IB ACIO Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఎంపిక

IB ACIO Recruitment 2022: ఇంటెలిజెన్స్‌ బ్యూరోలో భారీగా ఉద్యోగాలకు నోటిఫికేషన్‌.. రాత పరీక్షలేకుండానే ఎంపిక
Ib Acio

భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి..

Srilakshmi C

|

Apr 13, 2022 | 5:27 PM

IB ACIO Grade II Technical Recruitment 2022: భారత ప్రభుత్వ హోం మంత్రిత్వశాఖకు చెందిన ఇంటెలిజెన్స్‌ బ్యూరో సంస్థ.. అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 (ACIO Posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 150

పోస్టుల వివరాలు: అసిస్టెంట్‌ సెంట్రల్‌ ఇంటెలిజెన్స్‌ ఆఫీసర్‌ గ్రేడ్‌ 2 పోస్టులు

ఖాళీల వివరాలు:

  • కంప్యూటర్‌ సైన్స్‌ అండ్‌ ఇన్పర్మేషన్‌ టెక్నాలజీ పోస్టులు: 56
  • ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ పోస్టులు: 94

వయోపరిమితి: మే 7, 2022 నాటికి అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.44,90ల నుంచి రూ.1,42,400ల వరకు జీతంగా చెల్లిస్తారు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో బీటెక్‌/బీఈ/మాస్టర్స్ డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే వ్యాలిడ్‌ గేట్ 2020/2021/2022 స్కోర్ కూడా ఉండాలి.

ఎంపిక విధానం: గేట్ స్కోర్, ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు రుసుము:

  • జనరల్/ఈడబ్ల్యూఎస్‌/ఓబీసీ అభ్యర్ధులకు: రూ.100
  • ఎస్సీ/ఎస్టీ/మహిళలు/ఎక్స్‌ సర్వీస్‌మెన్‌ అభ్యర్ధులకు ఫీజు మినహాయింపు వర్తిస్తుంది.

దరఖాస్తులకు చివరి తేదీ: మే 7, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Also Read:

CBSE term 2 Exams 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షల తేదీలివే..

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Telugu