Kendriya Vidyalaya: కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై ఎంపీ కోటా రద్దు.. కేంద్ర సర్కార్ సంచలన నిర్ణయం
కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లోని సీట్ల కోటపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది.
MP quota in Kendriya Vidyalaya: కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోడీ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకుంది. కేంద్రీయ విద్యాలయాల్లోని సీట్ల కోటపై తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉన్న కేంద్రీయ విద్యాలయాల్లో ప్రత్యేక కోటా సీట్లపై కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) కీలక ప్రకటన చేసింది. కేంద్రీయ విద్యాలయాల్లో ఇకపై పార్లమెంటు సభ్యుల (ఎంపీల) కోటా కింద కేటాయించే ప్రత్యేక సీట్లను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు ఒక్కో ఎంపీకి ఏటా 10 సీట్లను కేవీఎస్ కేటాయిస్తూ వస్తోంది. అయితే, ఈ కోటా పెంచాలని గత కొంతకాలంగా ఎంపీలు డిమాండ్ చేస్తున్నారు. ఓవైపు ఎంపీలు డిమాండ్ చేస్తున్నప్పటికీ.. ప్రత్యేక కోటాను కేంద్రీయ విద్యాలయ సంఘటన్ పూర్తిగా రద్దు చేయడం గమనార్హం.
తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఎంపీ కోటా సీట్లు ఉండవని కేంద్రీయ విద్యాలయాల ప్రిన్సిపాల్స్‌కి ఆదేశాలు జారీ చేసింది కేంద్ర సర్కార్. పార్ట్ వన్ ఆఫ్ పార్ట్ బి గైడ్ లైన్స్ ప్రకారం.. కేంద్రీయ విద్యాలయాల్లో ఎంపీ కోటా సీట్లు ఎత్తివేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర సర్కార్ పేర్కొంది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది కేంద్ర విద్యా శాఖ. ఈ ఉత్తర్వులను కచ్చితంగా పాటించాలసిందేనని స్పష్టం చేసింది. కాగా కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో ని అడ్మిషన్ల కు సంబంధించి నోటిఫికేషన్ ఇటీవల విడుదలైంది. మార్చి 21వ తేదీ నుంచి జూన్ 30వ తేదీ వరకు ఈ దరఖాస్తుల ప్రక్రియ కొనసాగనుంది. ఇందులో దరఖాస్తు చేసుకునేందుకు ఈ https://kvsangathan.nic.in/ వెబ్ సైట్‌లో పూర్తి వివరాలను అందుబాటులో ఉంచింది.