Skydive: వయసుతో పనిఏముంది.. పట్టుదల ముందు.. 60ఏళ్ళు దాటిన వృద్ధులు స్కైడైవ్.. జస్ట్ రికార్డ్ మిస్..
Skydive: వయసుతో ఏముంది.. పట్టుదల ధృడ సంకల్పం ముందు అని చాటి చెప్పారు కొంతమంది వృద్ధులు. అవును సర్వసాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు నడవడానికే చేతకాక చాలా ఇబ్బంది..
Skydive: వయసుతో ఏముంది.. పట్టుదల ధృడ సంకల్పం ముందు అని చాటి చెప్పారు కొంతమంది వృద్ధులు. అవును సర్వసాధారణంగా 60 ఏళ్లు దాటిన వృద్ధులు నడవడానికే చేతకాక చాలా ఇబ్బంది పడతారు. కొందరు కర్రసాయం లేనిదే నడవలేరు. కానీ, కాలిఫోర్నియాలో ఓ సీనియర్ సిటిజన్స్ గ్రూప్ అద్భుతం చేశారు. ఒకేసారి 107 మంది 60 ఏళ్లు పైబడిన వృద్ధులు స్కైడైవ్ చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. అయితే తృటిలో ప్రపంచ రికార్డును కోల్పోయారు. కాగా, ఈ వార్త వైరల్‌గా మారింది.
స్కైడైవర్స్ ఓవర్ సిక్ట్సీ (ఎస్ఓఎస్) గ్రూప్‌లో 60 ఏళ్లు పైబడిన వృద్ధులున్నారు. ఇందులోని 107 మంది దక్షిణ కాలిఫోర్నియాలో ఎగురుతున్న విమానం నుంచి స్కైడైవ్ చేశారు. ఈ ఫీట్ చేయడానికి వారు చాలాసార్లు ట్రయల్స్ వేశారు. చివరికి విజయవంతంగా స్కైడైవ్ చేసి చూపించారు. అయితే, వాతావరణం సహకరించకపోవడంతో 75 మందిమాత్రమే ఈ ఫీట్ చేశారు. దీంతో గిన్నిస్ రికార్డు తృటిలో తప్పిపోయింది. కానీ, వారి ప్రయత్నం మాత్రం నెట్టింట వైరల్‌గా మారింది. వారి సాహసానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. రికార్డు తప్పితేనేమి.. వాళ్లు అంత ధైర్యం చేయడమే ఓ రికార్డ్ అంటూ అభినందిస్తున్నారు.