IPL 2025 Points Table: హ్యాట్రిక్ ఓటమితో హైదరాబాద్‌కు ఊహించని షాక్.. పాయింట్ల పట్టికలో ఎక్కడుందంటే?
IPL 2025 Points Table updated after KKR vs SRH: ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా 15వ మ్యాచ్ సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్ రైడర్స్ మధ్య జరిగింది. ఇందులో సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు ఏకంగా 80 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ ఓటమితో పాయింట్ల పట్టికలో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు ఘోర పరాభవం చవి చూడాల్సి వచ్చింది.

IPL 2025 Points Table: ఐపీఎల్ 2025 సీజన్‌లో 15వ మ్యాచ్ కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానంలో సన్‌రైజర్స్ హైదరాబాద్ వర్సెస్ కోల్‌కతా నైట్‌రైడర్స్ మధ్య జరిగింది. గత సీజన్లలాగే ఐపీఎల్ 2025లోనూ సన్‌రైజర్స్ హైదరాబాద్ కేకేఆర్ ముందు లొంగిపోయింది. 2024 సీజన్ ఫైనల్లో ఓటమి తర్వాత, హైదరాబాద్ జట్టు ఏడాది తర్వాత కూడా కేకేఆర్‌ను అధిగమించలేకపోయింది. 201 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్‌కతా జట్టు 120 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ ఓటమితో హైదరాబాద్ జట్టు పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి 10వ స్థానానికి పడిపోయింది. ఈ విజయంతో కోల్‌కత్తా జట్టు 10వ స్థానం నుంచి నేరుగా 5వ స్థానానికి చేరుకుంది.
సన్‌రైజర్స్ హైదరాబాద్ గురించి మాట్లాడుకుంటే మొదటి మ్యాచ్‌లో రాజస్థాన్‌పై 286 పరుగులు చేసి గెలిచింది. ఆ తర్వాత గత మూడు మ్యాచ్‌ల్లో హైదరాబాద్ టాప్ ఆర్డర్‌లో భాగమైన ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ ప్రత్యేకంగా ఏమీ చేయలేకపోయారు. దీని కారణంగా హైదరాబాద్ జట్టు వరుసగా మూడు మ్యాచ్‌ల్లోనూ ఓడిపోయింది. మరోవైపు బెంగళూరు చేతిలో తొలి మ్యాచ్‌లో ఓడిపోయిన కేకేఆర్ జట్టు.. ఆ తర్వాత రాజస్థాన్‌పై విజయం సాధించింది. ఆ తరువాత ముంబై చేతిలో ఓడిపోయింది. కానీ, రహానె జట్టు మళ్ళీ విజయాల బాట పట్టింది.
IPL 2025 పాయింట్ల పట్టికలో ఏ జట్టు ఏ స్థానంలో ఉందంటే?
1) పంజాబ్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓడినవి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.485)
2) ఢిల్లీ క్యాపిటల్స్ : (మ్యాచ్‌లు – 2, గెలుపు – 2, ఓటమి – 0, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 1.320)
3) రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 1.149)
4) గుజరాత్ టైటాన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 2, ఓడినవి – 1, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 4, నెట్ రన్ రేట్ – 0.807)
5) ముంబై ఇండియన్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – 0.309)
6) లక్నో సూపర్ జెయింట్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓడినవి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – – 0.150)
7) చెన్నై సూపర్ కింగ్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.771)
8) సన్‌రైజర్స్ హైదరాబాద్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -0.871)
9) రాజస్థాన్ రాయల్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.112)
10) కోల్‌కతా నైట్ రైడర్స్ : (మ్యాచ్‌లు – 3, గెలుపు – 1, ఓటమి – 2, ఫలితం లేదు – 0, టై – 0, పాయింట్లు – 2, నెట్ రన్ రేట్ – -1.428).
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..