CBSE term 2 Exams 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షల తేదీలివే..

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2022 టర్మ్ 2 పరీక్షలకు సంబంధించి 10, 12వ తరగతులకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి..

CBSE term 2 Exams 2022: సీబీఎస్సీ 10, 12 తరగతుల టర్మ్ 2 పరీక్షలకు అడ్మిట్‌ కార్డులు విడుదల.. పరీక్షల తేదీలివే..
ap 10th results
Follow us
Srilakshmi C

|

Updated on: Apr 13, 2022 | 4:53 PM

CBSE term 2 admit cards 2022 download: సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) 2022 టర్మ్ 2 పరీక్షలకు సంబంధించి 10, 12వ తరగతులకు అడ్మిట్‌ కార్డులు విడుదలయ్యాయి. కాగా 10, 12 తరగతుల పరీక్షలు రెండూ ఏప్రిల్ 26 నుంచి ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి పరీక్ష మే 24న ముగియనుండగా, 12వ తరగతి పరీక్షలు జూన్ 15 వరకు కొనసాగనున్నాయి. టర్మ్-2 పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులు సీబీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ cbse.nic.in లేదా cbse.gov.inలో అడ్మిట్ కార్డులను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. కాగా 2021లో కరోనా మహమ్మారి కారణంగా బోర్డు పరీక్షలను నిర్వహించలేదు. ఈ ఏడాది తొలిసారిగా సీబీఎస్సీ బోర్డు పరీక్షలు రెండు టర్మ్‌లలో జరుగుతున్నాయి. గత ఏడాది (2021) నవంబర్-డిసెంబర్‌లో టర్మ్-1 ఫైనల్ పరీక్షలు నిర్వహించింది. వీటికి సంబంధించిన ఫలితాలు కూడా బోర్డు ఇప్పటికే ప్రకటించింది. ఇక ప్రస్తుతం టర్మ్ 2 పరీక్షలు జరగనున్నాయి. ఈ పరీక్షలకు సంబంధించిన మోడల క్వశ్చన్‌ పేపర్లు, సిలబస్‌ ఇతర వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్ cbseacademic.nic.inలో చెక్‌ చేసుకోవచ్చు.

CBSE term 2 admit cardలను ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే.. ముందుగా అధికారిక వెబ్‌సైట్‌ cbse.nic.in లేదా cbse.gov.inను ఓపెన్‌ చెయ్యాలి. Class 10 or Class 12 term-2 admit card లింక్‌పై క్లిక్ చెయ్యాలి. తగిన ఆధారాలతో లాగిన్ అయ్యి, అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసి ప్రింట్‌ఔట్ తీసుకోవాలి.

Also Read:

TS TET 2022: ముగిసిన తెలంగాణ టెట్‌ 2022 దరఖాస్తు ప్రక్రియ.. రెండో పేపర్‌కు పోటెత్తిన దరఖాస్తులు!