AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikandar: సల్మాన్ ఖాన్ సికిందర్‌ సినిమాపై నిషేధం విధించాలి.. ముస్లిం యాక్టివిస్ట్ డిమాండ్.. ఎందుకంటే?

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్నాలు జంటగా నటించిన తాజా చిత్రం సికిందర్. మురుగ దాస్ దర్శకత్వం వహించిన ఈ సినిమా రంజాన్ కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ముంబైలోని ఒక ముస్లిం కార్యకర్త సల్మాన్ ఖాన్ సినిమా 'సికందర్' ను బహిష్కరించాలని డిమాండ్ చేస్తున్నాడు. ఈ కార్యకర్త ఇప్పుడు అంత డిమాండ్ ఎందుకు చేస్తున్నాడు? అసలు అతని సమస్య ఏమిటో తెలుసుకుందాం రండి.

Sikandar: సల్మాన్ ఖాన్  సికిందర్‌ సినిమాపై నిషేధం విధించాలి.. ముస్లిం యాక్టివిస్ట్ డిమాండ్.. ఎందుకంటే?
Sikandar Movie
Basha Shek
|

Updated on: Apr 03, 2025 | 10:19 PM

Share

దాదాపు రెండు సంవత్సరాల తర్వాత బాలీవుడ్ భాయ్‌జాన్ సల్మాన్ ఖాన్ సినిమా థియేటర్లలో రిలీజైంది. మురగ దాస్ దర్శకత్వంలో సల్మాన్ హీరోగా తెరకెక్కిన ‘సికందర్’ మార్చి 30న విడుదలైంది. ఈ సినిమా రిలీజ్ కోసం సల్మాన్ అభిమానులందరూ ఆసక్తిగా ఎదురు చూశారు. అందుకు తగ్గట్టుగానే రంజాన్ సందర్భంగా సికందర్ సినిమా గ్రాండ్ గా విడుదలైంది. అయితే ఈ చిత్రానికి మిశ్రమ స్పందనలు వస్తున్నాయి. కలెక్షన్లు కూడా అంతంతమాత్రంగానే వస్తున్నాయి. ఇంతలో ముంబైలో సినిమాను బహిష్కరించాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి. ఒక ముస్లిం కార్యకర్త సల్మాన్ ఖాన్ సినిమా ప్రదర్శనలను అడ్డుకోవాలంటున్నాడు. ముంబై కు చెందిన న్యాయవాది, ముస్లిం సామాజిక కార్యకర్త షేక్ ఫయాజ్ ఆలం ముస్లింలందరూ సల్మాన్ ఖాన్ సినిమాను బహిష్కరించాలని కోరారు. దర్శకుడు ఏఆర్‌ మురుగదాస్‌ గతంలో ‘తుపాకి’ సినిమాలో ఇస్లామోఫోబియా చూపించారని న్యాయవాది ఆగ్రహం వ్యక్తం చేశాడు.

‘వినోదం కోసం ఖర్చు చేయడానికి బదులుగా, గాజాకు విరాళం ఇవ్వండి. ముస్లిం విద్య, న్యాయ సహాయం, రాజకీయ సాధికారతకు డబ్బును ఖర్చు చేయండి. అలాగే ఇజ్రాయెల్ ఉత్పత్తులను బహిష్కరించండి. పాలస్తీనాను రక్షించడం అంటే ఇస్లాంను రక్షించడమే. ఇది వేడుకలకు సమయం కాదని, త్యాగాలకు సమయం’ అని ముంబై న్యాయవాది పిలుపు నిచ్చాడు. అయితే దీనిపై సల్మాన్ అభిమానులు మండిపడుతున్నారు. సినిమాలను అనవసర విషయాల్లోకి లాగొద్దని సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

సల్మాన్ ఖాన్, రష్మిక మందన్న జంటగా నటించిన ‘సికిందర్’ చిత్రానికి ఎఆర్ మురుగదాస్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా ఒక రొమాంటిక్ యాక్షన్ డ్రామా సినిమా. రంజాన్ తర్వాత ఈ సినిమా వసూళ్లు బాగా తగ్గాయి. సక్నిల్క్ ప్రకారం, ‘సికందర్’ చిత్రం 100 కోట్లు సంపాదించలేకపోయింది. ఈద్ సెలవుల తర్వాత అంటే మంగళవారం నాడు ఈ సినిమాకు 20 కోట్లు వచ్చాయి. అంటే ఈ సినిమా మూడు రోజుల్లో దాదాపు 74 కోట్ల రూపాయలు మాత్రమే వసూలు చేసింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
శబరిమల వెళ్లొస్తూ ఏపీకి చెందిన ఐదుగురు అయ్యప్ప భక్తుల దుర్మరణం..
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
ఖాళీ కడుపుతో నిమ్మరసం తాగితే ఏం జరుగుతుంది?
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
పిన్ నెంబర్‌తో వాట్సప్‌ను ఇలా లాక్ చేసుకుంటే మీరు సేఫ్
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
ఈ 5 హై-ప్రోటీన్ పనీర్ బ్రేక్‌ఫాస్ట్​లు ట్రై చేసి చూడండి
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
అదే నా నిజమైన వ్యక్తిత్వం అంటున్న బాలీవుడ్​ స్టార్​ హీరోయిన్​!
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
'పుష్ప 2' ప్రభంజనానికి ఏడాది.. అల్లు అర్జున్ వైరల్ పోస్ట్
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
అఖండ 2తో అరుదైన రికార్డు క్రియేట్​ చేసిన బాలయ్య!
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
ఎంగేజ్‌మెంట్ రింగ్ తొలగించిన స్మృతి మంధాన..? పోస్ట్ వైరల్
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
నటనా సరస్వతి సావిత్రి: మరువలేని మహానటి జయంతి ప్రత్యేక కథనం!
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..
చిన్నోడే కానీ తల్లి ప్రాణాన్ని కాపాడాడు.. అసలేం జరిగిందంటే..