JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!

చౌక ధరకు ముడి చమురు సరఫరా చేస్తామన్న రష్యా ఆఫర్‌ను ఇండియా అంగీకరించడంతోనే అమెరికా, యుకె వంటి దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. అమెరికా అయితే ఇండియాపై ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. కానీ మర్నాడే మాట మార్చేసింది. అటు యుకె, ఆస్ట్రేలియా వంటి దేశాలు కూడా ముందుగా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినా...

JAIHO BHARATH: జై హో భారత్.. తటస్థ విధానంతోనే పలు దేశాలను దారిలోకి తెచ్చిన దౌత్య విధానం.. అమెరికాలో మార్పుకు అదే కారణం!
Biden, Modi, Jayshankar, Putin
Follow us
Rajesh Sharma

| Edited By: Ram Naramaneni

Updated on: Apr 13, 2022 | 9:47 PM

JAIHO BHARATH INDIA STAND ON UKRAINE CONFLICT ADOPTABLE FOR MANY COUNTRIES: జై హో భారత్.. ఎస్..! ఉక్రెయిన్(Ukraine), రష్యా(Russia) యుద్దం నేపథ్యంలో తటస్థ వైఖరిని అవలంభిస్తున్న ఇండియాకు ఇపుడు ప్రపంచ వ్యాప్తంగా మద్దతు పెరుగుతోంది. ఫిబ్రవరి 24న రష్యా మిలిటరీ చర్య ప్రారంభం అయిన వెంటనే దాదాపు 148 దేశాలు పుతిన్(vladimir putin) వైఖరిని ఎండగట్టాయి. ఉక్రెయిన్ దేశం పట్ల సానుభూతి ప్రకటించాయి. కానీ ఆ తర్వాత నెలన్నర రోజుల్లో పరిస్థితి మారిపోయింది. ఇపుడు రష్యా సైనిక చర్యను తప్పు పడుతున్న దేశాల సంఖ్య 93కు పడిపోయింది. అదేసమయంలో భారత్ అనుసరిస్తూ వస్తున్న తటస్థ విధానానికి అనూహ్యంగా మద్దతు పెరిగింది. దక్షిణాసియా దేశాలతోపాటు పలు గల్ఫ్ కంట్రీస్ భారత విధానాన్ని అడాప్ట్ చేసుకున్నాయి. ఉక్రెయిన్ పట్ల మానవీయ కోణంలో జాలి చూపుతూ ఆసరా అందిస్తున్న భారత్.. రష్యాకు కూడా దూరం జరగడం లేదు. రష్యా నుంచి ముడిచమురుతోపాటు గతంలో కొనసాగిన మిలిటరీ రంగ దిగుమతులను కొనసాగిస్తూనే వుంది. చౌక ధరకు ముడి చమురు సరఫరా చేస్తామన్న రష్యా ఆఫర్‌ను ఇండియా అంగీకరించడంతోనే అమెరికా(America), యుకె(UK) వంటి దేశాలు గగ్గోలు మొదలుపెట్టాయి. అమెరికా అయితే ఇండియాపై ఆంక్షలు విధిస్తామని కూడా హెచ్చరించింది. కానీ మర్నాడే మాట మార్చేసింది. అటు యుకె, ఆస్ట్రేలియా(Australia) వంటి దేశాలు కూడా ముందుగా కొంచెం ఆగ్రహం వ్యక్తం చేసినా.. చివరికి ఇండియాది ఇండిపెండెంట్ ఫారిన్ పాలసీ అంటూ ఎండార్స్ చేశాయి. స్వతంత్ర దౌత్యవిధానాన్ని అవలంభిస్తున్న భారత్‌ను ప్రశ్నించలేమని కూడా యుకె తేల్చేసింది.

ఈ క్రమంలో బైడెన్(Joe Biden), మోదీ(PM Modi)ల వర్చువల్ భేటీ, ఇండియా, అమెరికా దేశాల మంత్రిత్వ స్థాయి చర్చలు (2+2 భేటీగా పిలుస్తున్నారు) కీలకంగా కనిపించాయి. ఈ భేటీల్లో అమెరికా.. భారత్‌పై ఒత్తిడి తేవడం ఖాయమని అందరు అనుకున్నారు. కానీ పరిస్థితి తలకిందులైంది. ఇండియన్ ఫారిన్ పాలసీని ప్రశ్నించలేమని బైడెన్ తరపున వైట్ హౌజ్ ప్రకటించింది. కేవలం ప్రకటించడమే కాదు.. ఉక్రెయిన్, రష్యాల విషయంలో ఇండియా విధానాన్ని పరోక్షంగా సమర్థించింది కూడా. ఉక్రెయిన్‌కు మానవీయ కోణంలో సాయమందిస్తున్న ఇండియాను వైట్ హౌజ్ ప్రతినిధి కొనియాడారు. ఓసమయంలో వైట్ హౌజ్ ప్రతినిధి.. ఇండియన్ రాయభారా అన్న సందేహం వచ్చేలా ఆయన మాట్లాడారు. ఇదంతా ఎలా సాధ్యమైంది? ఫిబ్రవరి 24 యుద్దం ప్రారంభమైనపుడు ఇండియా తటస్థ విధానానికి భిన్నంగా మాట్లాడిన చాలా దేశాలు.. ఇపుడు ఇండియన్ విధానాన్ని అనుసరిస్తున్నాయి. ఇండోనేషియా, సింగపూర్, థాయ్ లాండ్, ఫిలిఫ్పైన్స్, కాంబోడియా, వియత్నాం, నేపాల్, బంగ్లాదేశ్, మయన్మార్ దేశాలతోపాటు పలు గల్ఫ్ దేశాలు భారత తటస్థ విధానాన్ని అనుసరించడం మొదలు పెట్టాయి. ఇదిలా కొనసాగుతుండగానే అనూహ్యంగా అమెరికా, యుకె వంటి దేశాలు భారత విధానాన్ని పరోక్షంగా హైలైట్ చేయడం ప్రారంభించాయి.

తాజా పరిణామాల నేపథ్యంలో ఆంక్షలు విధిస్తామన్న అమెరికా.. ఇండియాను ఐక్యరాజ్యసమితి భద్రతామండలిలో చూడాలనుకుంటున్నామంటూ మరోసారి ప్రకటించి అందరినీ ఆశ్చర్యచకితులను చేసింది. అదేసమయంలో ఇండియాతో కలిసి నేవీ విన్యాసాలను కొనసాగిస్తామని తెలిపింది. భారత నౌకాశ్రయాలను ఇకపై అమెరికన్ యుద్ద నౌకలు తరచూ సందర్శిస్తాయని కూడా ప్రకటించింది. ఇది రెండు దేశాల మధ్య రక్షణ రంగ సంబంధాలను మరింత బలోపేతం చేస్తుందన్న అంచనాలు వినిపిస్తున్నాయి. అయితే.. భారత దేశంలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ అమెరికా సన్నాయి నొక్కులు నొక్కడం మాత్రం కాస్త ఆందోళన కలిగించే పరిణామమే. అమెరికాతో జరిగిన చర్చల్లో భారత వాణిని బలంగాను, ప్రబలంగాను వినిపించిన విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి ప్రొఫెసర్ జయశంకర్ ఇపుడు అందరి ప్రశంసలు పొందుతున్నారు. పలు సంస్థల అధినేతలు జయశంకర్ వాగ్ధాటిని, మన దేశ విధానాన్ని వివరించేందుకు ఆయన ఎంచుకున్న ప్లాట్ ఫామ్స్, సందర్భాలు అమోఘమని మెచ్చుకుంటున్నారు. రష్యా, భారత్‌ల మధ్య సంబంధాలపై వెస్ట్రన్‌ మీడియా, అమెరికా అధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు చేస్తున్న ​వ్యాఖ్యలపై భారత విదేశీ వ్యవహారాల శాఖా మంత్రి జయశంకర్‌ అద్భుతమైన సమాధానం ఇచ్చారంటూ పేటీఎం సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ ట్వీట్ చేశారు. భారత విధానాన్ని అంతర్జాతీయంగా సమర్థంగా ముందుకు తీసుకెళ్తున్న జయశంకర్‌కి రావాల్సినంత ప్రచారం ఎందుకు లభించడం లేదని కూడా ఆయన ప్రశ్నించారు. విజయ్ శేఖర్‌ శర్మ వెలిబుచ్చిన అభిప్రాయంతో ఏకీభవించారు ఎడిల్‌వైజ్‌ సీఈఓ రాధికా గుప్తా. విపత్కర పరిస్థితులను ఆత్మ విశ్వాసంతో ఎలా ఎదుర్కొవాలో చెప్పేందుకు ఈ సంభాషణ మాస్టర్‌ క్లాస్‌ అంటూ రాధికా గుప్తా అభిప్రాయపడ్డారు.

ఇలా ఇందరి ప్రశంసలు పొందేలా జయశంకర్ ఏం చేశారు ? ఏం చెప్పారు ? ఇదిప్పుడు ఆసక్తికరంగా మారింది. రష్యా 35 శాతం సబ్సిడీతో ముడిచమురు ఆఫర్ చేయడం.. దానికి ఇండియా ఓకే అనడం సహజంగానే అమెరికాకు, దానితో అన్ని అంశాల్లో యుఎస్‌తో అంటకాగే యుకెకు ఆగ్రహం తెప్పించింది. దీన్ని సాకుగా చూపి.. ఇండియాపై ఆంక్షలు విధించే అవకాశం వుందని అందరు భావించారు. కానీ పరిస్థితి అందుకు పూర్తిగా భిన్నంగా మారిపోయింది. అమెరికా మంత్రులతో జరిగిన 2+2 సమావేశంలో మంత్రి జయశంకర్‌ ముడిచమురు దిగుమతులపై వాస్తవాలను వెల్లడించారు. రష్యా నుంచి ఒక నెల రోజుల పాటు భారత్ ఎంత ముడిచమురును దిగుమతి చేసుకుంటుందో.. యూరప్ దేశాలు అంతే మొత్తం ముడిచమురును కేవలం ఒక్కపూటలో దిగుమతి చేసుకుంటున్నాయని జయశంకర్ గణాంకాలతో వివరించారు. అదేసమయంలో యుద్ధానికి తాము వ్యతిరేకమని, చర్చల ద్వారా ఇరు దేశాలు శాంతి కోసం ప్రయత్నించాలంటూ ఇప్పటికే అనేక వేదికల మీద భారత్‌ చెప్పిందని తేల్చి చెప్పారు జయశంకర్. ఇంకోవైపు మోడీ, బైడెన్ల మధ్య జరిగిన వర్చువల్ భేటీ తర్వాత వైట్ హౌజ్ ఆలోచనా విధానంలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది. కారణం భారత విధానం ఇపుడు పలు ప్రపంచ దేశాలకు ఆమోదయోగ్యం కావడమే. దాదాపు 40 దేశాలు ఇపుడు భారత తటస్థ విధానం వైపు మొగ్గుచూపుతున్నాయి. ఇది కచ్చితంగా భారత ప్రభుత్వ దౌత్య విధానమే అంటున్నారు. నిజానికి రష్యాపై ఆంక్షలు విధించిన చాలా యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురు దిగుమతులను నిలిపేయలేదు. రష్యాపై చమురు డిపెండెన్సీని వచ్చే అయిదేళ్ళలో తగ్గించుకుంటామని మాత్రమే చెప్పాయి. అంటే ఆంక్షలతో నిమిత్తం లేకుండా యూరప్ దేశాలు రష్యా నుంచి ముడిచమురును దిగుమతి చేసుకుంటున్నాయి. అమెరికా కూడా అణు సంబంధిత ముడి పదార్థాలైన యురేనియం వంటి దిగుమతులను కూడా రష్యానుంచి కొనసాగిస్తూనే వుంది. ఇక అమెరికా నుంచి ఇండియా తమ అవసరాల్లో 14 శాతం ముడిచమురును దిగుమతి చేసుకుంటుండగా.. రష్యా నుంచి కేవలం 2 శాతం మాత్రమే దిగుమతి చేసుకుంటుంది. గణాంకాల వివరణ తర్వాత అమెరికా, యుకెల వైఖరిలో స్పష్టమైన మార్పు వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఒకప్పుడు భారత్ వంటి దేశాలు అయితే రష్యా వైపు, లేకపోతే అమెరికా వైపు వుండాల్సిన పరిస్థితి. ఆనాటి పరిస్థితులు అలా వుండేవి. ప్రచ్ఛన్న యుద్ద కాలంలో ఇదే ధోరణి కొనసాగింది. భారత్ సుమారు 7 దశాబ్ధాలుగా రష్యాకు సన్నిహితంగా వుంటోంది. 1991 సంస్కరణల తర్వాత భారత్ ప్రపంచ పెద్ద మార్కెట్లలో ఒకటిగా ఎదగడంతో అమెరికా వైఖరిలో క్రమంగా మార్పు వచ్చింది. దానికితోడు మన దాయాది దేశం పాకిస్తాన్‌తో అంటకాగడం వల్ల అమెరికాకు పెద్దగా ఒరిగిందేమీ లేదు. పైగా పాకిస్తాన్ చైనా కబంధ హస్తాల్లోకి చేరింది. మహిళా జనాభాను క్రమంగా కోల్పోతున్న చైనా.. పాకిస్తాన్‌లోని మహిళలను తమ దేశానికి తరలించడం లేదా వారి కీలక శరీర అంగాలను తీసుకుపోయి తమ దేశపు లాబోరేటరీలలో వినియోగించుకోవడం చేస్తోంది. అదేసమయంలో వ్యవసాయ యోగ్యమైన భూభాగం తక్కువగా వున్న చైనా.. తమ అధిక జనాభా ఆహార అవసరాలను తీర్చేందుకు పాకిస్తాన్‌ను వాడుకుంటోంది. సింధునదీ పరివాహక ప్రాంతంలో చైనా కార్పొరేట్ వ్యవసాయం చేస్తోంది. తద్వారా పాకిస్తాన్‌ను చైనా తమ దేశ అవసరాలకు వాడుకుంటోంది. పాక్, చైనాల మైత్రి తర్వాత అమెరికా.. భారత్‌తో ఒనగూడే ప్రయోజనాలను మధింపు వేసుకుంది. పాకిస్తాన్ కంటే భారత్‌తో సాన్నిహిత్యమే ముఖ్యమని అగ్రరాజ్యం భావిస్తోంది. ఇది కూడా తాజా పరిణామాలకు కారణమని అంతర్జాతీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. ఈ వారంలో భారత్ రానున్న బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ పర్యటన తర్వాత పరిణామాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి.

రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
రెండో రోజుకు న్యూస్9 గ్లోబల్ సమ్మిట్..
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
హీరో ప్రభాస్‌ ఎవరో నాకు తెలియదు.. ఆయనతో ఎలాంటి సంబంధం లేదు
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
శీతాకాలం సూపర్ ఫుడ్‌.! పోషకాలు పుష్కలం తేగలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజ
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అల్లు అర్జున్‌పై సెటైరికల్ కామెంట్ ఇది.. విశ్వక్ క్లారిటీ.!
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
అంతరించిపోతున్న ఇండియన్‌ వైల్డ్‌ డాగ్స్..కెమెరాకు చిక్కినదృశ్యాలు
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
కన్నడ బిగ్ బాస్‌లోనూ.. ఓవర్‌ యాక్షన్.! ఇక మారవా శోభ షెట్టి.!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అది.. అదుంటే.. నిందించిన వారికి సమాధానం చెప్పొచ్చు.! సమంత పోస్ట్!
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
అందవిహీనంగా మారే రోగంతో బాధపడుతున్న హీరోయిన్.! వీడియో..
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
వైల్డ్ ఫైర్‌ పుష్ప రాజ్ కి బెస్ట్ విషెస్.. నంద్యాల వైసీపీ Ex-MLA
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!
శంకర్‌తో గొడవకు పోయి.. హిట్టు సినిమా వదులుకున్న షారుఖ్.!