కావ్య పాప పిలుపుతో హనీమూన్ క్యాన్సిల్.. కట్‌చేస్తే.. ఈడెన్‌లో ఎంట్రీ ఇచ్చిన 75 లక్షల ఎస్‌ఆర్‌హెచ్ ప్లేయర్
Kamindu Mendis cancelled Honeymoon: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున ఓ ప్లేయర్ అరంగేట్రం చేశాడు. కోల్‌కతా నైట్ రైడర్స్ జరిగిన ఈ మ్యాచ్‌లో ఈడెన్ గార్డెన్స్‌లో ఓ మరపురాని ఎంట్రీ ఇచ్చాడు. అయితే, ఇందుకోసం తన హనీమూన్‌ను కూడా వదులుకుని ఐపీఎల్‌లో తొలిసారి ఆడేందుకు వచ్చాడు.

Kamindu Mendis cancelled Honeymoon: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో భాగంగా జరిగిన 15వ మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున ఓ ఆటగాడు అరంగేట్రం చేశాడు. శ్రీలంక ప్లేయర్ కమిందు మెండిస్ కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరపున అరంగేట్రం చేశాడు. ఐపీఎల్ వేలంలో కావ్య మారన్ ఈ ఆటగాడిని రూ. 75 లక్షలకు కొనుగోలు చేసింది. కావ్య పిలుపుతో ఈ శ్రీలంక ఆల్ రౌండర్ కమిందు మెండిస్ తన హనీమూన్‌ను వాయిదా వేసుకుని ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025లో ఆడుతున్నాడు. అంటే, ఐపీఎల్ కోసం తన హనీమూన్‌ను త్యాగం చేసుకున్నాడన్నమాట. అయితే, రెండు చేతులతో బౌలింగ్ చేయడం ఈ ఆటగాడి స్పెషల్. ఎడమచేతి వాటం ప్లేయర్ బ్యాటింగ్ చేయడంలోనూ పేరుగాంచాడు. కాగా, ఏప్రిల్ 3న ఈడెన్ గార్డెన్స్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR)తో జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (SRH) తరపున ఐపీఎల్‌లోకి తొలిసారి అడుగుపెట్టాడు. అయితే, బౌలింగ్‌లో కేవలం ఒకే ఓవర్ వేసి 4 పరుగులు ఇచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అనంతరం బ్యాటింగ్ సమయంలో అంచనాలు అందుకోలేకపోయాడు. 20 బంతులు ఎదుర్కొని 27 పరుగులు చేశాడు. ఇందులో 2 సిక్సులు, 1 ఫోర్ ఉంది.
IPL 2025 కోసం హనీమూన్‌కు దూరంగా..
కమిందు మెండిస్ తన చిరకాల స్నేహితురాలు నిష్నిని మార్చి 2025లో వివాహం చేసుకున్నాడు. గత ఏప్రిల్‌లో నిశ్చితార్థం జరిగినప్పటి నుంచి ఈ జంట వివాహం చర్చనీయాంశంగా మారింది.
శ్రీలంకలోని అందమైన ప్రదేశమైన హపుటలేలో కమిందు, నిష్ని హనీమూన్ ప్లాన్ చేశారు. అయితే, ఐపీఎల్ సీజన్ కోసం కమిందే హైదరాబాద్ జట్టులో చేరాల్సి వచ్చింది. తన హనీమూన్ కంటే ఐపీఎల్‌కే తొలి ప్రాధాన్యం ఇవ్వడం వల్ల ఆటతోపాటు, పెద్ద లీగ్ పట్ల తన అంకితభావాన్ని చూపించాడని అంతా కామెంట్స్ చేస్తున్నారు.
కమిందు మెండిస్‌కు మద్దతుగా భార్య..
New beginnings 🧡
Kamindu Mendis | #PlayWithFire | #KKRvSRH | #TATAIPL2025 pic.twitter.com/DXS3Ld55PX
— SunRisers Hyderabad (@SunRisers) April 3, 2025
క్రికెట్ పట్ల తన నిబద్ధతను అర్థం చేసుకునే నిష్ని లాంటి భాగస్వామి ఉండటం కమిందు అదృష్టమని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ఆమె ప్రోత్సాహం అతని వ్యక్తిగత, వృత్తిపరమైన ప్రయాణంలో కీలక పాత్ర పోషిస్తుందని భావిస్తున్నారు.
మరిన్ని ఐపీఎల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..