AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

యవ్వనంగా కనిపించాలంటే మీ డైట్ లో ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని చేర్చండి..!

చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడానికి కొల్లాజెన్ చాలా కీలకం. ఇది చర్మానికి మృదుత్వాన్ని ఇస్తుంది. సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు సరైన ఆహారం, నిద్ర, మానసిక ప్రశాంతత అవసరం. కొల్లాజెన్ పెరిగితే చర్మం మరింత మెరుస్తుంది. ఇంట్లోనే కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచే కొన్ని చిట్కాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

యవ్వనంగా కనిపించాలంటే మీ డైట్ లో ఈ టాప్ బెస్ట్ ఫుడ్స్ ని చేర్చండి..!
శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి తగినంత నిద్రపోవడం చాలా ముఖ్యం. రోజుకు కనీసం 7 నుంచి 8 గంటలు నిద్రపోవాలి. కానీ కొంతమంది అమ్మాయిలు ఆలస్యంగా పడుకుని ఉదయాన్నే త్వరగా మేల్కొంటారు. వీరికి తగినంత నిద్ర ఉండదు. ఈ నిద్ర లేకపోవడం ఒత్తిడికి గురిచేసి వృద్ధాప్య ప్రక్రియను వేగవంతం చేస్తుంది.
Prashanthi V
|

Updated on: Apr 03, 2025 | 10:08 PM

Share

చర్మం అందంగా, ఆరోగ్యంగా మెరిపించడానికి కొల్లాజెన్ అనేది చాలా ముఖ్యమైన ప్రోటీన్. ఇది చర్మాన్ని మెరిపించడానికి బాగా సహాయపడుతుంది. కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతే చర్మం ఉజ్వలత కోల్పోతుంది, ముడతలు ఏర్పడుతాయి. సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తిని పెంచేందుకు కొన్ని ఇంటి చిట్కాలను పాటిస్తే చర్మం మరింత కాంతివంతంగా మారుతుంది.

చర్మానికి అవసరమైన కొల్లాజెన్ స్థాయిని పెంచేందుకు విటమిన్ C చాలా అవసరం. నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరికాయ వంటి పండ్లలో విటమిన్ C ఎక్కువగా ఉంటుంది. ఇవి రోజూ ఆహారంలో తీసుకుంటే చర్మం ప్రకాశిస్తుంది. అలాగే నిమ్మరసం లేదా నిమ్మ తొక్కను ఫేస్ ప్యాక్‌లుగా ఉపయోగిస్తే సహజంగా మెరుపు వస్తుంది.

శరీరంలో కొల్లాజెన్ స్థాయిని పెంచాలంటే ప్రోటీన్ ఎక్కువగా ఉండే ఆహారం తీసుకోవాలి. మాంసాహారం తినేవారు గుడ్లు, చేపలు వంటి ఆహారాన్ని తీసుకోవడం వల్ల కొల్లాజెన్ స్థాయి పెరుగుతుంది. అలాగే శాకాహారులు పనీర్, పెరుగు, పప్పులు, బీన్స్ వంటి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్‌ను తినడం వల్ల సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరుగుతుంది.

చర్మానికి మెరుపుని అందించేందుకు కొల్లాజెన్ సప్లిమెంట్స్ కూడా చాలా ఉపయోగపడతాయి. అయితే ఏ సప్లిమెంట్స్ తీసుకోవాలో డాక్టర్ సలహా తీసుకోవడం మంచిది. సరైన మోతాదులో తీసుకుంటే చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే అవకాశముంది.

క్రమంగా కొల్లాజెన్ స్థాయి తగ్గిపోవడానికి తగినంత నిద్ర లేకపోవడమూ ఒక కారణం. ప్రతిరోజూ కనీసం 7-8 గంటలు నిద్రపోతే శరీరం కొల్లాజెన్ ఉత్పత్తిని మెరుగుపరచగలదు. నిద్ర సరిపోకపోతే చర్మం ముడతలు పడే అవకాశం ఎక్కువ. కాబట్టి తగినంత విశ్రాంతిని తీసుకోవడం తప్పనిసరి.

ఆరోగ్యకరమైన మానసిక స్థితి కూడా చర్మంపై ప్రభావం చూపుతుంది. స్ట్రెస్ ఎక్కువగా ఉంటే కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గిపోతుంది. దీని వల్ల చర్మం మెరుపును కోల్పోతుంది. ప్రతిరోజూ ఆనందంగా, ప్రశాంతంగా ఉంటే సహజ కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం మరింత అందంగా మారుతుంది. అలాగే సరైన జీవనశైలిని కూడా పాటించాలి.

  • నీటిని ఎక్కువగా తాగడం వల్ల శరీరం హైడ్రేటెడ్‌గా ఉంటుంది. దీంతో చర్మం కాంతివంతంగా కనిపిస్తుంది.
  • రోజూ యోగా, మెడిటేషన్ వంటి అలవాట్లను పాటిస్తే ఒత్తిడి తగ్గి చర్మం ఆరోగ్యంగా ఉంటుంది.
  • ఫాస్ట్ ఫుడ్, షుగర్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తగ్గించి పోషకాహారం తీసుకోవాలి.

ఈ చిన్న చిట్కాలను పాటిస్తే సహజంగా కొల్లాజెన్ ఉత్పత్తి పెరిగి చర్మం కాంతివంతంగా, ఆరోగ్యంగా మారుతుంది.

600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
600 ఏళ్ల చరిత్ర.. అన్నమయ్య కాలిబాట మూసివేతకు అసలు కారణం..
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
ప్రపంచంలోనే ఎత్తైన జలపాతం..ఆకాశం నుండి చూస్తే ఎలా ఉంటుందో తెలుసా?
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
కిడ్నీ రోగులకు ఈ జ్యూస్ విషంతో సమానం.. పొరపాటున కూడా తాగకండి
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
నీలి చిత్రాల్లో నటించమని ఒత్తిడి చేశారు..
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
బ్యాంకులు 2026లో వారానికి 5 రోజులే పని చేస్తాయా ??
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
అప్పు చేసి ప్రైవేట్ స్కూల్‌కు ఎందుకు.. విద్యార్థిని ఇంగ్లీష్..
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
చైనా‎మ్యాన్, ప్రసిద్ధ్ కృష్ణ మ్యాజిక్‎కు చిత్తైన సఫారీలు
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
పొరిగింటి పుల్ల కూరకు మరిగి.. ఇంటి ఆయన్ను ఏసేసింది...
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
నల్లటి ఇసుక ఎడారిలో పరిగెడుతున్న రంగు రంగుల గుర్రాలు..వీడియోవైరల్
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ
ఎన్నడు లేని ఆఫర్లు..రూ. 4590కే వాషింగ్ మెషీన్, రూ.5,999కే టీవీ