ఆదిత్య 369 రీ రిలీజ్.. ఫస్ట్ ఛాయిస్ మోహిని కాదట..!
1991లో వచ్చిన టైం ట్రావెల్ సినిమా ఆదిత్య 369. ది టైం మెషీన్ అనే నవల నుంచి స్ఫూర్తి పొంది తీసిన ఈ సినిమా అప్పట్లో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. సింగీతం శ్రీనివాసరావు డైరెక్ట్ చేసిన ఈ మూవీలో నందమూరి బాలకృష్ణ హీరోగా, మోహిని కథానాయికగా నటించారు. ఏప్రిల్ 4న ఆదిత్య 369 రి రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రొడ్యూసర్ శివలెంక కృష్ణ ప్రసాద్ సినిమా గురించి ఓ ఇంటర్వ్యూలో చెప్పిన విషయాలు ఆసక్తికరంగా మారాయి.
నిజానికి ఆదిత్య 369 సినిమాలో హీరోయిన్ గా మొదట విజయశాంతిని అనుకున్నారట. ఆమె కూడా మూవీ చేసేందుకు ఓకే చెప్పిందట. కానీ అప్పటికే విజయశాంతి సినిమాలతో బిజీగా ఉండటంతో డేట్స్ కుదరలేదట. దీంతో ఆమె చేస్తున్న సినిమా ప్రొడ్యూసర్లను వేరే హీరోయిన్ ను తీసుకోవాలని కోరినా వారు అందుకు ఒప్పుకోకపోవడంతో విజయశాంతి ఆ మూవీలో నటించలేకపోయిందట. ఆ తర్వాత హీరోయిన్ గా రాధాను సెలెక్ట్ చేయాలని భావించినా ఆమె కాస్త బొద్దుగా మారడంతో వద్దనుకున్నామని కృష్ణ ప్రసాద్ చెప్పారు. సినిమాటోగ్రాఫర్ పీసీ శ్రీరామ్ తమిళంలో ఈరమాన రోజావే సినిమా చేస్తున్న అమ్మాయి బాగుందని చెప్పడంతో ఆమెను పిలిచి స్క్రీన్ టెస్ట్ చేశారట. ఆమె యాక్టింగ్ అందరికీ నచ్చడంతో మోహిని ఆదిత్య 369 సినిమా హీరోయిన్ గా సెలెక్ట్ అయిందట. ఈ మూవీ తర్వాత రెండు మూడు సినిమాలు చేసిన మోహిని ఆ తర్వాత పెళ్లి చేసుకుని సినిమా కెరీర్ కు ఫుల్ స్టాప్ పెట్టింది.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..
అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..
Bangkok Pilla: భూకంపం ఏమో కానీ.. ఈమెకు మాత్రం భలే గిరాకీ పెరిగింది
బిర్యానీ కోసం ఆశగా లోపలి వెళ్ళాడు.. తిని బయటకి రాగానే ??
సందర్శకులను కట్టి పడేస్తున్న అరుదైన పుష్పాల ఫ్లవర్ షో
ఓర్నీ.. ఈ పాము ట్యాలెంట్ మామూలుగా లేదుగా
కొబ్బరిచెట్టుపై కాయలు కోస్తున్న కోతి.. నెట్టింట వీడియో వైరల్
కొవిడ్ తరహా స్క్రీనింగ్.. ఆ ఎయిర్పోర్టుల్లో మళ్ళీ మొదలు
పనిచేస్తున్న ఇంట్లోనే చోరీ.. రూ.18 కోట్ల బంగారం దోచుకెళ్లారు
పోలీసులమంటూ బంగారం దోపిడి.. పాలమూరులో నయా ముఠా

