AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hardik Pandya: కేకేఆర్‌లోకి హార్దిక్ పాండ్యా? సోషల్ మీడియాను ఊపేస్తున్న వరుణ్ చక్రవర్తి వీడియో

Hardik Pandya: వరుణ్ చక్రవర్తితో హార్దిక్ పాండ్యా సరదా వీడియో వైరల్ కావడంతో కేకేఆర్ ట్రేడ్ రూమర్స్ మళ్లీ తెరపైకి వచ్చాయి. ఐపీఎల్ 2027కి ముందు హార్దిక్‌ను ముంబై ఇండియన్స్ నుంచి తీసుకునేందుకు కేకేఆర్ ఆసక్తి చూపుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. సీఎస్‌కే, ఎల్‌ఎస్‌జీ కూడా రేసులో ఉన్నట్లు సమాచారం. అయితే హార్దిక్ ట్రేడ్‌పై ఇప్పటివరకు అధికారిక ప్రకటన మాత్రం వెలువడలేదు.

Hardik Pandya: కేకేఆర్‌లోకి హార్దిక్ పాండ్యా? సోషల్ మీడియాను ఊపేస్తున్న వరుణ్ చక్రవర్తి వీడియో
Hardik Pandya
Rakesh
|

Updated on: Aug 12, 2026 | 7:51 PM

Share

Hardik Pandya: హార్దిక్ పాండ్యా కోల్‌కతా నైట్ రైడర్స్ వైపు అడుగులు వేస్తున్నారా? బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్‌లో వరుణ్ చక్రవర్తి సరదాగా వర్కవుట్ చేస్తుండగా హార్దిక్ చేసిన హంగామా ఇప్పుడు సంచలనంగా మారింది. ఐపీఎల్ 2027 ముందు ఈ వీడియో రాబోయే బిగ్గెస్ట్ ట్రేడింగ్ బాంబ్‌కు సంకేతమా అని అభిమానులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన టీ20 సిరీస్ సందర్భంగా తొడ కండరాల గాయానికి గురైన కేకేఆర్ మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ప్రస్తుతం బెంగళూరులోని బీసీసీఐ నేషనల్ క్రికెట్ అకాడమీ (CoE)లో కోలుకుంటున్నారు. త్వరలోనే శ్రీలంకతో జరగనున్న టెస్ట్ సిరీస్ నాటికి పూర్తి ఫిట్‌నెస్ సాధించేందుకు ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నారు. అక్కడ వరుణ్ చక్రవర్తి వెయిట్స్ ఎత్తుతూ తీవ్రంగా వర్కవుట్స్ చేస్తున్న సమయంలో టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా ఆయనను అనుకరిస్తూ సరదాగా అల్లరి చేశారు. ఈ చిన్న వీడియాని కేకేఆర్ తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయడంతో క్షణాల్లో వైరల్‌గా మారింది.

కేకేఆర్ కెప్టెన్ అజింక్యా రహానే అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించడంతో వచ్చే ఐపీఎల్ 2027 సీజన్ నాటికి నైట్ రైడర్స్‌కు ఒక పవర్‌ఫుల్ కెప్టెన్ అత్యవసరంగా మారారు. రింకూ సింగ్‌ను కెప్టెన్‌గా ప్రమోట్ చేసే ఆలోచన ఉన్నప్పటికీ గుజరాత్ టైటాన్స్‌ను అరంగేట్రం చేసిన తొలి ఏడాదే ఛాంపియన్‌గా నిలబెట్టిన హార్దిక్ పాండ్యా అనుభవం తమకు ఎంతో ఉపయోగపడుతుందని కేకేఆర్ భావిస్తోంది. ముంబై ఇండియన్స్‌లో హార్దిక్ భవిష్యత్తుపై ఇప్పటికే రకరకాల పుకార్లు షికారు చేస్తున్న వేళ కేకేఆర్ చూపించే ఆసక్తి ఐపీఎల్ వర్గాల్లో ఆసక్తికరంగా మారింది.

ట్రేడింగ్ లెక్కలు.. ముంబై ఇండియన్స్ మొండి పట్టు

హార్దిక్ పాండ్యాను తమ జట్టులోకి తెచ్చుకోవడానికి కేకేఆర్ తీవ్రంగా ప్రయత్నిస్తున్నప్పటికీ తన స్టార్ ఆటగాళ్లను ముంబైకి ఇచ్చేందుకు మాత్రం సిద్ధంగా లేదు. కేకేఆర్ ఆస్ట్రేలియా స్టార్ ఆల్‌రౌండర్ కేమరాన్ గ్రీన్ పేరును ప్రతిపాదించే అవకాశం ఉన్నప్పటికీ వచ్చే ఏడాది ఐపీఎల్ ముగిసిన వెంటనే ప్రతిష్టాత్మక యాషెస్ సిరీస్ ఉండనుంది. దీంతో గ్రీన్ అందుబాటుపై అనిశ్చితి నెలకొనడంతో ఈ ఆఫర్‌కు ముంబై ఇండియన్స్ అంగీకరించే అవకాశం తక్కువగా కనిపిస్తోంది.

రేసులో ఎవరెవరు?

హార్దిక్ కోసం కేకేఆర్‌తో పాటు చెన్నై సూపర్ కింగ్స్ (CSK), లక్నో సూపర్ జెయింట్స్ (LSG) కూడా పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. గుజరాత్ టైటాన్స్‌కు మళ్లీ వెళ్లాలని హార్దిక్ భావించినా కెప్టెన్సీ షరతు కారణంగా ఆ డీల్ ఆగిపోయినట్లు ప్రచారం సాగుతోంది. అయితే ముంబై ఇండియన్స్ యాజమాన్యం మాత్రం దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. వరుణ్ చక్రవర్తి, హార్దిక్ పాండ్యాల సరదా వీడియో కేవలం జిమ్ వర్కవుట్ సరదా మాత్రమేనా లేక ఐపీఎల్ ట్రేడింగ్ విండోలో రాబోయే ఒక భారీ సంచలనానికి సంకేతమా అనేది రాబోయే రోజుల్లో తేలనుంది.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us