Video: లెఫ్ట్‌కు రైట్.. రైట్‌కు లెఫ్ట్.. అరంగేట్రంలోనే చరిత్ర సృష్టించిన కావ్యపాప ప్లేయర్
హైదరాబాద్ బౌలర్లు కేకేఆర్ బ్యాటర్ల ముందు చిత్తుగా ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 200 పరుగులు చేసింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. సిమర్జీత్ సింగ్ 47 పరుగులు ఇచ్చాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.

Kamindu Mendis Bowling With Two Different Hands In KKR vs SRH: ఐపీఎల్ 2025లో భాగంగా 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున కమిందు మెండిస్ అరంగేట్రం చేసిన సంగతి తెలిసిందే. ఈ శ్రీలంక ఆటగాడు తొలి మ్యాచ్‌లోనే చరిత్ర సృష్టించాడు. ఐపీఎల్‌లో తొలిసారిగా ఒక బౌలర్ రెండు చేతులతో బౌలింగ్ చేశాడు. 13వ ఓవర్లో పాట్ కమ్మిన్స్ బంతిని కమిందు మెండిస్‌కు అందించాడు. ఈ ఆల్ రౌండర్ వచ్చిన వెంటనే అద్భుతం చేశాడు. ఎడమచేతి వాటం వెంకటేష్ అయ్యర్‌కు కుడిచేతితో బౌలింగ్ చేయగా, కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్ అంగక్రిష్ రఘువంశీకి ఎడమచేతితో బౌలింగ్ చేసి ఆశ్చర్యపరిచాడు.
తొలి ఓవర్లోనే వికెట్..
Left 👉 Right Right 👉 Left Confused? 🤔
That’s what Kamindu Mendis causes in the minds of batters 😉
Updates ▶ https://t.co/jahSPzdeys#TATAIPL | #KKRvSRH | @SunRisers pic.twitter.com/IJH0N1c3kT
— IndianPremierLeague (@IPL) April 3, 2025
కమిందు మెండిస్ తన తొలి ఓవర్లోనే అద్భుతాలు చేశాడు. ఈ ఆటగాడు తన ఐపీఎల్ కెరీర్‌లో మూడవ బంతికే వికెట్ తీసుకున్నాడు. హాఫ్ సెంచరీ చేసి డేంజరస్‌గా మారిన అంగ్క్రిష్ రఘువంశీ వికెట్‌ను మెండిస్ పడగొట్టాడు. అయితే, ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకే ఓవర్ వేసిన కమిందు కేవలం 4 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. అయితే మెండిస్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ రెండో ఓవర్ వేసే అవకాశం ఇవ్వలేదు.
హైదరాబాద్ బౌలర్లు ఘోర వైఫల్యం..
మ్యాచ్ గురించి చెప్పాలంటే, హైదరాబాద్ బౌలర్లు కేకేఆర్ బ్యాటర్ల ముందు చిత్తుగా ఓడిపోయారు. మొదట బ్యాటింగ్ చేసిన కోల్‌కతా నైట్ రైడర్స్ 200 పరుగులు చేసింది. కెప్టెన్ పాట్ కమ్మిన్స్ 4 ఓవర్లలో 44 పరుగులు ఇచ్చాడు. సిమర్జీత్ సింగ్ 47 పరుగులు ఇచ్చాడు. హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 43 పరుగులిచ్చి ఒక వికెట్ తీసుకున్నాడు. మహ్మద్ షమీ 4 ఓవర్లలో 29 పరుగులిచ్చి ఒక వికెట్ పడగొట్టాడు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..