AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌పై క్రేజీ అప్డేట్! హీరో, డైరెక్టర్ ఫిక్స్!

భారత క్రికెట్ చరిత్రలో సౌరవ్ గంగూలీది ఒక ప్రత్యేక ఆధ్యాయం. భారత క్రికెట్ జట్టు ఆలోచనా విధానాన్ని, రూపు రేఖల్ని మార్చిన ఘనత గంగూలీకే చెందుతుంది. అలాంటి దాదా జీవిత కథ గురించి సిల్వర్ స్క్రీన్ పై చూపాలని 2019 నుంచి చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడీ బయోపిక్ కు మోక్షం కలిగింది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి.

Sourav Ganguly Biopic: గంగూలీ బయోపిక్‌పై క్రేజీ అప్డేట్! హీరో, డైరెక్టర్ ఫిక్స్!
Sourav Ganguly Biopic
Follow us
Basha Shek

|

Updated on: Apr 03, 2025 | 6:59 PM

భారత క్రికెట్ జట్టుకు ఎంతో మంది కెప్టెన్లుగా పని చేశారు. అందులో బెంగాల్ టైగార్ సౌరవ్ గంగూలీది భిన్నమైన శైలి. నిజం చెప్పాలంటే భారత క్రికెట్ జట్టు రూపు రేఖలు మార్చిన ఘనత అతనికే సొంతం. ‘ బాగా ఆడితే చాలు’ అనే మనస్తత్వం నుండి ‘గెలవాలి’ అనే ఆలోచన తీసుకొచ్చిన వ్యక్తి గంగూలీ. అలాంటి దిగ్గజ క్రికెటర్ జీవితం గురించి సినిమా తీయాలనే చర్చ 2019 నుంచి ఉంది. 2019లో ఒక నిర్మాణ సంస్థ దాదా బయోపిక్ కు సంబంధించిన హక్కులను కొనుగోలు చేసింది. కానీ ఆ సినిమా సెట్ పైకి వెళ్లలేదు. మళ్లీ ఐదేళ్ల తర్వాత గంగూలీ బయోపిక్ గురించి మళ్లీ ఆసక్తికర వార్తలు వినిపిస్తున్నాయి. సౌరవ్ గంగూలీ పాత్రకు నటుడి ఎంపిక గురించి తరచుగా వార్తలు వస్తున్నాయి. మొదట్లో గంగూలీ పాత్రలో రణ్‌బీర్ కపూర్ నటించనున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత ఆయుష్మాన్ పేరు తెర మీదకు వచ్చింది. కానీ ఇప్పుడు నటుడు రాజ్ కుమార్ రావు గంగూలీ పాత్రను పోషించనున్నాడు. రాజ్‌కుమార్ రావుతో పాటు, కొంతమంది బెంగాలీ నటులు కూడా ఈ బయోపిక్ లో భాగం కానున్నారు.

ఇవి కూడా చదవండి

సౌరవ్ గంగూలీ బయోపిక్ కు విక్రమాదిత్య మోత్వానీ దర్శకత్వం వహించనున్నారు. దాదా సన్నిహితుడు, చిత్ర సహ నిర్మాత సంజయ్ దాస్ ప్రకారం ఈ బయోపిక్ స్క్రిప్ట్ మొదటి డ్రాఫ్ట్‌ను చదివి కొన్ని మార్పులను సూచించారట. త్వరలోనే ఫైనల్ స్క్రిప్ట్ రెడీ అవుతుందని, నటీనటులను కూడా ఫైనలేజ్ చేస్తారని తెలుస్తోంది. ఈ బయోపిక్ లో సౌరవ్ గంగూలీ బాల్యం, టీనేజ్, క్రికెట్ రోజులు, అతని నాయకత్వం, అలాగే అతని వ్యక్తిగత సమస్యల గురించి చూపించనున్నారు.ఈ బయోపిక్ లో గంగూలీ కూడా ఓ అతిథి పాత్రలో కనిపించనున్నారని సమాచారం.

తుది దశకు స్క్రిప్ట్ పనులు

కపిల్ దేవ్, ఎంఎస్ ధోని, ముత్తయ్య మురళీధరన్, మిథాలీ రాజ్, ప్రవీణ్ తాంబే, మహ్మద్ అజారుద్దీన్ వంటి క్రికెటర్ల జీవితాలపై ఇప్పటికే సినిమాలు విడుదలయ్యాయి. త్వరలోనే యువరాజ్ సింగ్ జీవితాన్ని కూడా సినిమాగా తీయనున్నారు.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
అరుదైన అమావాస్య.. ఆ రాశుల వారికి విశిష్ట యోగాలు పక్కా..!
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
గుట్టలాంటి పొట్టకు పవర్‌ఫుల్‌ ఛూమంత్రం.. ఈ 15 అలవాట్లతో హాంఫట్..
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
కేకేఆర్ కి శుభవార్త: జట్టు చేరిన జమ్మూ ఎక్స్‌ప్రెస్!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
పసిడిపై నమ్మలేని ఆఫర్లు.. ఆ యాప్స్‌లో అందుబాటులో డిజిటల్ గోల్డ్.!
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
బెంజ్ కారునుంచి లోకల్ ట్రైన్‌‌ వరకు పడిపోయాం..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
కోతులు ఆడించుకునేదనుకునేరు? ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
'తొలి బంతికే సిక్స్.. కట్‌చేస్తే.. ఏడాదికే కెరీర్ క్లోజ్'
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
భూకంపం వస్తుందని టిక్‌టాక్‌లో వీడియో.. ఆ తర్వాత ఏం జగిరిందంటే..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
41 ఫోర్లు, 21 సిక్సర్లతో విరుచుకుపడ్డ అరవీర భయంకరులు..
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌
ఫ్రీ హిట్‌ మిస్‌.. కావ్య మారన్‌ వైరల్ ఎక్స్‌ప్రెషన్‌