AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?

RR vs CSK, IPL 2025: చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ ధోని చాలా మందికి ఆదర్శం. అయితే, ఈ లిస్ట్‌లో కేవలం అభిమానులే కాదు.. ఎంతోమంది క్రికెటర్లు కూడా ఉన్నారు. ఇలాంటి వారిలో ఓ యంగ్ ప్లేయర్ కూడా ఉన్నాడు. ధోనిని అభిమాన వ్యక్తిగా భావించి, ఒక్క సెల్ఫీ కోసం తహతహలాడిన ఓ యంగ్ ప్లేయర్.. ఇప్పుడు ఏకంగా ధోని జట్టునే ఓడించే స్థాయికి ఎదిగాడు.

IPL 2025: నాడు ధోనితో ఫొటో కోసం ఎదురుచూపులు.. కట్‌చేస్తే.. నేడు తలా టీం పాలిట యముడయ్యాడు.. ఎవరంటే?
Ms Dhoni Riyan Parag
Venkata Chari
|

Updated on: Mar 31, 2025 | 5:34 PM

Share

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో వరుసగా రెండు పరాజయాల తర్వాత, రియాన్ పరాగ్ నేతృత్వంలోని రాజస్థాన్ రాయల్స్ జట్టు తొలి విజయాన్ని అందుకుంది. ఈ సీజన్‌లో 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ చెన్నై సూపర్ కింగ్స్‌ను కేవలం 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ మ్యాచ్ చివరి ఓవర్ వరకు ఉత్కంఠభరితంగా సాగింది. చివరి ఓవర్లో చెన్నై గెలవడానికి 20 పరుగులు అవసరం. మహేంద్ర సింగ్ ధోని, రవీంద్ర జడేజా క్రీజులో ఉన్నారు. కానీ, కెప్టెన్ రియాన్ పరాగ్ రాజస్థాన్ తరపున మాస్టర్ స్ట్రోక్‌గా మారాడు. ఈ మాస్టర్ స్ట్రోక్ ముందు మహి మ్యాజిక్ కూడా పని చేయలేదు.

సీఎస్కే మాజీ కెప్టెన్ ధోని చాలా మందికి ఆదర్శం అనే సంగతి తెలిసిందే. ఇది కేవలం అభిమానులు మాత్రమే కాదండోయ్.. ఈ లిస్ట్‌లో చాలామంది క్రికెటర్లు కూడా ఉన్నారు. ధోనిని తన అభిమాన వ్యక్తిగా భావించి పెరిగిన వారిలో రియాన్ పరాగ్ కూడా ఒకడు. చిన్నప్పుడు ధోనితో ఫొటో కోసం తహతహలాడిన పరాగ్.. ఇప్పుడు ఏకంగా ధోని జట్టునే ఓడించే స్థాయికి ఎదిగాడు. ఈ క్రమంలో చెన్నైపై విజయం తర్వాత పరాగ్ చిన్నప్పుడు ధోనితో తీసుకున్న ఫొటో తెగ వైరల్ అవుతోంది.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Video: ఇక మారవా పరాగ్.. ఫ్యాన్స్‌ ముందు ఇదేం యాటిట్యూట్.. ఏకిపారేస్తోన్న నెటిజన్లు

ధోనితో రియాన్ ఫొటో..

43 ఏళ్ల ఎంఎస్ ధోని 2004లో క్రికెట్‌లోకి అడుగుపెట్టినప్పుడు పరాగ్ వయసు కేవలం 3 సంవత్సరాలు. ఆసక్తికరంగా, రియాగ్ తండ్రి పరాగ్ దాస్ కూడా రంజీ ట్రోఫీలో ధోనితో ఆడాడు. 1999-2000లో బీహార్ తరపున రంజీ ట్రోఫీలో అరంగేట్రం చేసిన ధోనిపై పరాగ్ దాస్ అస్సాం జట్టుకు ప్రాతినిధ్యం వహించాడు. అతను అస్సాం జట్టు తరపున 43 ఫస్ట్-క్లాస్, 32 లిస్ట్-ఎ మ్యాచ్‌లలో కూడా ఆడాడు. మరో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, ధోని రియాగ్ తండ్రిని స్టంప్ చేశాడు.

ఇది కూడా చదవండి: IPL 2025: కావ్య మారన్ బృందానికి బెదిరింపులు.. కట్‌చేస్తే.. ఉప్పల్ నుంచి తరలనున్న ఎస్‌ఆర్‌హెచ్ మ్యాచ్‌లు

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025లో జరిగిన 11వ మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టు చెన్నై సూపర్ కింగ్స్‌ను 6 పరుగుల తేడాతో ఓడించింది. ఈ విజయంతో రాజస్థాన్ హ్యాట్రిక్ పరాజయాలను తప్పించుకుంది. రాజస్థాన్ జట్టు తమ మొదటి రెండు మ్యాచ్‌ల్లో ఘోర పరాజయాలను అందుకుంది. గౌహతిలోని బర్సపారా క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో రాజస్థాన్ ఓడిపోయే ప్రమాదం ఉంది. కానీ, చివరి ఓవర్‌లో రాజస్థాన్ మ్యాచ్ గమనాన్ని మార్చేసింది. ధోని అవుట్ కావడంతో రాజస్తాన్ రాయల్స్ ఎట్టకేలకు తమ తొలి విజయాన్ని అందుకుంది.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us