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.
Holiday Special Trains between #Secunderabad and #Tirupati @drmsecunderabad @drmhyb @drmgtl pic.twitter.com/CK3U2OGpQg
— South Central Railway (@SCRailwayIndia) April 13, 2022
Also Read: Hollywood: చిత్ర పరిశ్రమలో మరో విషాదం.. హాస్యనటుడు కన్నుమూత.. గౌరవార్ధం నవ్వమని కోరిన కుటుంబ సభ్యులు
Bahubali ka bap: వీడెవడండీ బాబు.. బాహుబలికే బాబులా ఉన్నాడు..! వీడి స్టంట్స్ చుస్తే మైండ్ బ్లోయింగ్..