Allu Arjun: పరిస్థితుల ఎఫెక్ట్.. పేరు మార్చుకుంటున్న అల్లు అర్జున్
పరిస్థితుల ప్రభావం కారణంగా కొందర్లో తెలియకుండానే కొన్ని నమ్మకాలు కలుగుతాయి. అలా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌లో కూడా పేరు మార్చుకోవాలని.. మార్చుకుంటే కలిసొస్తుందనే నమ్మకం కలిగి ఉండొచ్చని ఇండస్ట్రీలో ఇన్‌సైడ్ టాక్. ఇక అందుకే అన్నట్టు బన్నీ కూడా తన పేరులోని ఇంగ్లీష్ అక్షరాలలో మార్పులు చేసుకుంటున్నారట మన ఐకాన్ స్టార్.
న్యూమరాలజీ ప్రకారం.. తన పేరులో అదనంగా U,N గానీ జోడించుకుంటాడట. ఇలా చేస్తే గుర్తింపు మరింత పెరుగుతుందని బన్నీ బలంగా నమ్ముతున్నారట. గురూజీ సినిమాతో తన న్యూ స్పెలింగ్ ఉన్న నేమ్‌ను తన ఫ్యాన్స్‌కు పరిచయం చేస్తారట. మరి ఇందులో నిజం ఎంతుందో తెలియాలంటే కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఫిల్మ్ ఇండస్ట్రీలోనూ సెంటిమెంట్స్ కామన్. సెంటిమెంట్స్‌ను బలంగా నమ్మి.. సక్సెస్ అయిన వాళ్లు కూడా కామన్.అయితే తాజాగా రామ్ చరణ్ మాత్రం తనకు తెలియకపోయినా తనో సెంటిమెంట్ ఫాలో అవుతున్నాడనే కామెంట్ వచ్చేలా చేసుకుంటున్నాడు నెట్టింట. యాక్చువల్‌గా చరణ్ , బుచ్చిబాబు సనా డైరెక్షన్లో చేస్తున్న పెద్ది మూవీ నుంచి చెర్రీ బర్త్ డే సందర్భంగా ఓ వీడియో గ్లింప్స్ రిలీజ్ కావాల్సి ఉంది. కానీ అది రెహ్మాన్ అనారోగ్య పరిస్థితుల వల్ల ఆగిపోయింది. ఇక ఇప్పుడు ఆ గ్లింప్సే శ్రీరామ నవమికి రానుంది. దీంతో చరణ్ ఫ్యాన్స్ దీన్నో సెంటిమెంట్‌గా ఫీలవుతున్నారు. చరణ్ రామ భక్తుడని… చరణ్ పేరులో రామ్ ఉందని.. అందుకు ఆ రోజునే పెద్ది గ్లింప్స్ రావడం ప్రత్యేకం అంటున్నారు కొందరు ఫ్యాన్స్. ఇంకొందరేమో.. కావాలనే మేకర్స్ నవమిని ఎంచుకున్నారంటూ కాస్త గట్టిగా చెబుతున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
ఓర్నీ.. కుర్రాళ్లు సల్లగుండా.. చీట్ చేసి అలా ఎలా ఎస్కేప్ అయ్యరురా బాబు..
అచ్చం మైఖేల్ జాక్సన్‌లా డాన్స్ అదరగొట్టిన ప్రొఫెసర్
ఇలాంటి భర్తకు దండేసి దండం పెట్టాలి.. మరీ ఇంత త్యాగం ఎలా చేశావ్ మావ..
Bangkok Pilla: భూకంపం ఏమో కానీ.. ఈమెకు మాత్రం భలే గిరాకీ పెరిగింది